September 29, 2008

మీ చదువులే మా చావులు!

మా అమ్మాయి సంకీర్తనకి కేజీ వయసు (కిండర్ గార్టెన్ వయసు) రాగానే అందరు తల్లి దండ్రుల్లాగే మేం కూడా ఆమెను "టాప్" స్కూల్లో వెయ్యాలని ఆశపడ్డాము. బెంగుళూరు నుంచి జూన్లో రావడం వల్ల రాగానే అడ్మిషన్స్ కోసం పెద్ద పెద్ద స్కూళ్ళన్నీ తిరిగాము. స్కూళ్ళ విషయంలో, స్కూలు ఫీజుల విషయంలో సిటీలు అడ్డూ, అదుపూ లేకుండా ప్రవర్తిస్తున్నాయని అప్పటిదాకా నాకు సరిగా తెలియదు.(క్షవరం అయితే గానీ వివరం తెలీదని సామెత ఉంది లెండి)


తిరుగుతూ మేం అందరూ గొప్పగా చెప్పుకునే "గల్లీ పబ్లిక్ స్కూల్" కి వెళ్ళాం! రిసెప్షన్ లో అమ్మాయి లిప్ స్టిక్ సరిచూసుకుంటూ

"అడ్మిషన్ కోసం " అని వినగానే

"ఇప్పుడు కాదు, అక్టోబర్ లో రావాలి" అంది.

"అదేంటి, లేటై పోతుంది కదా, అకడమిక్ ఇయర్ మొదలవ్వాల్సింది జూన్లో కదా" అన్నాను. ఆ అమ్మాయి నన్ను ఎంత విచిత్రంగా చూసిందో తల్చుకుంటే ఇప్పుడు సిగ్గేస్తోంది మళ్ళీ!

"నేను చెప్పేది వచ్చే ఏడాది అడ్మిషన్ల సంగతి! ఈ ఏడాది అడ్మిషన్లు పోయిన అక్టోబర్లోనే అయిపోయినై" అంది నాలాంటి నిరక్షర కుక్షికి జ్ఞానోదయం కలిగిస్తున్న ఉత్సాహంలో, విచారంగా జాలిపడుతూ!

తర్వాత మా సంగతి చూడ్డానికి ఒక కౌన్సిలర్ వచ్చి, ఈ ఏడాది కోసమే వచ్చామని తెలుసుకుని, రిలాక్స్ అయి కూచుంది. "ఎంతివ్వ గలరు?" అంది. ఒక్క క్షణం నాకేం అర్థం కాలేదు. కట్నం ఇవ్వాలా ఏమిటిక్కడ? ఇప్పుడేనా అని మళ్ళీ ఆశ్చర్యపడదామని ఆలోచిస్తుండగా మా వారికి ఆమె భాష అర్థమై, "ఎంత" అనడిగారు.

"మీరు సకాలంలో వస్తే 50 వేల నుంచి మాట్లాడొచ్చు! కానీ ఇంత లేటుగా వచ్చారు గాబట్టి మూడున్నర అడగాలనుకుంటున్నాం! మీకు రసీదు ఇవ్వమన్న సంగతి మీకు తెలుసనుకుంటాను" అంది మా వారి విజిటింగ్ కార్డు పరిశీలిస్తూ!

అప్పటికి  విషయం అర్థమైంది నాకు!

మూ-డు-న్న-ర లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వాలట...యూకేజీలో సీటు ఇచ్చినందుకు!

తను "ఇవ్వగలను గానీ,సారీ, ఇవ్వను" అని లేచి నిలబడ్డారు! ఇలాంటపుడు మరీ నచ్చేస్తుంటారు నాకు!



మాకు దగ్గర అనిపించే మరో స్కూలు 'రిచెక్" పబ్లిక్ స్కూలు కెళ్ళాం! ఈ స్కూలు వర్కింగ్ మదర్స్ పాలిట వరం అని పేరు! ఎందుకంటే పాపం ఈ స్కూలు పిల్లలకు హోం వర్కులుండవు, ఆరో క్లాసు వరకు అసలు పరీక్షలే ఉండవు!ఈ స్కూల్లో విశేషమేమిటంటే మన పిల్లల్ని వాళ్ల దగ్గర ఉంచి మనమే డిపాజిట్ గా డబ్బు కట్టాలి. దాని పేరు "కాషన్ డిపాజిట్" అట.


"మరి మిగతా ఫీజు వివరాలు..." అంటుండగానే కౌన్సిలర్ పాప, చెపితే నా గుండె, వింటే మీ గుండె ఆగిపోయే అంకె ఒకటి చెప్పి "చదువుల గురించి మీరడగ్గూడదు, పిల్లల సేఫ్టీ గురించి మేం చెప్పకూడదు. మాకు చెప్పడానికి ఆర్డర్లు లేవు" అంది.
ఈ స్కూల్లో కొన్నేళ్ళ క్రితం ఒక తొమ్మిదో తరగతి విద్యార్థి స్విమ్మింగ్ పూల్ లో పడి మరణిస్తే ఆ పిల్లాడు డిప్రెషన్ లో ఉన్నాడనీ, వాడికి కుటుంబ సమస్యలున్నాయనీ..ఇలాంటివే ఏవో కారణాలు చెప్పి స్కూలు బాధ్యత ఏమీ లేదని చెప్పి తప్పించుకున్నారు.


"పలక" అనే పాఠశాలలో కూడా ఇలాంటి సంఘటనే జరిగిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. స్కూలు బస్సు డోర్ మూయకుండా నడుపుతుండటం వల్ల సడన్ బ్రేక్ వేయడంతో ఒక విద్యార్థి బస్సు లోంచి కింద పడి మరణించాడు.


సైబర్ టవర్స్ కి కూతవేటు దూరంలో ఉండే మరో కార్పొరేట్ స్కూల్ కి అవడానికి రేకుల కప్పే అయినా పాపం ఏసీ చేసార్లెండి. ఈ స్కూల్లో నర్సరీ చదివించాలంటే 98,500(రూపాయలే)ఉండాలి చేతిలో!

'కోక్ రిడ్జ్" స్కూలు కూడా ఇదే కోవ! ఎల్కేజీ లో చేరాలంటే రెండు లక్షలు మనవి కావనేసుకోవాలి మనం!పైగా ఇక్కడ స్కూలు బస్సు చార్జీలకే కళ్ళు తిరగాలి, ఎందుకంటే వాళ్లవి ఏసీ బస్సులు!

మరో స్కూల్లో నెలకు దాదాపు 7,500 ట్యూషన్ ఫీజ్ కట్టాలి! (అడ్మిషన్,డొనేషన్ వగైరాలు కాకుండా)దానితో పాటు పిల్లలకు టేబుల్ మానర్స్, పాటీ ట్రైనింగ్,టాయిలెట్ కి వెళ్ళినపుడు సొంతంగా బట్టలు వేసుకోవడం, లంచ్ సొంతంగా తినడం (చపాతీలు కూడా స్పూన్ తో తినాలి) నేర్పి పంపాలని వారి డిమాండ్!

"మరి మీ ఆయాలేం చేస్తారు? చెట్టు కింద కూచుని పేలు చూసుకుంటారా?" అని అడగకుండా నిగ్రహించుకోడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.


మియాపూర్ లోపల, బాచుపల్లి దగ్గర ఉన్న మరో మరో స్కూలుకు వెళ్ళాను. వాళ్ళు ఫీజ్ ఎంతో చెప్పరట.

"వచ్చే ఏడాది పెంచుతాం కదండీ, ఇప్పుడే ఎలా చెప్తామండీ? మీకు అడ్మిషన్ ఖరారు అయ్యాక చెప్తాం లెండి" అన్నారు. వీళ్ళు మరీ ప్రమాదకరంగా ఉన్నారు. సడన్ గా షాక్ ఇస్తారన్నమాట.


కుకట్ పల్లి మెయిన్ రోడ్ లో ఉన్న కొన్ని concept స్కూళ్లకెళ్ళి చూశాను.
మీరెప్పుడైనా కోల్డ్ స్టొరేజ్ బిల్డింగ్స్ చూశారా? కిటికీలు ఏమీ ఉండవు.ఒకటే పెద్ద బిల్డింగ్! అంతే !
ఈ కాన్సెప్ట్ స్కూళ్ళూ ఇంతే!కనీసం పార్కింగ్ స్థలమే ఉండదు, ఇక గ్రౌండ్ సంగతి మర్చిపొండి! (అదే ఉంటే ఇంకో నాలుగు రూములు వేస్తారు).
నిరంతరం తిరిగే ఫాన్ గాలి తప్ప తాజా గాలి పీల్చుకునే అవకాశం(బయటికొస్తే గుండెలనిండా నిండే కాలుష్యం ఉచితం ఆ రోడ్లో)కూడా లేదు పిల్లలకు!



కాస్త మంచి స్కూలు కావాలనుకోవడం దురాశగా మారిపోయింది! దాదాపు అన్ని స్కూళ్ళూ ఇలాగే ఉన్నాయి.టౌన్లలోకంటె ఇక్కడ అత్యుత్తమ విద్య బోధిస్తారని హామీ ఏమీ లేదు(స్పోకెన్ ఇంగ్లీష్ తప్పించి).


ఇక ప్లే స్కూళ్ళంత పచ్చి మోసం ఎక్కడా ఉండదు.మా అమ్మాయిని రెండున్నరేళ్ల వయసులో "క్యూరో కిడ్స్" అనే ప్లే స్కూల్లో చేర్చాము. నిజానికి ప్లే స్కూల్లో పిల్లల్ని చేర్చడానికి నేను వ్యతిరేకిని. అయినా చేర్చానంటే పరిస్థితి నా చేతిలో లేదన్నమాట. అది చాలా పెద్ద పేరు , బోల్డన్ని ఫ్రాంచైజీలు ఉన్న స్కూలు.



అత్యంత పరిశుభ్రంగా ఉండాల్సిన ప్రదేశాల్లో ప్లే స్కూలు ఒకటి.
కానీ, అక్కడ పైకి చెప్పేది ఒకటి, లోపల పరిస్థితి ఒకటి. వంట్లో బాగాలేని పిల్లల్ని వేరేగా ఉంచాల్సిన బాధ్యత వారిది.అందరినీ ఒకటే చోట ఉంచటం,టాయిలెట్ , బేబీ కమ్మోడ్ వంటివి ఒకటే వాడటం వంటి పరిస్థితులు! అక్కడ ఉన్న ఏడాదిలో మా పాపకి "Urinery infection" తో సహా రాని రోగం లేదు.
 చాలా ప్లే స్కూళ్ళు రంగు రంగుల బొమ్మలతో, బొమ్మరిళ్లతో,ఆటవస్తువులతో ఉండగానే చూసి,మోసపోతాం!

ఆ ఒక్క స్కూలే కాక మరి కొన్ని ప్లే స్కూళ్ళు చూశాను. పిల్లల్ని పడుకోబెట్టే పరుపుల మీద దుప్పట్లు కూడా రోజూ మార్చరు. తిండి కూడా అక్కడే పెట్టే పధ్ధతి ఉంటే కనుక వారానికి నాలుగు రోజులు "వెజిటబుల్ ఉప్మా" నే గతి ! అది చవక,ఈజీగా తయారు చేయొచ్చు! ఈ స్కూళ్ళలో వార్షిక ఫీజు ఎంతో తెలియని వాళ్ళు ఊహించండి! నలభై వేల నుంచి ఎనభై వేల వరకు! ట్రాన్స్ పోర్ట్ అదనం! ఇంత డబ్బు కడితే ఉదయం 9 నుంచి 11-30 వరకు పిల్లల్ని "కూచోబెట్టుకుని" పంపిస్తారన్నమాట.



