పేపర్లోనో,పత్రికలోనో ప్రచురణ అయిన ప్రతి ముక్కా తెచ్చి బ్లాగులో పెట్టేంత ఓపిక నాకు లేదు. అంత అవసరమూ కనిపించదు. కానీ ఈ మధ్య చేసిన ఒక ఇంటర్వ్యూ ఎంతో ఇష్టంతో చేశాను. బాలమురళీ కృష్ణ గారి ప్రియ శిష్యుడు శ్రీ డీవీ మోహన కృష్ణ గారి ఇంటర్వ్యూ ఈనాడు ఆదివారం సంచికకోసం!
ఆయన రేడియోలో సంగీత పాఠాలు నేర్చుకునేటపుడు మా చిన్నక్క శ్రద్ధగా కూచుని తనూ నేర్చుకునేది. మనకంత శ్రద్ధ లేదు కాబట్టి అటో ఇటో పోతూ అక్కడక్కడా గొంతు కలుపుతూ ఉండేదాన్ని. పైగా ఈయన బాలమురళి వద్ద పాఠం నేర్చుకుంటున్నపుడు ఎవరు గురువో, ఎవరు శిష్యుడో తెలిసేది కాదు. అంత సారూప్యత ఉంటుంది ఇద్దరి గొంతుల మధ్యా!
ఎన్నో సంగతుల్ని ఓపిగ్గా వివరించిన మోహన కృష్ణ గారిని అడగ్గానే కొన్ని పాటలు కూడా భేషజం లేకుండా పాడి వినిపించారు. ఇంటర్వ్యూ అనుకున్నది ఆత్మీయ మిత్రుల సమావేశంగా మారింది కాసేపటికి.
మోహన కృష్ణ ఒక అపురూపమైన శిష్యుడు. బాలమురళి ఒక అద్వితీయమైన గురువు గారు. గురుపూజోత్సవం సందర్భంగా ఈ రోజు ఈనాడు ఆదివారం లో వచ్చిన ఈ ఇంటర్వ్యూ ఇక్కడ ఇస్తున్నాను. కింద "వి.ఎల్.సుజాత" అని ఉంటుంది. నా పేరేలెండి అది! అన్ని రికార్డుల్లోనూ అలాగే ఉంటుంది మరి!
జీవితమే కృష్ణ సంగీతము అంటూ బాలమురళి పాడిన రాగమాలిక చిమట మ్యూజిక్ లో వినండి ఇక్కడ!
25 comments:
గురుపూజోత్సవం రోజున చాలా సందర్భోచితమైన వ్యాసం. Fist person narrative లో ఉండటంతో మరింత personal touch వచ్చింది. అభినందనలు.
సంతోషం.
పొద్దున్నే ఈనాడు లో ఇంటర్వ్యూ చదివాను కాని ఆ సుజాత గారు మీరేనని ఎంత మాత్రమూ తోచలేదు..
మోహనకృష్ణ గారి గురించి, అలాగే బాల మురళి గారి గురించి వివరాలు తెలుసుకోవడం.. అదీ గురుపూజ్యోత్సవం రోజున.. బాగుంది.
మీకు నా అభినందనలు..
సమయోచితంగా మంచి పరిచయం చేసారు,ధన్యవాదాలు.
చాలా బావుంది సుజాత గారూ! బ్లాక్ ప్రోగ్రామ్ చూసే దాకా ఆయన అంధుడని నాకు తెలియదు.వారి గొంతు నాక్కూడా ఎంతో ఇష్టం! దీన్ని ఈనాడు కోసం అందించి లక్షలాది పాఠకులకు అందించినదుకు థాంక్స్
నీలాంచల,
నిజానికి ఈ ఇంటర్వ్యూ అంతగా సర్క్యులేషన్ లేని ఒక చిన్న పత్రికలో పడబోయే ప్రమాదాన్ని చివరి నిముషంలో తప్పించుకుని ఈనాడుకు వచ్చింది.
థాంక్యూ!
మోహనకృష్ణ గారు నాకు గురువుగారండీ. విజయవాడలో నేను ఆయన దగ్గర రెండేళ్ళు పైనే సంగీతం నేర్చుకున్నాను. నా పెళ్ళికి కూడా వచ్చి నన్ను ఆశీర్వదించారు. ఎంతో ఓర్పుగల గొప్ప గురువుగారు. ఇంతకన్నా పొగిడితే గురువుగారు కాబట్టి పొగుడుకుంటున్నాను అనుకునేరు...
ఆయన గురించి రాయాలని ఎన్నాళ్ళనుంచో....ఇవాళ మీ పోశ్ట్ చూసి చాలా సంబరం కలిగింది.
Oh ! great Sujata garu.
U are a good singer too ! :D
When I heard u singing last sunday, I though u are fantabulous.
బావుంది సుజాత గారు. మోహన కృష్ణ గారు గురించి తెలుసుకోవడం ఆనందంగా ఉంది .
Thanks for posting this article.
>> లోపాలకి లొంగిపోకూడదు, కుంగిపోకూడదు.
>> వాటిని అధిగమిస్తూ ముందుకెలితే జీవితమంతా వెలుగే
Thats the inspiration for all of us.
మోహన కృష్ణగారిని బ్లాక్ ప్రోగ్రాంలో చూశాను. గురు పూజోత్సవం రోజున ఒక అద్భుతమైన గురు శిష్యుల అనుబంధం గురించి రాశారు ....నేనూ వ్యాసం చూశాను కానీ మీరని ఇప్పుడే తెలిసింది .అభినందనలు !