ఇదీ నగరాల్లో స్కూళ్ళ పరిస్థితి! ఇద్దరు పిల్లలు ఉన్నారంటే తిండి మానేసైనా వాళ్ల కేజీ చదువుల కోసం డబ్బు కూడబెట్టాలన్నమాట!


ఇవాళ ఏ ఇంట్లో చూసినా ఒకరిద్దరు పిల్లలకంటే ఉండరు! ప్రతి రెండు వీధులకొక స్కూలు ఉంటుంది. అయినా దేనిలోనూ అడ్మిషన్లు లేవంటారు. కావాలంటే లక్షలు కట్టాలంటారు. దీన్నేమనాలో మరి!


చెప్పుకుంటే సిగ్గు చేటు,నాచదువుఖర్చు ,యూనివర్సిటీ వరకూ కూడా మొత్తం లక్ష కాలేదు. ఇప్పటి కార్పొరేట్ స్కూళ్లతో పోల్చుకుంటే ఏదో వీధి అరుగు బడిలోనో చదివినట్టు ఉంది. టౌన్లలో పరిస్థితి ఇంత అన్యాయంగా లేదని చెప్పగలను. మా వూరెళ్ళినపుడు "మీ అమ్మాయి స్కూలు ఫీజెంత" అని ఎవరైనా అడుగుతారేమో అని ఆ టాపిక్ రాకుండా జాగ్రత్త పడతాను. చెప్పాలంటే సిగ్గుతో చచ్చినంత పనవుతుంది మరి!


అసలు సర్కారీ స్కూళ్లలో విద్యా ప్రమాణాలెందుకు పడిపోయాయి? ఎందుకు పడిపోవాలి?

చదువు ఎందుకింత ప్రియం అయింది?


సర్కారీ బళ్ళలో సరిగా చెప్పకపోవడం వల్ల అందరూ ప్రైవేటు స్కూళ్లకు ఎగబడటం వల్లనా?

ఉన్న ఒకరిద్దరు పిల్లలకూ విద్య 'అత్యుత్తమం' గా ఉండాలని తల్లి దండ్రులు ఎంత ఖర్చుకైనా వెనకాడకపోవడం వల్లనా?

ఐటీ వాళ్ళకు,(ఈ స్కూళ్ళలో చదివే పిల్లల్లో ఎక్కువమంది ఐటీ తల్లిదండ్రుల పిల్లలే) జీతాలెక్కువ కాబట్టి ఎల్లాగైనా వాళ్ళను లూటీ చేసి పారేద్దామనే స్కూలు యాజమాన్యాల దురాలోచనా?


లేకపోతే నిజంగానే చదువు "విలువ" అంతగా పెరిగిపోయిందా?



ఈ ప్రశ్నలన్నింటికీ కనీసం కొన్నింటికి ఎవరైనా జవాబు తెలిసి చెప్తే తెలుసుకుంటాను. ఎందుకంటే నిజంగానే నాకు జవాబులు దొరకలేదు.



స్కూళ్ళు తిరిగి ఇంటికి వస్తుండగా నేను ఏదో ఆలోచిస్తూ "లక్షకెన్ని రూపాయలు" అని అడిగాను మా వారిని. నాకు గానీ స్కూళ్ల "రేట్లు" విని మతి భ్రమించిందనుకుని తను కంగారు పడుతూ "చ, ఊరుకోమ్మా, ఏమీ ఆలోచించకు, ఊళ్ళో ఇల్లు అమ్మేద్దాంలే, పాపాయిని కేజీ చదివించడానికి" అని ధైర్యం చెప్పాడు..

122 comments:

Purnima said...

హమ్మ్.. మీ ప్రశ్నలకి ఏం సమాధానాలు వస్తాయో వేచి చూడడం తప్ప, ఇక ఏమీ పంచుకోలేను. ఇవి చూసి చూసి అలవాటు పడిపోయాను, నాకు కొత్తగా ఉండవివి.

Bolloju Baba said...

అయ్యబాబోయ్ అంతంత రేట్లే.
మీకు లక్షయిందన్నారు నాకు అక్షరాలా 23 వేల రూపాయిలు అయ్యింది యూనివర్సిటీలో నాలుగేళ్ల చదువుకి.

విద్య ఏనాడో వ్యాపారం అయిపోయింది.
గత ఇరవై ఏళ్ళుగా నియో రిచ్/రిచ్ ఫామిలీస్ ఆ విధంగా మార్చేసాయి. ఎందుకంటే ఉండేది ఒకరు లేక ఇద్దరు పిల్లలు. కనుక ఎంతైనా వారికేకదా అన్న భావన. లేక పోతే ఒక స్టేటస్ సింబల్.

సర్కారీ బళ్లంటే ఒక చులకన.
ఎందుకంటే అక్కడ చదివిస్తే " లేనిపోని బుద్దులు నేర్చుకొంటాడు" అనే ఒక ప్రెజుడీస్. తమ స్థాయి కి తగ్గ పిల్లలు ఉండరన్న భావనలు.
సర్కారీ బళ్లకు ప్రధాన అవరోధం మౌలిక సదుపాయాల కొరత, ఉపాధ్యాయులకు టీచింగ్ కంటే ఇతర వ్యాపకాలలో నియమించటం. (నాకు తెలిసి చాలా స్కూలుస్ లో ఒకరు లేక ఇద్దరు మాస్టర్లు స్కూలు కు సంబందించిన నాం టీచింగ్ వర్కులతో తలమునకలవుతూ ఉంటారు.)

ప్రభుత్వ టీచర్లు అసమర్ధులు కారు. సర్కారీ టీచర్ ఉధ్యోగం రాని వాళ్ళే ఇటువంటి స్కూల్స్ లలో చే్స్తూంటారనేది, ఒక సత్యం.

అన్నీ కారణాలే
కర్ణుడి చావుకు అనేక కారణాలన్నట్టు.

ఏది ఏమైనా ఇటువంటి పరిస్థితులు రిచ్/పూర్ డివైడ్ ను మరింతపెంచుతాయనే భావిస్తాను.

what can we do?


బొల్లోజు బాబా

Sujata M said...

mmmm.. yes. nakkooda bhayamga undi. emo na kikosuni - ekkada veyyalo ?! panchgani lo boarding schoollo vesesta. enni lakshalautundo ? emo..:(

చంద్ర మోహన్ said...

మీరు నాణానికి ఒకవైపు మాత్రమే చూపారు. ఇలాంటి స్కూళ్ళు వర్థిల్లడంలో తలిదండ్రుల పాత్ర గురించి చర్చించి ఉంటే బాగుండేది. స్కూలు భవంతి అందం చూసి పిల్లలను చేర్పించిన తండ్రులు నాకు తెలుసు. మరి అంతంత పెద్ద భవనాలకు డబ్బు ఎక్కడినుండి వస్తుంది? అలాంటి స్కూళ్ళలో చదివే పిల్లల సంస్కృతి ఎలా ఉంటుంది? " నువ్వు ఇవ్వాళ ఏ కార్లో వచ్చావ్?" " నువ్వు తెచ్చింది ఏ బ్రాండ్ చాక్లెట్? ఇండియనా, చీ!" విజయవాడలోని ఒక ప్రముఖ స్కూల్లో నేను స్వయంగా విన్న పిల్లల మాటలివి. హడలిపోయి అప్లికేషను తీసుకోకుండానే వచ్చేశాను. మళ్ళీ కార్పోరేట్ స్కూళ్ళవైపు చూడలేదు. మా పిల్లలు ఒకడు కేంద్రీయ విద్యాలయ లోనూ, మరొకడు (యూకేజీ) ఎయిర్ ఫోర్సు స్కూల్లోనూ చదువుతున్నారు. వారు నేర్చుకొంటున్న చదువు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళకన్నా తీసిపోయిందని (మీరు చెప్పినట్లు స్పోకెన్ ఇంగ్లీషు తప్పితే) మాకు ఏనాడూ అనిపించలేదు. ఇద్దరి ఫీజులూ కలిపి సంవత్సరానికి ఐదు వేలు కూడా కావు. వారు కొనిపించే పుస్తకాలు ఒక్కోటీ ముప్ఫై రూపాయలకన్న ఎక్కువ లేవు. ప్రభుత్వ పాఠశాలలను గురించి అందరికీ ఒక స్టీరియోటైప్ అభిప్రాయం ఏర్పడిపోయింది. ఈ సమస్యకు చాలా కోణాలున్నాయని నా ఉద్దేశ్యం.

చైతన్య.ఎస్ said...

మీరు చెప్తున్న ఫీజులు వింటుంటే కళ్ళు గిర్రున తిరుగుతున్నాయి.

ఈ మధ్యన విద్యాశాఖ వారికి మెళుకువ (నారాయణ సంఘటన ద్వారా ) వచ్చినట్టు ఉంది. తెగ దాడులు చేస్తున్నారు ప్రవేటు విద్యా సంస్థల మీద. వసతులు లేవు అని , క్లాసులకు పర్మిషన్ లేవు అని సీజ్ చేస్తున్నారట స్కూళ్ళను ఇంకా కాలెజ్ లను. వీటికి బయపడి చాలా స్కూళ్ళకు , కాలెజ్ లకు హాలిడేస్ ఇచ్చారు.
వీరి చలువ వల్ల పాఫం విద్యార్థులు దసరా సెలవులు ఎంజాయ్ చెయ్యబోతున్నారు. మా అక్క పిల్లలకు మొదటి సారి 12 రోజుల పాటు దసరా హాలిడేస్ ఇచ్చారు. ఎప్పుడు 6 రోజులకు మించి వాళ్ళకు ఇవ్వలేదు. పాపం 3 తరగతి చదువుతున్న మా అక్క కూతురికి ఆదివారం కూడా
" స్పెషల్ " క్లాస్ అట. అలాంటిది 12 రోజుల పాటు సెలవులు అంటే మీరు ఊహించుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందో.

అయిన అధికారులకు ఒకరు చస్తేనే (నారాయణ సంఘటన ద్వారా ) నిబందనలు గుర్తుకు వస్తాయా ? దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు ఇప్పుడా తనిఖీలు చేసేది. విద్యా సంవత్సరం ఆరంభంలో ఈ పని చేసి వుంటే బాగుండేది కదా !

చైతన్య.ఎస్ said...

అన్నట్టు ఈ ప్ర"వేటు" ధ్యాస లో పడి చెప్పడం మరిచా మీ ముగింపు అదిరింది. "లక్షకెన్ని రూపాయలు" అని అడిగాను మా వారిని.

Anonymous said...

పిల్లల చదువులకు పాటశాలలు మాత్రమే ఫౌండేషన్ అనుకునేవాళ్ళున్నంత కాలం,
ఖర్చు పెట్టే డబ్బులకు జ్ఞాన సముపార్జన ప్రపోర్షనేట్ గా ఉంటుందని భ్రమించే పేరెంట్స్ ఉన్నంత కాలం....ఇంకా చెప్పాలంటే పిల్లలు చదివే స్కూల్స్ కీ తమ ప్రెస్టేజ్ కీ ముడివేసుకునే పేరెంట్స్ ఉన్నంత కాలం.....ఇలాంటి దారుణాలు చెవిని పడుతూనే ఉంటాయి.

సూర్యుడు said...

Too much

నిషిగంధ said...

సుజాత గారూ, అసలు సిసలు సమస్యను టచ్ చేశారండీ!

హైదీలో స్కూళ్ళ ఝలక్ నేను పోయినసారి ఇండియా వచ్చినప్పుడే తగిలింది! బాగా తెల్సినవాళ్ళ ఇంటికెళ్ళి ఆ కబుర్లూ ఈ కబుర్లూ చెప్తూ మీ అబ్బాయి ఏం చదువుతున్నాడని మా హోస్టాయన్ని అడిగాను.. అందుకాయన "చదువుతున్నాడు ఐదో, ఆరో" అంటే నాకు నోటమాట రాక పక్కనే ఉన్న మా మామగారి వంక చూశాను.. నా కంగారుని అర్ధం చేసుకున్న మా మామ గారు "లేదమ్మా, వీళ్ళబ్బాయి 'గల్లీ పబ్లిక్ స్కూల్లో' చదువుతున్నాడు.. హోం వర్క్ లవీ అక్కడే చేయించేసి పంపుతారు.. అంతేగాక రెండు పూటలా భోజనం, ఎ.సి బస్సు " అని చెప్తుంటే హోస్టాయన అందుకుని 'దీనికి లక్ష.. దానికి లక్ష.. " అంటూ 'ల 'కారాలని తెగ వాడేస్తుంటే అనిపించింది, అన్ని లక్షలు పోసి పంపిస్తుంటే ఇంక పిల్లలు ఏ తరగతిలో ఉన్నారో కూడా పట్టించుకోవక్కర్లేదన్నమాట అని!

మీరన్నట్లు మన మొత్తం చదువులకైన ఖర్చు వీళ్ళ ఒక నెల కె.జి చదువులక్కూడా సరిపోదు :(

btw, లాస్ట్ పేరా సూపర్ :-)

రాధిక said...

లక్షకి ఎన్ని రూపాయలనికదా అడిగారు మనకి లక్షకి లక్ష రూపాయలే.కానీ స్కూలు యాజమాన్యానికి లక్షకి ఒక్కరూపాయే.అన్నట్టు ఇపుడు టౌన్ల పరిస్థితి కూడా దారుణం గానే వుంది.ఇప్పుడు అక్కడ కూడా ఇంటర్నేషనల్ స్కూళ్ళు అని చెప్పి బానే గుంజుతున్నారు.సిటీల్లో అడిగే అంత పెద్ద సంఖ్యలు కాకపోయినా అక్కడివారిరాబడితో పోలిస్తే ఎక్కువే.

teresa said...

హమ్మో.. పిల్లల్ని కనే ముందు ఎంత ఆలోచించాలో ఈ రోజుల్లో! ఇదంతా ఒకెత్తు, హైస్కూల్ చివర్లోకొచ్చేటప్పటికి పిల్లల పోకడలు భరించడం మరో కత్తి మీద సాము!
లాస్ట్ పేరా చదూతుంటే ఫక్కున నవ్వాగలేదు సుమా :)

Unknown said...

అంటే పిల్లల్ని బళ్ళో చేర్చటం కన్నా ఇల్లు కట్టడం సులువన్నమాట.
మా నాన్నగారు ఎప్పుడూ చెప్తుంటారు. మాకు ఇంటర్మీడియట్ కోసం కట్టిన ఫీజు తో మా నాన్న గారు ఎమ్మే వరకు చదివేసారట (హాష్టలు ఖర్చులతో కలిపి)
ఇంక నాకు నా ఇంజినీరింగ్ వరకు పూర్తి చెయ్యడానికి మీరన్నట్టు లక్ష దాటలేదు.
ఏమి చేస్తాం. సాఫ్టువేరు ఉద్యోగుల వల్ల వీల్లు ఇష్టం వచ్చినట్టు తోక జాడిస్తున్నారు. ఏమైనా అంటే మల్టీనేషనల్ స్టాండర్డ్ అంటారు.

ఒకప్పుడు అత్యంత పేదవాడైన రామానుజుడు ప్రపంచం గుర్తించదగ్గ శాస్త్రవేత్త ఎలా అయ్యాడు?
మంచి గురువులు వల్లే కదా!!!
ఇప్పుడు ముక్కు పిండి వసూలు చేస్తున్న ఫీజుల వల్ల ఎవరు వస్తున్నారు బయటికి జీవచ్చవాల్లాంటి సాఫ్టువేరు ఇంజినీరు (కోపం వద్దు నేను కూడా సాఫ్టువేరు ఇంజినీరునే)

నా చిన్నప్పుడు, మేము చక్కగా నాన్నతోనూ అమ్మతోనూ సమయం గడిపేవాళ్ళం. ఇప్పుడు హైదరాబాదులో ఉండే సాఫ్టువేరింజనీరులైన తల్లి తండ్రులు తమ పిల్లలతో ఎంత సమయం గడపగలుగుతున్నారో అందరికీ తెలిసిందే....

ఇంకా వేసవి సెలవులు, దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు ఇప్పటి పిల్లలు అనుభవిస్తున్నారా నిజంగా ??
ఏమో యాంత్రిక సమాజానికి పునాదులు పడుతున్నాయేమో!!!

మీరు చెప్పినది చదువుతుంటే నాకు పెళ్ళంటేనే భయం వేస్తోంది !!
ఈ బడి ఖర్చుల కోసమైనా కట్నం వద్దనే ఆదర్శవంతులు, లంచం తీసుకోని బుద్దిమంతులు సైతం తమ పంధా మార్చుకోవాల్సిందేనేమో!!

మేధ said...

నిజమేనండీ... అసలు స్కూల్స్ ఫీజ్ లు చూస్తుంటే, భయమేస్తోంది.. ఇప్పుడే ఇలా ఉంటే, ఇక ముందు ముందు ఎలా ఉంటుందో... ఫీజు సంగతి ప్రక్కన పెట్టినా, పిల్లల overall developmentకి ఏమీ ఉపయోగపడదు ఆ వాతావరణం....

ప్రపుల్ల చంద్ర said...

అంటే ఈ లెక్కల ప్రకారం పిల్లల చదువు అయిపోయేవరకు దాదాపు ఒక 30 లక్షలు (తక్కువలో తక్కువ..) ఖర్చు అవుతాయన్నమాట !! నాకు పెళ్లై పిల్లలు పుట్టే సరికి ఇంకెలాగుంటుందో.... ఆ పరిస్థితికి దూరంలో ఉన్న ఇప్పుడే చుక్కలు కనపడుతున్నాయి. అంత ఖర్చుపెట్టినా మంచి చదువు దొరుకుతుందన్న నమ్మకం లేదు.

సుజాత వేల్పూరి said...

బాబాగారు,
చదువు ఖర్చు మొదటి నుంచీ యూనివర్సిటీ వరకు మొత్తం కలిపి చెప్పాను. ఇందులో ఇంకోటి మరిచాను. ఆ లక్ష లోపు మొత్తంలో ICWA ఖర్చు కూడా ఉంది. తల్లిదండ్రులు ప్రిజుడిస్ కూడా చాల.....వరకు ఇలా ఖర్చులు పెరిగిపొడానికి కారణం, అందులో ఇక ఖండించాల్సింది ఏమీ లేదు.

పూర్ణిమా,
నీ ఖర్చెంతయిందో చెప్పలేదు. నువ్వు నా తర్వాత జనరేషన్ కదా? gap తెలుసుకుందామని అడిగాను.

సుజాత వేల్పూరి said...

సుజాతగారు,
మీ 'కికోసు "రెడీ అయ్యేలోపు ఖర్చులు ఇంకా పెరుగుతాయి, త్వరపడాలి! పంచ్ గని, ఊటీల్లో కూడా అటువేపెళ్ళినపుడు ఆరా తీశాను. కానీ ఉనా ఒక్క పాపనూ అంత దూరంలో ఉంచలేక విరమించాను. మా అమ్మాయి మాత్రం "ఇషాన్" చదివిన స్కూల్లో చదువుతానని గొడవ చేసింది "తారే జమీ పర్ " చూసిన కొత్తల్లో!

సుజాత వేల్పూరి said...

చంద్రమోహన్ గారు, ఈ మధ్య పెద్ద పెద్ద పోస్ట్లు చదవాలంటే బ్లాగర్లు అంత ఇంటరెస్టు చూపించడం లేదు. ఇన్ని బ్లాగులు మధ్యలో నా బ్లాగు చదవడమే అదృష్టంగా భావిస్తాను నేను. అందువల్ల చివర్లో తల్లిదండ్రుల ఆరాటం గురించి ఒక ప్రశ్న మాత్రం అడిగి సరిపెట్టాను. అది కూడా రాస్తే అదొక రెండు తపాలకు సరిపడా తయారవుతుంది.

మొత్తానికి మీరు అదృష్టవంతులు. ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియని కార్పొరేట్ ఉద్యోగులు "వాళ్లకి తగ్గ వాతావరణాన్ని" వెతుక్కునే క్రమంలో ఇలాంటి కార్పొరేట్ స్కూళ్ళకు బలవుతున్నారు.

ఒక స్కూలు వాళ్ళు చెప్పడం.."......apart from these fees, you have to pay around 6 to 11 thousand rupees for books and uniforms. because we have a tie up with a company by name..(brand name so...so)for uniforms and ......company for shoes "
ఒక ఏడాది పుస్తకాలు(ఒకటో క్లాసుకి), యూనిఫారం కి కలిపి 11 వేలు! ఇప్పుడు చెప్పండి లక్షకెన్ని రూపాయలో?


సో, అదీ విషయం! బ్రాండ్ నేం ఉన్న బట్టలు, షూలు మాత్రమే వాడాలని వారి డిమాండ్.సై అనే తల్లిదండ్రులు ఉన్నంత కాలం ఎన్ని డిమాండ్లైనా పుడతాయి.

సుజాత వేల్పూరి said...

చైతన్య ,
నారాయణ సంఘటన గురించి ప్రభుత్వం ఇంకా మర్చిపోలేదా ? ఇన్ని రోజులైనా? అయితే గొప్పే!

ఇలాంటి సంస్కరణలు కేవలం తాత్కాలికమే! కాకపోతే ఈ సారి ఈ సంఘటన మూలంగా పిల్లలందరికీ పది రోజులు తక్కువ కాకుండా సెలవులొచ్చాయి, అందుకు సంతోషం!

everything is precious,

బాగా చెప్పారు. తమ ప్రిస్టేజ్ కి పిల్లల స్కూలుకు ముడిపెట్టే తల్లిదండ్రులు ఉన్నంత కాలం ఇంతే !

Kathi Mahesh Kumar said...

దాదాపు ఇలాంటి అనుభవాలే కలిగి, మావాడ్ని భోపాల్ లోనే స్కూల్లో చేర్పించడానికి డిసైడ్ అయ్యాను. హైదరాబాద్ లో ఒక "చెత్త" స్కూల్లో చేర్చే ఫీజుతో అక్కడ "అతిగొప్ప" స్కూల్లో చేర్చొచ్చు.

చిన్ననగరం కాబట్టి,అక్కడ కనీసం తల్లిదండ్రుల మాటకి స్కూల్లో గౌరవం ఉంటుంది. ఇక్కడ ఫీజులు గుంజుకునే సమయంలోకూడా,మర్యాదగా ప్రవర్తించరు.పైపెచ్చు వాళ్ళేదో మనమీద దయచూపిస్తున్నట్లు పెద్ద ఫోజొకటి.