ఆహా గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని అద్వితీయమైన గురుశిష్యుల గురించి పరిచయం చేశారు సుజాత గారు. మోహన కృష్ణ గారి గురించి బాలమురళి గారి ప్రియ శిష్యులు గా కొంతే తెలుసు ఒకటి రెండు ఎపిసోడ్స్ బ్లాక్ లో కూడా చూశాను ఈ వ్యాసంలో తన గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది.
చాలా బాగుంది సుజాత గారూ!
శారద
నిజంగా అంది రాసింది మీరా...అస్సలు అనుకోలేదు సుమండీ...
చాలా బాగా రాసారు...
Instead of మోహనకృష్ణ ఎన్నొ భక్తిగీతాల క్యాసెట్లు రూపొందించారు
మోహనకృష్ణ గారు ఎన్నొ భక్తిగీతాల క్యాసెట్లు రూపొందించారు would have been better in my opinion...
Nothing offensive. Just wanted to mention...
As per the grammar rules, if formalness is not present in the subject, formalness shouldn't be present in the verb also.. vice versa.. if formalness is present in either of them, the other one also should assume formalness.
do correct me if i am wrong.
Things apart,
article was nice... good to know about a person and his life time experiences...
Hats off to his wife who is very supportive...
@Raj..
మీకు పత్రికా భాష గురించి క్లాసు తీసుకోను లెండి గానీ, గారు లేకుండా బహువచనం వాడటం ఎప్పటినుంచీ బయటా,అలాగే పత్రికల్లో కూడా ఉన్నదే! అది ఎంత మాత్రమూ తప్పు కాదు.పైగా పత్రికల్లో గారు వాడరు. ముఖ్యమంత్రి రోశయ్య ఇలా అన్నారు అని రాస్తారు తప్ప రోశయ్య "గారు" ఇలా అన్నారు అని రాయరు.అలా అయితే ప్రతి నాయకుడి పేరు వెనుకా ,వార్తల్లో ఉండే ప్రతి వ్యక్తి పేరు వెనుకా "గారు"! తగిలించాలి.ఇది సాధ్యం కాదు. అనవసరం కూడా! "గారు"అనేది పత్రికా భాషలో దాదాపుగా లేదు.
ఇప్పుడు..మీరున్నారు..మిమ్మల్ని నేను రాజేంద్ర అని పిలుస్తాను. కానీ మాట్లాడేటపుడు సందర్భానుసారంగా "మీరు చదివారా ఆ పుస్తకం, ఆ సినిమా మీరు చూశారా'అనే అంటాను కదా! అలాగ!
సాధారణ గ్రామర్ పత్రికలకు 100% వర్తించదు. అవసరమైనంత వరకూ మాత్రమే!
బావుంది సుజాత గారు. మోహన కృష్ణ గారు గురించి తెలుసుకోవడం ఆనందంగా ఉంది
Telugu News
సుజాత గారూ...,గణేష్ భక్తి గీతాల పారాయణం చేద్దాం
హారం
You did a great job. Felt very happy after reading this post. I was fortunate to meet him some time ago. Your piece reminded me of that.
పేపర్లోనో,పత్రికలోనో ప్రచురణ అయిన ప్రతి ముక్కా తెచ్చి బ్లాగులో పెట్టేంత ఓపిక నాకు లేదు
Hehehe. Well said
నాకు మొహన కృష్ణగారి గురించి బ్లాక్ ప్రోగ్రాం ద్వారానే మొదటిసారి తెలిసింది...ఆ ప్రోగ్రాం అవుతున్నంతసేపూ ఆయన గురించే ఆలోచిస్తుండేవాణ్ణి..ఒక వైకల్యాన్ని అధిగమించి ఆ స్థాయికి వచ్చారంటే ఆయన మనోనిబ్బరం ఏలాంటిదో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు...ఈనాడు ఆదివారం బుక్ మీద కాస్తో కూస్తో అభిమానం ఇంకా నాకు మిగిలి ఉందంటే ఇలాంటి ఆర్టికల్స్ మూలంగానే...థాంక్యూ సో మచ్ టు యు...
నేను మోహన కృష్ణ గారి ఇంటెర్వ్యూ ఏదో చానెల్ లో చూసాను..మీ పోస్ట్ ద్వారా మరిన్ని వివరాలు తెలిసాయి ధన్యవాదాలు
మీరు ఈ వ్యాసం వ్రాశారని తెలిసి సంతోషపడ్డాను. మహేశ్ గారు చక్కగా వ్యాఖ్య వ్రాశారు. నా మనసులో మాట అదే.
Chala manchi article rasaru Sujatha garu.. Thank you :)
సుజాత గారు , మీరు వ్రాసే టపాలు చాలా బాగుంటాయి. మోహనకృష్ణ గారి గురించి, ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది . లోపాల్ని చూస్తూ కుంగిపోవడం కన్నా వెలుతురు దిశగా ముందుకు సాగాలి అని ఆయనని చూసి నేర్చుకోవాలి.
ఇది నా బ్లొగ్ .
http://kvsubramanyam.wordpress.com/
అంత బాగుండక పొవచ్చు. కానీ వీలు చిక్కితే ఒక్కసారి చూడండి .
Very good post. thanks for sharing it with us sujatha garu
telugu songs free download
Post a Comment