నేను 6-12th నవోదయావిద్యాలయ లో చదివాను కాబట్టి (చదువుకి)ఒక పైసా ఖర్చు లేదు.ఇంకా పెన్నులో ఇంకూ, యూనిఫార్మ్ తో సహా వాళ్ళే ఇచ్చేవారు. ఇక మైసూరు కాలేజి, హైదరాబాద్ యూనివర్సిటీలో నా జల్సాలతోసహా ఖర్చురాసినా రెండు లకారాలు దాటే ప్రసక్తే లేదు. అంటే దాదాపు 6 సంవత్సరాల క్వాలిటీ చదువుకు రెండులక్షలు..అదీ పరసనల్ పైత్యాలతో కలిపి. నిజంగా నేను అదృష్టవంతుడినే...ఇప్పుడు మావాడి సంగతి ఆలోచించాలి!

ప్రదీపు said...

నాకు ఎదో horror కథ చదువుతున్నట్లు అనిపించింది, ఈ టపాను చదువుతుంటే!!!

chava said...

ఇంతకీ మీ పాప ఏ బడికి వెళ్తుందో చెప్పలేదు . చెప్తే నాలాటి వారి కష్టం కొంత తీరుతుంది :)

Anonymous said...

@ మహేష్
మీరు నవోదయలో చదివారా?
ఏ జిల్లా నవోదయలో? నేను విజయనగరం జిల్లా నవోదయలో చదివాను.

oremuna said...

!

This is a great post.

నా ఆత్మ కథ అంటూ ఒకటి రాస్తే ఈ పోస్టు గురించి రెండు లైన్లు రాసుకోవాలి :)

వేణూశ్రీకాంత్ said...

మంచి టాపిక్ మొదలు పెట్టారు సుజాత గారు ఇంకా ఎవరెవరు ఎలా స్పందిస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. మీ చివరి పేరా మాత్రం సూపర్ :-)

Anonymous said...

మీరీ టపా రాసేముందు ఓ చిన్న హెచ్చరిక పెట్టాల్సింది. భారత్ తిరిగి రావాలనుకునే ఎన్నారైలు ఇది చదవొద్దు అని. ఇప్పటికే అక్కడ యువత పెట్టే ఖర్చులు చూసివచ్చిన జనాలు కళ్ళు గుమ్మడి కాయలంత చేసి చెబుతున్నారు. ఇప్పుడు ఇది చదివితే తిరిగి రావాలనుకునే వారు ఓ పది సార్లు ఆలోచిస్తారు. నా గుండె ఇప్పటికే రెండు మూడు సార్లు ఆగి... పోతే పోనీలే ఈ సారికి ఈ బక్క పీనుగుని ఒదిలేద్దాం అని మళ్ళీ కొట్టుకోవడం మొదలు పెట్టింది. నా ఇంజినీరింగుకు కట్టిన ఫీజులు సంవత్సరానికి కేవలం 15+ డాలర్లు (520 రూపాయలు) అంటే ఇక్కడి అమెరికన్లు కళ్ళు తేలేసే వాళ్ళు. ఇప్పుడు అక్కడి స్కూలు ఖర్చులు, వారాంతం ఖర్చులు తలుచుకుని మన వాళ్ళు కళ్ళు తేలేస్తున్నారు.

అందుకే నేను భారత్ తిరిగొస్తే మా ఊళ్ళోనే సెటిలయిపోయి మా పిల్లల్ని మా ఊరి పెంకులిస్కూల్లోనే చేర్పిద్దామని డిసైడ్ అయ్యా. ఇల్లద్దె కట్టఖ్ఖర్లేదు బస్సెక్కక్కర్లేదు. అన్నింటికి మించి హోం వర్కు చెయ్యక్కర్లేదు.

-- విహారి

సుజాత వేల్పూరి said...

నిషి,
ప్రస్తుతం హైదరాబాదులో పరిస్థితి అచ్చం మీరు చెప్పినట్టే ఉంది. నిజం!

రాధిక,
కరక్ట్ గా చెప్పారు. మన లక్ష వాళ్లకి ఒక్క రూపాయి తో సమానం!

teresa,
పిల్లల్ని కనాలంటే నిజంగానే గుండె ధైర్యం కావాల్సి వచ్చేట్టు ఉంది. మీరు చెప్పిన మరో పాయింట్, టీనేజ్ వచ్చాక వాళ్ల పోకడలు భరించడం....చాలా చాలా వాలిడ్ పాయింట్. దీని మీద ఇంకో టపా రాయాలి.

సుజాత వేల్పూరి said...

మిరియాల ....ఫణి ప్రదీప్,
మీ ఆవేదన నాకు అర్థమైంది. తప్పించుకోలేని ఉచ్చులో చిక్కుకున్నాం మనమంతా!

అందుచేత పెళ్ళంటే భయపడకూడదండీ! చేసుకోవాలి, చెంచాడు భవసాగరాలు ఈదాలి! Go ahead.

మీరు చెప్పింది కరక్టే! పుట్టబోయే పిల్లల ఫీజుల కోసమైనా కట్నం తీసుకోవాల్సిన పరిస్థితే ఇప్పుడుంది!

మేథా,
పిల్లల overall development కి ఏ స్కూలూ బాధ్యత తీసుకోదు. prospectus మొత్తం లోనూ దాని ఊసే ఉండదు. పైగా ఇలాంటి ఖరీదైన స్కూళ్లలో చదవటం వల్ల జీవితంలో వాస్తవికత అంటే ఏమిటో తెలియకుండా పెరగడానికి అవకాశం ఉంది.

సుజాత వేల్పూరి said...

మహేష్,
మీకు ఏ మెట్రో సిటీకో ట్రాన్స్ ఫర్ అయి పర్మినెట్ గా మీరు అక్కడే ఉండిపోవాలని, మాకు అయిన ఖర్చంతా మీ బాబు చదువుకీ అవ్వాలనీ శాపం ఇచ్చేస్తున్నా తీసుకోండి!

సుజాత వేల్పూరి said...

చావా గారు,
మా అమ్మయి చదువుతున్న స్కూలు పేరు మహారిషి విద్యా మందిర్. మహారిషి మహేష్ యోగి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారిది. ఎకరాల కొద్దీ ఆవరణ, పెద్ద భవనాలు అంతవరకూ బాగానే ఉంటుంది. కానీ వీళ్ల సిలబస్, పోర్షన్ చాలా....ఎక్కువ! కొంతమంది టీచర్లు qualified కాదు. spoken english అంత బాగా ఉండదు. ఎలాగూ మేము వచ్చే ఏడాది కొత్త ఇంటికి వెళ్ళే ప్లాన్ ఉండటం వల్ల మళ్ళీ స్కూలు మార్చాల్సిందే కాబట్టి ఇంటికి దగ్గర గా ఉందని ఇక్కడ చేర్చాము. మిగతా స్కూళ్ళతో పోలిస్తే ఖర్చు తక్కువనే చెప్పాలి. overall గా బాగానే ఉంటుంది.(స్కూలు పూర్తయి బయట పడేలోగా నాలుగు వేదాలు నాలుక చివర ఉండాల్సిందే)

ప్రదీప్ గారు,
నిజంగానా?

సుజాత వేల్పూరి said...

వేణూ శ్రీకాంత్,
థాంక్సులు!

oremuna గారు చెప్పడం మర్చిపోయాను,
ఈ పోస్టు నుంచి రెండు లైన్లు మీ ఆత్మకథ లో చేర్చాలనుకోవడం నా బ్లాగుకు దక్కిన అత్యుత్తమ గౌరవంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు.

aishwarya said...

why dint you try gitanjali....
it`s a good school in hyderabad....fee wont be more than20,000....per year...contrary to the popular belief about the school,the syllabus until 6th class is not that vast or difficult....it is a perfect school

బ్లాగాగ్ని said...

సరైన సమయంలో చూశానీ టపా. మూడ్రోజులుగా మా రెండున్నరేళ్ళ బుడతగాడిని ప్రీనర్సరీ స్కూల్లో చేర్పించడానికి పూనాలోని ఒహ మూడు స్కూళ్ళలో వాకబు చేశా. ప్రతీ చోటా ఒకే జవాబు 'ఇంతాలస్యం చేశారేంటని' పిల్లల్ని ఒకటిన్నర సంవత్సరం రాంగానే స్కూల్లో వెయ్యాలంట. నాకు జ్ఞానబోధ చేసిపంపించారు ప్రతీచోటా. సరిగ్గా పాలుకూడా మరవని వయసులో స్కూలేమిటో వాళ్ళేం నేర్చుకుంటారో వీళ్ళేం నేర్పుతారో ఆ భగవంతుడికే తెలియాలి. ఇహ ఫీజులు మీరు చెప్పిన దానికి ఏమంత దూరంలో లేవు. నాగ్గానీ తిక్క రేగిందంటే మావాణ్ణి గుంటూర్లో చేర్చిపారేస్తా సుబ్బరంగా.

ప్రతాప్ said...

అమ్మో అమ్మో
నాకు పెళ్ళంటేనే భయం పుడుతోంది.

సుజాత వేల్పూరి said...

కామెంట్లు చూశాక నాకర్థం అయిందేమిటంటే ఈ టపా తో నేను చాలా మంది బ్రహ్మచారుల/చారిణుల గుండెల్లో పెళ్లంటే భయం రేకెత్తించి, వాళ్ల జీవితాల్లో చిచ్చు పెట్టానని!

అమ్మాయిలూ, అబ్బాయిలూ ఏమీ భయపడొద్దు! కొన్నాళ్ళు మీకు కష్టాలుంటాయి, ఆ తర్వాత అలవాటైపోతాయి. ఇదే సూత్రం ,దేనికైనా సరే!

కాకపోతే ఒక్క సలహా ఇస్తాను, పిల్లలు మాత్రం సెప్టెంబర్ నెల్లో పుట్టేలా ప్లాన్ చేసుకోవాలి. లేదంటే ఒక అకడమిక్ ఇయర్ మొత్తం అంతా వృధా ఐపోతుంది.

సిరిసిరిమువ్వ said...

సుజాత గారు,

మీ ఈ టపాకి సమాధానం ఒకటి రెండు ముక్కల్లో చెప్పేది కాది, అయినా నావి కూడా ఓ రెండు ముక్కలు ....

బాబా గారన్నట్లు కర్ణుడి చావుకి అనేక కారణాల లాగా దీనికి కారణాలనేకం అయినా అసలు కారణం మాత్రం మనమే---అంటే తల్లిదండ్రులు.

ఇప్పుడు కూడా తక్కువ ఫీజులతో మంచి చదువులు చెప్పే బడులున్నాయి, కానీ మనమెందుకు వాటి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడం. పిల్లల చదువుల్లో కూడా మన స్టాటస్ చూపించుకోవాలన్న ఓ దుగ్థ. మనం చదివింది వీధి బడిలో అయినా మన పిల్లలు మాత్రం సో కాల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లోనే చదవాలన్న మన అతిశయం. ఉన్న వాళ్ళు లక్షలు పెట్టి చదివించుతుంటే మనం కనీసం వేలు పెట్టయినా చదివించకపోతే మన పిల్లలు జీవితంలో వెనకపడిపోతారేమో అని భయపడే సగటు మధ్యతరగతి జీవి, వెరసి ఈ చావులు.

మా పిల్లలు చదివే స్కూల్లో సంవత్సరం మొత్తానికి కలిపి (పుస్తకాలు, యూనిఫారం అన్నీ కలిపి) 10,000 లోపే అవుతుంది, అదీ కూడా ఓ రెండు సంవత్సరాల బట్టి, అంతకు ముందు 5,000 లోపే అయిపోయేది. దానికే ఎక్కువ పెడుతున్నామా అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. మరి వాళ్ళ స్టాండర్డ్ ఏ ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లల స్టాండర్డుతో పోల్చుకున్నా ఏమీ తీసిపోదు, ఓ రకంగా ఓ మెట్టు పైనే ఉంటుంది.

మనకి ఏ.సి బస్సులు, ఏ.సి రూములు, బ్రాండెడ్ షూస్ కావాలంటే మరి ఆ మాత్రం విదిలించాల్సిందే కదా. మన పిల్లలు చదివే స్కూల్లో టీచర్సు కూడా చాలా sophisticated గా ultra-modern గా (అంటే చదువు చెప్పినా చెప్పకపోయినా టక టకా ఇంగ్లీషులో నాలుగు చిలక పలుకులు దంచేస్తే చాలు) ఉండాలనుకుంటాము. మన పిల్లలకి ఇంగ్లీషులో మాట్లాడటం వస్తే చాలు ఇంకేమి రాకపోయినా పర్లేదు అనుకునే తల్లిడండ్రులున్నంత కాలం ఈ పరిస్థితి ఇలానే ఉంటుంది.

దీనికి పరిష్కారం కూడా మన (తల్లిదండ్రుల) చేతిలోనే ఉంది. పిల్లలని ప్రభుత్వ బడులలో వేసి ఆ స్కూళ్ల అభివృద్ధికి మన చేతనైనంత సాయం చేయగలిగితే ఈ గల్లీలు,రిచెక్లు,పలకా బలపాలు, కోక్ రిడ్జ్లు, కలువలు తామరలు తోక ముడుచుకుని పోవా!!

అసలు అన్నిటికన్నా మహత్తరమైనది మనం చెప్పుకోగలిగితే ఇంట్లో చెప్పుకోవటం. ఇంటి బడి (home school) కూడా ఓ చక్కని పరిష్కారమే.

బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్ said...

నాలాగా బ్రహ్మచారులు/బ్రహ్మచారిణిలు పిల్లలని స్కూల్లో చేర్పించాలంటే సీటు కోసం, ఫీజుల కోసం ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలన్నమాట.

ఫీజులు వింటే కళ్ళు తిరుగుతున్నాయి. మా కంపనీ CEO తప్పితే నాలాంటి చోటా మోటా గాళ్ళు ఈ ఫీజులు కట్టలేరు.

ఈ తొక్కలో సాప్ట్ వేర్ ఉద్యోగాలు ఏం చేస్తాం గాని నేను కూడా స్కూల్ పెట్టేస్తున్నా. తెలుగు బ్లాగర్ల పిల్లలికి డిస్కౌంట్ డొనేషన్ లక్ష రూపాయలే*. మీకు పుట్టబొయే పిల్లల అడ్మిషన్ల కోసం ఇప్పటి నుంచే అడ్మిషన్లు ఆరంభం.

*షరతులు వర్తిస్తాయి.

గీతాచార్య said...

"క్షవరం అయితే గానీ వివరం తెలీదని సామెత ఉంది లెండి."

ముందు నవ్వుకోలేక చచ్చాను. తరువాత ప్చ్ అనుకున్నాను.

మీ వ్యాసాన్ని family planning చేయని వారికి చూపిస్తే చచ్చినట్లు దారికి వస్తారు. నిజం గా అంత రేట్లు ఉన్నాయా?

Evil Dead తరువాత అంతటి Horror Comedy మీరే చూపారు. విషయాన్ని కొంచం ఆలోచిస్తున్నాను. మీ ప్రశ్నలకి సమాధానాలను చెప్పే ప్రయత్నం చేద్దామనే ఉంది. నిజంగానే తోస్తే... చెపుతా! లేక పొతే Family Planning లాగా Education Planning ప్రచారం చేద్దాం. అదే... పిల్లలకి ఒకటీ లేక రెండు తరగతులే చాలు.

మరి Slogan అంటారా? "ఒక క్లాసు ముద్దు. రెండు క్లాసులు వద్దు."

Anonymous said...

మా అమ్మ నాకు మా తమ్ముడికి రెడ్డింకు పెన్నులకి డబ్బులియ్యడానికే తిట్టేది
ఈ ఫీజులు కట్టాల్సి వచ్చేదయ్యితే నన్నసలు చదివించేదే కాదేమో గా !!!!


సుజాత గారు "సంఘ మిత్ర" స్కూల్ ట్రై చేసారా చాల పెద్ద ప్లే గ్రౌండ్,రోజు ప్రార్ధన చేయిస్తారు
అన్ని భాషల్లోనూ ప్రతిజ్ఞ చేయిస్తారు పాటలు పాడిస్తారు ఆటలు ఆడిస్తారు
ఒక్క సారి ట్రై చేసి చూడండి
అది నిజాంపేట్ రోడ్ ఆంధ్ర బ్యాంకు ఎదురు గా వుంది

సుజాత వేల్పూరి said...

బ్లాగాగ్ని గారు,
పూనా నుంచి వచ్చి గుంటూర్లో ఏం చేర్పిస్తారు గానీ కొంచెం బేరమాడి పూనాలోనే ప్రయత్నించండి. నిజంగానే పద్ధెనిమిది నెలల వయసు నించే చేర్పించాలట ప్లే స్కూల్లో!

బ్రహ్మి గారు,
మరో ఫ్లాట్ కొని EMI మొదలెట్టండి. మీ పెళ్ళై పిల్లలు పుట్టే టైం కి అది అమ్మేసి వాళ్లని స్కూల్లో చేర్చొచ్చు!

నాకు ఒక్క ఇన్సూరెన్స్ పాలసీ లేదు గానీ మా పాప చదువు కోసం రెండు ప్రీమియాలు కడుతున్నాను

అది సరే,మీరు స్కూలు పెట్టడం శుభవార్తే గానీ మళ్ళీ ఈ "షరతులు వర్తిస్తాయి" ఏమిటి? ఇక్కడే నాకు మండిపోతుంది.

గీతాచార్య,

reality bites అంటే ఇదే మరి! చూడబోతే ఇంకా అనుభవమైనట్టు లేదు. ఒక్కసారి మీ చెన్నై లో కూడా కనుక్కోండి, అన్ని మెట్రో నగరాల్లోనూ ఇదే దృశ్యం!

సుజాత వేల్పూరి said...

వరూధిని గారు,
మీరు చెప్పిన దానితో ఏకీభవించడం తప్ప వేరు మార్గం లేదు.

జ్యోతి said...

నాదీ వరూధినిగారి మాటే. పెద్ద స్కూల్లలో మన పిల్లలు చదవాలి. అప్పుడే ఎక్కువ చదువుకుని తెలివి కలవారు అవుతారు అనుకుని ఈ హైక్లాస్ స్కూల్లని మనమే పోషిస్తున్నాము. ఎక్కడైనా చెప్పేది అదే చదువు. తల్లితండ్రులు కాస్త శ్రద్ధ పెడితే పిల్లలకు సరైన మార్గం చూపించొచ్చు. ఈ రోజుల్లో చదువుకు మనమే ధర కడుతున్నాము. డబ్బులున్నాయి , అందుకే హైక్లాస్ ఏసి స్కూలులో చదివిస్తాము అని అనుకుంటుంటే ఇక చేయగలిగిందేమీ లేదు. నాది, మావారి చదువులు వందలలో ఉంటే, మా పిల్లలవి వేలల్లో ఉండేవి. ఇప్పుడు లక్షల్లోకి దిగాయి. మనం అలాగే ఇస్తూ ఉంటే అవి ఇంకా పెరుగుతుంటాయి.
అనవసరంగా హైరానాపడిపోయి ఉద్యోగాలు చేసేబదులు ఈ స్కూలు వ్యాపారమే బాగుండేటట్లుంది కదూ..

నాగప్రసాద్ said...

గవర్నమెంటు స్కూళ్ళల్లో చెప్పరు అన్నది కేవలం అపోహ మాత్రమే. చిన్నప్పుడు నాకు చుక్కలు చూపించే వాళ్ళు హోంవర్క్ అనీ, అసైన్మెంట్లనీ.

+2 మాత్రం చచ్చినట్లు ప్రయివేటు కాలేజీ లో చదివా.

ఆ తరువాత షరా మామూలే అంతా ప్రభుత్వమే చూసుకుంటోంది.

నిజానికి మా IIT లో చాలామంది గవర్నమెంటు స్కూలు గాల్లే. ఒక్కరికి కూడా పెద్దగా ఇంగ్లిష్ రాదు. చచ్చినట్లు తెలుగులో మాట్లాడుకుంటాము.
అందుకే మేము IITM ని ముద్దుగా Indian Institute of Telugu Members అని పిలుచుకుంటాము. ఏదో ఈ మధ్య "ఈనాడు ప్రతిభ" లో "సురేషన్" గారి వల్ల కొద్దిగా english నేర్చుకున్నాము.
ఒక్క ఇంగ్లిష్ లో తప్ప మేము ఎందులోనూ తక్కువ గాదు ప్రయివేటు స్కూలు వాళ్ళతో పోలిస్తే.

మీకింకో విషయం తెలుసా +2 తరువాత అందరూ ఏ University లోనో IIT లోనో సీటు రావాలని కోరుకుంటారు. ప్రయివేటు కాలేజీలో డిగ్రీ చేసేవాళ్ళని చాలా చులకనగా చూస్తారు.

నిజంగా మీరు చెప్పిన ఫీజులు చూస్తే మాత్రం కళ్ళు తిరిగినాయ్. నేను మాత్రం నా పిల్లల్ని మా ఊరు గవర్నమెంటు స్కూల్లోనే చేర్పిస్తా. ఒకవేళ వస్తే గిస్తే మా ఊరు బుద్దులే వస్తాయి. ఏంటొ అప్పుడు నా భార్య ఒప్పుకుంటుందో లేదో పిల్లల్ని గవర్నమెంటు స్కూళ్ళల్లో చదివించటానికి.

నిజానికి ఈ బ్లాగులోనే ఎవరో కామెంటు చేసినట్టు, "ప్రయివేటు స్కూళ్ళకు లక్షలు లక్షలు ఇచ్చే బదులు గవర్నమెంటు స్కూళ్ళకు సంవత్సరానికి పదివేలు ఇస్తే చాలు, మన పిల్లలే కాకుండా ఇంకా ఎంతో మంది పేద పిల్లలకు సహాయం" చేసినట్టవుతుంది.

Chivukula Krishnamohan said...

ఇంజనీరింగులో కొద్ది సంవత్సరాల క్రితం సంవత్సరానికి రూ.367/- రెండు వాయిదాల్లో కట్టి చదువుకున్నా. ఆ ముందు పన్నెండేళ్ళ చదువుకీ సంవత్సరానికి 30-35 రూపాయలు కట్టేవాడిని. మొత్తం వెరసి ఐదు,ఆరు వేల రూపాయలు ఖర్చుపెట్టించాననుకుంటా అమ్మావాళ్ళతో. మీరు చెప్తున్న అంకెలు మొదట మీ కోలనీ మొత్తం చదువులవా లేక మొత్తం స్కూలు నిర్వహణ ఖర్చులా అని అర్థం కాలేదు. వ్యాఖ్యలు చూస్తూ ఉంటే అనుమానం వచ్చింది - కొంపతీసి ఒక పిల్లాడికి అయ్యే ఖర్చుగానీ వీళ్ళు మాట్లాడుకోవట్లేదు కదా అని.
చదువుకొనడం నెమ్మదిగా చదువు'కొనడం'గా మారింది. కారణాలా - వద్దులెండీ - తెలుసుకుని ఏమి చేస్తాం? లోపాలు తల్లిదండ్రుల్లో ఉన్నాయి అంటే ఒప్పుకోవడానికి ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు?

కల said...

ఏమిటి? (చాలా ఆశ్చర్య పోతే ఉండే ఎక్స్ ప్రెషన్ అన్న మాట ఊహించేసుకోండి). ఇంతలా రేట్లు పెరిగిపోతే కష్టమే కదండీ? ఈ సెప్టెంబరు గోలేమిటో అర్ధం కాలేదు.

సుజాత వేల్పూరి said...

నాగప్రసాద్ గారు,
గవర్నమెంట్ స్కూళ్లలో చెప్పరు అనేది ఇప్పటి మాట. ఇదివరలో పోటీ పడుతూ ఉండేవి విద్యా ప్రమాణాల్లో! నేనూ పదో క్లాసు వరకు గవర్నమెంట్ హైస్కూల్లోనే చదువుకున్నాను. భయంకరమైన డిసిప్లిన్, అత్యుత్తమ టీచర్లు, బోధన! కానీ ఇప్పుడు వెళ్ళి చూడండి ఎలా వున్నాయో! (చాలా వరకూ ఇంతే)

మా పనమ్మాయి కూడా"సర్కారీ ఇస్కూల్లో చెప్పరు మేడం, అందుకే ప్రైవేటు ఇస్కూల్లో జేర్చినా, కావాలంటే ఇంకో రెండిళ్ళు ఎక్కువ చూసుకుంటా" అంటే కళ్ళు తేలెయ్యాల్సి వచ్చింది.

లచిమి,
ఎలాగూ మేము వచ్చే యేడు MAYTAS హిల్ కౌంటీలో ఉండాలి! అందుకే అటువేపు వెదుకుతున్నాను స్కూళ్ళు! చాలా మంచి సమాచారం ఇచ్చావు! బంగారు తల్లి లాగా గంపెడు పిల్లల్ని కను ..ఫీజులు ఎలా కట్టుకుంటావో నాకు తెలీదు! దీవెన ఫ్రీ కదా అని ఇచ్చేశా! నిజంగా చాలా థాంక్స్ రా!

కృష్ణ మోహన్ గారు,
మీ ఫీజులు చూసి నాకే ఈర్ష్యగా ఉంది! మనం పిలిచి దోపిడీ చేయించుకోవడానికి రెడీగా ఉంటే ఎవరికి మాత్రం దోచడానికి సరదాగా ఉండదు చెప్పండి? స్కూళ్ళూ ఇంతే! "ఇంత ఫీజు ఎందుకు కట్టాలి?" అని ఏ పేరెంట్సూ అడగరు!

కల,
ఎల్కేజీలో చేరాలంటే కొన్ని స్కూళ్లలో మూడేళ్ల ఆరు నెలలు, కొన్ని స్కూళ్లలో మూడేళ్ళ ఏడు నెలలు వయసు ఉండాలి. అలా ఉండాలంటే పిల్లలు సెప్టెంబర్ నెలలో పుడితే కరక్టుగా సరిపోతుంది. కొన్ని స్కూళ్లైతే ఒక వారం అటు ఇటూ అయినా వూరుకోరు. ఇది మరీ టూ మచ్ గా అనిపించింది నాకు.

నీకు ఇంకా అర్థం కాకపొతే ఇక్కడ కాదు, ప్రమదావనం లో చెప్తాన్లే!

ramya said...

సుజాత గారు,ఇప్పుడున్న పరిస్థితి సరిగ్గా రాసారు.
నాకు తెలిన ఒక స్కూల్ లో ఒలెంపియాడ్ ఏసీ అని ఐ ఐటీ అని ఇలా రకాలు గా ఉన్నాయి,
నాలుగో ఫ్లోర్లో ఏసీ పిల్లలు. వాళ్ళని దాటుకుని పై ఫ్లోర్ కి నాన్‌ ఏసీ పిల్లలు వెళుతూఉంటారు, ఇప్పుడే ఎంత విభజన! అనిపిస్తూ ఉంటుంది వాళ్ళనందరినీ చూస్తే! కనీసం లిఫ్ట్ లేదు, పిల్లలు లంచ్ అవగానే పరిగెత్తి ఆ మెట్లన్నీ ఎక్కి వెళుతూఉంటారు, సరైన పార్కింగ్ ఉండదు, ఓ షాపింగ్ కాంప్లెక్స్ లా రోడ్డుమీదకే స్కూలు.
ఐనా ఆ స్కూలుకి చాలా డిమాండ్!
బయట పేరెంట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు..ఇలా.. మీ అబ్బాయి ఏసీనా? నాన్‌ ఏసీనా?...

అన్ని ధరలూ పెరిగాయి, అలాగే చదువు ధరకూడానేమో!
మనం అనుకుంటున్నాం, గవర్నమెంట్ స్కూల్స్ అదీ అని, కానీ నిజంగా సిటీ లో గవర్నమెంట్స్ స్కూల్స్ బాగుండవు, పల్లెటూళ్ళలో కాస్త బావున్నా, ఇంగ్లీష్ చదువులు లేకపోతే మన పిల్లలు అందరిలో వెనకబడిపోతారేమో నన్న ఫీలింగ్, అందుకే ఇప్పుడు మండల్ స్థాయి ఊళ్ళలోనూ ప్రైవేట్ స్కూల్స్ కి డిమాండ్ పెరిగింది.

గతం లోకి పోలిస్తే ఇప్పుడు ఉద్యోగుల జీతాలూ బానే ఉన్నాయి,(సెంట్రల్ గవర్నమెంట్ లో అటెండర్ కాడెర్ వాళ్ళ్కి స్టార్టింగ్ సాలరీ పది వేలపైనే..)
ఏసీ స్కూల్స్ లో పిల్లల్ని చేర్చడానికి బ్లాక్ మనీ సంపాదించిన వారూ చాలా మందే ఉన్నారు.

కామేశ్వరరావు said...

చెన్నైలో రేట్లు మరీ ఇంత ఎక్కువగా ఉన్నట్టులేదు. లేదా నాకంత "high-level" స్కూళ్ళ గురించి తెలీదో మరి!
మాకు తెలుసున్నవాళ్ళు తమ పిల్లాడిని చేర్పించేందుకు ఇక్కడొక స్కూలికి వెళితే, దరఖాస్తుతోపాటు ఒక తెల్లకాగితం ఇచ్చారట. అదేవిటో అర్థం కాలేదు వాళ్ళకి. తలిదండ్రుల వివరాలో మరేదో రాయాలనుకున్నారట. తీరా చూస్తే, వాళ్ళెంత "Donation" ఇవ్వగలరో అందులో రాయమన్నారు. వచ్చిన "quotations" బట్టి, సీట్ల కేటాయింపు జరుగుతుందిట! ఈ సంగతి విని, నా మతిపోయింది.
విద్యలాంటి మౌలిక అవసరాలని ప్రైవేటీకరించడంవల్ల వచ్చిన పరిస్థితులివి. వైద్యానికి సంబంధించి కూడా పరిస్థితులు సరిగ్గా ఇలాటివే కదా!
ఇందులో తలిదండ్రుల బాధ్యత కొంతవరకూ ఉన్నా, పూర్తిగా నేరం వాళ్ళమీద మోపడం సరికాదని నా ఉద్దేశం. ప్రభుత్వ పాఠశాలల స్థాయి తక్కువ అనుకోవడం పూర్తిగా అపోహ కాదు.
ఇలాటి మౌలిక అవసరాలకి సంబంధించిన రంగాలలో ప్రైవేటీకరణ నిషేధించడం లేదా కనీసం నియంత్రించడం కన్నా దీనికి మరో పరిష్కారం ఉందేమో నాకు తెలీదు.

Anonymous said...

Wow, very educational. నేను ఎంత వెనకబడి వున్నానో ఇప్పుడు తెలుస్తోంది.
చెట్టు కింద కూచుని పేలు చూసుకుంటారా .. బాగా అడిగావు. :)

వైష్ణవి హరివల్లభ said...

చాలా బాగుంది. కొంచం భయం వేసింది. నిజం చెప్పాలంటే సర్కారీ బళ్ళలో చదివించి వాటిని ప్రోత్సహిస్తే ఫీజుల గోలా తగ్గుతుందీ, ట్యూషన్ల వల్ల కొందరు నిరుద్యోగులు పొట్ట పోసుకుంటారు. మనవాళ్ళే కదా ఈ ప్రైవేట్ బల్లను పెంచి పోషించింది. సర్కారీ బళ్ళలో ఏముంటుందనే బదులు మనమంతా గట్టిగా ప్రయత్నిస్తే ఉపయోగం ఉండకుండా పోతుందా?

వైష్ణవి హరివల్లభ.

Bolloju Baba said...

భలే సుజాత గారూ
గొప్ప కలకలమే రేపారు మీ పోస్టుతో.
అభిప్రాయాలన్నీ చాలా బాగున్నాయి.

బొల్లోజు బాబా

Rajendra Devarapalli said...

నేను చెప్పేది కాస్త అతిశయోక్తిగా ఉంటుందేమో..స్కూలు,కాలేజీల ఫీజులు పక్కనబెడితే,నా మొదటి పీజీకి ఆంధ్రాయూనివర్సిటీలో కట్టిన ఫీజు పాతికో,ముప్ఫయ్యో,హాస్టలుకు మాత్రం అక్షరాలా పదహారు రూపాయలు అడ్మిషన్ కి.కాలేజీ హాష్టలు అడ్మిషన్ ఫీజు మాత్రం RS.556(డిగ్రీలో).అసలు ఈ స్కూళ్ళు,గోల మీద గత ఫిబ్రవరి లో సిరిసిరి మువ్వ గారి బ్లాగులో

http://vareesh.blogspot.com/search/label/%E0%B0%9A%E0%B0%A6%E0%B1%81%E0%B0%B5%E0%B1%81

వచ్చినప్పుడే ఒకటపా మొదలుబెట్టా,కానీ,తెలుసుకదా బద్దకం.నేను ప్రభుత్వం వారి పాఠశాలల్లో చదివా,ఆ విషయంలో మా స్కూళ్ళంటే నాకు చాలా గర్వం కూడా,ముఖ్యంగా మా హైస్కూలంటే కుదిరితే రానున్న నాలుగైదు సంవత్సరాలలో రాయగలను :)

సుజాత వేల్పూరి said...

రాజేంద్ర కుమార్ గారు,
రానున్న నాలుగైదు సంవత్సరాల్లోనా? అంత త్వరగానా?

Rajendra Devarapalli said...

అవును,అంతకన్నా ఎక్కువ నానబెడితే ఈ టపా చద్దిదౌవుతుందని హి హి :)
మరప్పుడే గా మీ పాప,మా బబ్లూగాడు హైస్కూలుకు వచ్చేది

సుజాత వేల్పూరి said...

విహారి గారు,
మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు చెప్పడం ఎలా మిస్సయ్యానో తెలియదు. సారీ అండి!

మీరు ఒకవేళ ఇండియా వచ్చి హైదరాబాదులో ఉండేట్టయితే పగలనకా రాత్రనకా రాళ్లు కొట్టయినా సరే(అక్కడ రాళ్ళు కొట్టడం ఉంటుందా) డాలర్లు వెనకేయాల్సిందే!

మీ ఫీజుల సంగతి వింటుంటే కుళ్ళుగా, ఈర్ష్యగా,
రకరకాలుగా ఉంది.

పెంకుల స్కూళ్ల సంగతి మాట్లాడతాం గానీ చూస్తూ చూస్తూ అంత పని చెయ్యలేమండి!

ధన్యవాదాలు!

Anil Dasari said...

మరీ అంత ఘోరంగా ఉన్నాయా బళ్లలో రేట్లు? మీరు ఏ కొన్నిటినో దర్శించి వదిలేశారేమో. హైదరాబాదులో చాలా ఆర్‌సిఎమ్ స్కూళ్లు ఉన్నాయి కదా. వాటిలో ఎందుకు ప్రయత్నించలేదు? అవి ప్రమాణాల విషయంలో అత్యుత్తమంగానూ, ఫీజుల విషయంలో (కార్పొరేట్ స్కూళ్లతో పోలిస్తే) ఉదారంగానూ ఉంటాయి కదా.

సిరిసిరిమువ్వ said...

సుజాత గారు,
సంఘమిత్ర స్కూలు ఉందిగా అని మరీ అంత సంతోషపడిపోకండి. స్కూలు బాగుంటుంది కానీ, ఆ స్కూలులో అడ్మిషను కావాలంటే రెండు మూడు సంవత్సరాల ముందు అర్జీ పెట్టుకుంటే కాని సాధ్యపడదు ):

@లచ్చిమి, నువ్వు సంఘమిత్ర ప్రాడక్టవా!!

Purnima said...

హమ్మ్.. మనం ఒకటే జనరేషన్ అండి! అందులో నాకెప్పుడూ అనుమానం లేదు. నా ప్రకారం ఒక జనరేషన్ అంటే ఇరవై సంవత్సారాలు వేసుకుంటాను.

ఇక చదువు ఖర్చా.. నన్నే అడిగారూ?! మీరు లక్షకెన్ని రూపాయాలు అని అడిగారు, నేనయితే రూపాయికెన్ని అని అడిగేదాన్ని. ;-)

Anonymous said...

టపానే చదివాను. కామెంట్లు చదవలేదు. టపా శీర్షిక తప్ప అంతా బానే చెప్పారు...

Bhãskar Rãmarãju said...

మా బుడ్డాడికి 3.6 ఏళ్ళు. ఇక్కడ, ఒక చెర్చ్ బళ్ళో వేసాం. ప్రీ-బడి. చాలా పెద్ద బడి. వీడి సెక్షన్ లో 13 మంది. వారానికి రెండ్రోజులు, రోజుకి రెండున్నర గంటలు. స్నాక్ గట్రా పెడతారు. నెలకి $120. డొనేషన్ లేదు, ఏమీ లేదు. ఈలెక్కన అమెరికాలోనే బెస్టులా ఉంది.

Bhãskar Rãmarãju said...

mIru nA I pOshT cadivinaTTulEru. http://ramakantharao.blogspot.com/2008/09/blog-post_28.html

నేననుకుంటుంటాను, ఈరోజున ఆంగ్ల పాఠశాలల్లో చదువు ఎంతవరకు విలువైన చదువూ? అని.
కారణం, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు ఒక ప్రవేశ పరీక్ష రాసి, ఒక సెలెక్షను ప్రాసెస్ తో వస్తారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసేవాళ్ళు? జిల్లాపరిషత్ పాఠశాల ఉపాధ్యాయులకి ఒక బోధనా పద్ధతి, ఇన్స్పెక్షను గట్రా, మరి వీళ్ళకి? ఏంటి ప్రమాణాలు?
ఇన్ని ఇంగ్లీషు బడులు రాకమునుపు స్టేటు ర్యాంకులు తెలుగు మీడియం వాళ్ళకే వస్తుండేవి, ఆంధ్ర ప్రదేశ్ గురుకుల పాఠశాలలకి ఎక్కువ వస్తుండేవి, కొడిహినగళ్ళి, తాడికొండ ఇలా.
ఈ ప్రైవేటు పాఠశాలలు వచ్చాక వీళ్ళు డబ్బుబెట్టికొనుక్కోటం మొదెలుబెట్టారు అన్నీ.
అత్యంత దౌర్భాగ్యం ఏంటంటే ,ఈరోజు ఎంతమంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తమ పిల్లల్ని అదే బడిలో జేరుస్థున్నారు?
ఇంగ్లీషు మీడియం చదువే చదువా? మిగతావి బడులే కావా?

Bhãskar Rãmarãju said...

మా బుడ్డాడికి 3.6 ఏళ్ళు. వాణ్ణి ఇక్కడ ఒక చెర్చ్ బళ్ళో వేసాం. Our Saviour Lutheren Church School, Albany, New York. చాలా బాగుంది బడి. 0-7 దాకా ఉంది దాంట్లో. మావాడి తరగతిలో 13 మంది. వారానికి రెండ్రోజులు బడి, రోజుకి రెండున్నర గంటలు. నెలకి $120. ఈలెక్కన అమెరికాలోనే చీపు. అన్నట్టు మీరు నాఈ పోష్టు చదివినట్టులేరు.
http://ramakantharao.blogspot.com/2008/09/blog-post_28.html
ఈరోజున ఆంగ్ల పాఠశాలల్లో చదువు ఎంతవరకు విలువైన చదువూ? అని.
కారణం, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు ఒక ప్రవేశ పరీక్ష రాసి, ఒక సెలెక్షను ప్రాసెస్ తో వస్తారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసేవాళ్ళు? జిల్లాపరిషత్ పాఠశాల ఉపాధ్యాయులకి ఒక బోధనా పద్ధతి, ఇన్స్పెక్షను గట్రా, మరి వీళ్ళకి? ఏంటి ప్రమాణాలు?
ఇన్ని ఇంగ్లీషు బడులు రాకమునుపు స్టేటు ర్యాంకులు తెలుగు మీడియం వాళ్ళకే వస్తుండేవి, ఆంధ్ర ప్రదేశ్ గురుకుల పాఠశాలలకి ఎక్కువ వస్తుండేవి, కొడిహినగళ్ళి, తాడికొండ ఇలా.
ఈ ప్రైవేటు పాఠశాలలు వచ్చాక వీళ్ళు డబ్బుబెట్టికొనుక్కోటం మొదెలుబెట్టారు అన్నీ.
అత్యంత దౌర్భాగ్యం ఏంటంటే ,ఈరోజు ఎంతమంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తమ పిల్లల్ని అదే బడిలో జేరుస్థున్నారు?
ఇంగ్లీషు మీడియం చదువే చదువా? మిగతావి బడులే కావా?

సుజాత వేల్పూరి said...

ఊకదంపుడు గారు,

నా టపా శీర్షిక కు ప్రేరణ నామిని సుబ్రహ్మణ్యం గారు రాసిన "చదువులా? చావులా?" అనే పుస్తకం పేరే! కాకపోతే అందులో ఆయన పిల్లలు ఈ చదువులతో ఎలా వత్తిడికి గురవుతారో రాశారు, తన స్వీయానుభవాలతో, చదివే ఉంటారు!

సుజాత వేల్పూరి said...

రమ్యగారు,
మీరు ఇదివరలో ఒకసారి కూడా ఈ స్కూలు గురించి చెప్పారు! మానవ సమాజంలో ఉన్నామా, లేక మరెక్కడైనా ఉన్నామా అని సందేహం వస్తుంది ఇలాంటివి విన్నా, చూసినా!

జ్యోతి గారు,
మీరు చెప్పింది నిజమే! ప్రిజుడిస్ చాలా సమస్యలకు కారణం! ఎంతైనా మీరు లక్కీ, మీ పిల్లల చదువైపోయిందిగా!


కామేశ్వర రావు గారు, వ్యాఖ్యకు ధన్యవాదాలు! డొనేషన్ అసలు ఎందుకివ్వాలి? అనే ప్రశ్నకు ఇంతవరకూ సమాధానం దొరకటం లేదు. "దానం" ఎవరైనా "ఇంత కావాలి" అని డిమాండ్ చేసి వసూలు చేయడమేమిటి? ఈ స్కూళ్ళ పని తీరుని ప్రభుత్వం నియంత్రించదా?

మాలతి గారు,
నా ఖర్చులకీ ఇప్పటికే ఇంత తేడా ఉంటే ఇక మీ చదువు ఖర్చుల సంగతి చెప్పాలా? మీరు గట్టునపడ్డారు, సరయు చదువైపోయిందిగా!

వైష్ణవి,
"మనమందరం" అనే మాట ఇలా ఏదో ఒక ఇష్యూ వచ్చినపుడే! రేపటినుంచి అంతా మామూలే! ఇదే ఇవాళ్టి సమాజం!

అబ్రకదబ్ర,
ఈ సారి మీరు ఇండియా వచ్చ్చినపుడు చూడండి, అప్పటికి ఇంకా పెరిగిపోయి ఉంటాయి రేట్లు. నాకైతే ఒక్కోసారి మా పాపను తీసుకెళ్ళి ఆ రావిపాడులో ఉంటుందే "అమలోద్భవి పాఠశాల" అనుకుంటా...అందులో పడేద్దామన్నంత విరక్తి కలుగుతోంది. ఎంచక్కా అక్కడైతే మా అన్నయ్య వాళ్ళు దాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు కూడా!(నేనిచ్చే పనిష్మెంట్స్ కూడా ఉండవు)

పూర్ణిమా,
ఖర్చుల విషయానికొస్తే ఇప్పుడు ప్రతి అయిదేళ్లకు ఒక జనరేషన్ చొప్పున లెక్కేసుకోవాలి. అల్లా పెరిగిపోతున్నాయి.

సుజాత వేల్పూరి said...

భాస్కర్ గారు,
నాగార్జున సాగర్ లోని గురుకుల విద్యాలయానికెంత పేరుండేది. మేము డిగ్రీ చదివేటపుడు ఒక విద్యార్థి అక్కడినుంచి వచ్చి చేరితే వాడేదో హీరో అన్నట్టు ఫీలయిపోయేవాళ్ళం. మొన్న మా అన్నయ్య కొడుక్కి అక్కడ సీటు వస్తే "ఇప్పుడు ఆ స్టాండర్డ్ లేదు" అని గుంటూర్ లో ప్రైవేట్ కాలేజీలో చేర్పించాడు.


మీరడిగిన ప్రశ్నలు సహేతుకం! ప్రైవేట్ స్కూళ్లకు ఇన్స్పెక్షన్ ఉండదు. వాళ్ల ప్రమాణాలను ఎవరు నిర్దేశిస్తారని అడిగే వాళ్ళుండరు.

ప్రభుత్వ పాఠశాలల పని తీరు మాత్రం ఇదివరలో లాగా లేదు కాక లేదు. ఉంటే ఆ స్కూళ్లలో పని చేసే ఉపాధ్యాయులే తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లలో చేర్చే పరిస్థితి ఎందుకొస్తుంది? నాకు తెలిసి అలాంటి కేసులు నాలుగున్నాయి!

Anonymous said...

మీరు సూచింనట్లు అకడెమిక్ ఇయర్ తప్పకూడదనుకుంటే, పిల్లల్ని కనడాన్ని ప్లాన్ చేసుకోవాలి.

రెండు రూపాయల రెనాల్డ్స్ పెన్‌కి వంద రూపాయల పార్కర్ పెన్నుకి, ప్లైన్ వెనిలా మరుతికీ - యస్ క్లాస్ బెంజ్‌కి తేడా ఉంటుంది, ఉండాలి. వాళ్ళు చార్జ్ చేస్తున్నారు అని తిట్టుకోవడం అనవసరం.

"ఏవిటి, నడిచోస్తున్నారు?"
"అబ్బే, పిల్లలను డ్రాప్ చెయ్యడానికి కారుని పంపాను, మనకి కూడా వాకింగ్ చేసినట్టుంటుంది కాదా" అన్న జవాబులో పిల్లల చదువు కాదు, కారు యజమానిని నేను అన్నది "వినపడ్డం" లేదు?

"శ్లోక" లో ప్రయత్నించారా?

Anonymous said...

@సిరి సిరి మువ్వ గారు మనం అచ్చమయిన స్వచ్చమయ్యిన సర్కారి స్కూల్ వారి ప్రోడక్ట్ .


సర్కారి స్కూల్ అయితే అన్నీ వుంటాయి ఆటలు పాటలు అల్లర్లు గొడవలు సరదాలు
మేజిక్ షోస్ ,సమాజ అవగాహనా సెమినార్లు ,పోటీలు ,పందాలు ,చక్కగా జిల్లా అధికారులందరిని చూడొచ్చు ఏదయినా ప్రోగ్రాం వుంటే ఇంకా ఇంటర్ స్కూల్ ఆటలా పోటీలు పేపర్లో ఫోటోలు
హా ఇంకా నీరు మీరు ,జన్మభూమి,మానవ హారం, ఐక్యత పెంచే పనులు ఇవన్నే ప్రైవేటు స్కూల్స్ లో ఎక్కడ వుంటాయి చెప్పండి
అలా అని మేము ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ప్రైవేటు స్కూల్ వాళ్ళకి ఏ మాత్రం తీసిపోము
మాకు ఇంగ్లీష్ తెలుగు రెండూ వచ్చు కాని వాళ్ళకి ఇంగ్లీష్ మాత్రమె వచ్చు
కాబట్టి మేమే గ్రేట్ . అన్నట్టు మనకి అప్పుడప్పుడు ప్రైజులు కూడా వచ్చేవి .
అవి తీసుకుంటున్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ కొట్టే చప్పట్లు ఇవన్నీ ఇప్పుడెక్కడ వున్నాయి లెండి
హా ఇప్పుడే ఒక ఆలోచన వచ్చింది దీని మీద ఒక టపా రాసేస్తా ప్రైవేటు స్కూల్ లో చదువుకున్న వాళ్ళందరూ కుల్లుకునే లా

సుజాత గారు నాకు గంపెడు పిల్లలు పుట్టినా వాళ్ళందర్నీ మా అమ్మ దగ్గరికి పంపించేస్తా
ఆమె చదివిస్తుంది ఇప్పుడు సర్కారు వారి స్కూల్స్ లో కూడా ఇంగ్లీష్ మీడియం వచ్చింది గా
అక్కడే చదివించమంటే సరి!!! ఎంత రాసి పెట్టి వుంటే అంటే చదువుకుంటారు
అయినా "ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు మహేష్ బాబు " అన్నాట్ట నాలాంటి వాల్లెవరో

సంఘ మిత్ర స్కూల్ మా హాస్టల్ ఎదురుగా వుంటుంది
అక్కడికి పిల్లలు సంతోషం గా వస్తారు ఎవరి మొహలోన్ను అబ్బ చా ఎందుకొచ్చిన స్కూల్ అన్నా ఫీలింగ్ కనిపించలేదు అందుకే మీకు చెప్పాను
కాని మరీ ఇలా రెండు మూడేళ్ళ ముందే అర్జీ పెట్టుకోవాలి అన్నా సంగతి నాకు తెలియదు సుమండీ !!!

Rajendra Devarapalli said...

"ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు మహేష్ బాబు " హల్లో లచ్చిమి,పై కామెంటును నేను తీవ్రాతితీవ్రంగా ఖండిస్తున్నా. మహేష్ బాబు ను సోమలింగం అంటే కత్తి మహేష్ కుమార్ ఊరుకోవచ్చు,కానీ నేను మాత్రం అస్సలూరుకోను.మాయింటిల్లిపాదీ మహేష్ బాబుకు వీరాభిమానులం మరి.కావాలంటే నా తాజాటపా
http://visakhateeraana.blogspot.com/2008/09/awesome-awful-1.html


చూసుకోవచ్చు.:)

బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్ said...

@సుజాత గారు,

ఇంకో EMI నా? నా వల్ల కాదు !!!

షరతులు వర్తిస్తాయి అంటే ఈ చిన్న చిన్న షరతులు అన్నమాట !!
1. డొనేషన్ కాకుండా టుషన్ ఫీజు, స్కూలు బస్సు చార్జి, యూనిఫార్మ్ బ్రాండ్ ఖర్చులు అదనం.
2.అలాగే మా ఇష్టం వచ్చినప్పుడు మీకు చెప్పకుండా ఫీజులు పెంచుకోవచ్చు.

Unknown said...
This comment has been removed by the author.
Unknown said...

సుజాత గారు ఈ రోజుల్లో చదువు కునేట్టు లేదు చదువు కొనేట్టు గా వుంది.బెస్ట్ వ్యాపారం ఏంటంటే ఒక గుడి కట్టు కుని బడి పెట్టు కుంటే కొన్ని తరాలు చూసుకోనవసరం లేదు.పోనీ అంత డబ్బులు పోసి జాయిన్ చెసినా అక్కడ పని చేసే టీచర్స్ కి వాళ్ళిచ్చే జీతం చాల తక్కువ సో నాసి రకం వస్తారు.వాళ్ళెంత సేపు మీ వాణ్ణి స్కూల్ వదిలాక రెండు మూడు గంటలు చదివించాలి అని నూరి పోస్తారు పేరెంట్స్ మీట్ లో .ofcourse ఇలాంటి వాటికీ exceptions కూడా వున్నాయి. హైదరాబాద్ లో johnsongramer స్కూల్ అని హబ్సిగుడా లో వుంది అక్కడ పిల్లలకి చాల బాగా చెపుతారు మా వాడికి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో కూడా వస్తే కూడా అక్కడే కంటిన్యూ చేసాం. ఫీజు లు కూడా govt కి ఎక్కువ chirec కి తక్కువ అనట్టు గా వుంటాయి. ఏ రాయి అయిన ఒకటే అయితే కొన్ని సుతిమెత్తగా కొడితే కొన్ని పళ్ళు రాల గోడతాయి.

Anonymous said...

రాజేంద్ర గారు ఇది అష్టా చెమ్మ సినిమా ఎఫెక్ట్ లెండి పట్టించుకోవద్దు
"అయ్యిన మహేష్ బాబు (హీరో) పుట్టకముందు నుంచే ఆ పేరు ఉంది కదా
సో నేను హీరో మహేష్ బాబు అనలేదు
సో ఆ మహేష్ బాబు వేరు హీరో మహేష్ బాబు వేరన్నమాట

నాగప్రసాద్ said...

గవర్నమెంటు స్కూలు టీచర్లు బాగా చెప్పరు అనే బదులు మనమే గవర్నమెంటు స్కూలు టీచర్లను ప్రోత్సహిస్తే పోలె.

ఇక్కడ ప్రోత్సహించడం అంటే ప్రతి స్కూలుకి వెళ్ళనక్కర్లె. జస్ట్ మనం చదువుకున్న స్కూళ్ళలో, ప్రస్తుతమున్న హెడ్ మాస్టర్లని ప్రోత్సహిస్తూ ఉత్తరాలు వ్రాస్తే ఎలావుంటుందో ఒకసారి ఆలోచించండి.

ఉదాహరణకి,
హెడ్ మాస్టరు గారు, ఈ సంవత్సరం మీ స్కూలుకి మంచి ఫలితాలొచ్చాయి, వచ్చే సంవత్సరం కూడా ఇంతకన్నా మంచి ఫలితాలు రావాలని ఆశిస్తున్నాను.
ఇట్లు
xxxxxx

కాకపోతే ఉత్తరాలెప్పుడూ ప్రోత్సాహకరంగానే ఉండాలి. స్కూలు ఫలితాలు బాగున్నా, లేకపోయినా. ఎక్కడా విమర్శించ కూడదు.

అలాగే స్కూలు ఫలితాలు మీకు బాగున్నాయనిపిస్తే, అప్పుడప్పుడు చిన్న చిన్న బహుమతులు కూడా పంపవచ్చును.

ఇలా ఒక్కొక్క స్కూలునీ ప్రోత్సహిస్తూ, స్కూళ్ళ మధ్య మళ్ళీ పోటీ వాతావరణాన్ని తీసుకురాలేమంటారా.

Sujata M said...

బా బో య్ ! టెర్రిబుల్ టాపిక్ కి టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. సుజాత గారు.. కికోస్ గురించి ఆలోచిస్తేనే భయం వేస్తోంది. మీ పోస్ట్ కన్నా వ్యాఖ్యలు చదివి, కళ్ళు నొప్పి, తల నొప్పి, గుండె నొప్పి (ఆవేశం), ఆయాశం, వచ్చాయి. అసలు యూ.కె లో పిల్లల్ని కన్నందుకు బోల్డు ప్రోత్సాహకాలు, (ఉచితంగా ఏడాది పాటూ, వైద్యం, నేపీలూ, డైపర్లూ, అవి పడేసుకొనే చెత్త డబ్బాలూ.. డబ్బులూ.. గిఫ్టులూ..) ఇస్తారు. పిల్లలని స్కూల్లో ఉచితంగా చేర్చుకుంటారు. ప్రాణంగా చూసుకుంటారు. .. ఆ దేశంతో పోలిస్తే, మనుషుల్ని ముష్టివాళ్ళలాగా చూసే ప్రభుత్వాస్పత్రులలోకీ, ప్రభుత్వ పాఠశాలలకీ, డబ్బిస్తేనే (డబ్బిచ్చినా కూడా.. దొరకని) ప్రాధమిక విద్య - ఇలాంటి పరిస్థితులు చూసే కదా జనం విదేశాలకి పోయేది అనిపిస్తుంది ! అసలు ప్రభుత్వ పాఠశాలలు ఏమయ్యాయి ? మా వాచ్ మేన్ పిల్లలు కూడా కాన్వెంట్ లో నే చదువుకుంటున్నారు. అసలు ... బోల్డంత కోపం వచ్చింది గానీ, నిస్సహాయంగా కూడా అనిపించింది.

సుజాత వేల్పూరి said...

నెటిజెన్,

శ్లోక ఎక్కడుంది? నేను కుకట్ పల్లి, మియాపూర్, బాచుపల్లి,, ప్రాంతాల్లో చూస్తున్నాను స్కూలు కోసం!

రవిగారు,
అంతే! ఒక గుడి, ఒక బడి! స్థిరమైన ఆదాయం!

నాగప్రసాద్ గారు,
మీరు చెప్పిన ఐడియా గురించి ఇంకా చర్చ జరగాలి! కేవలం బ్లాగర్ల మధ్య కాదు, ప్రజల మధ్య కూడా!

సుజాత గారు,
అయితే నా సిన్సియర్ సలహా....పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటే కికోస్ ని ఇక్కడ ప్లాన్ చెయ్యొద్దు! యుకె లోనే ప్లాన్ చెయ్యండి!

సుజాత వేల్పూరి said...

aiswarya,
thanks for the info about geetanjali school? can you please tell me the location please?

నాగప్రసాద్ said...

సుజాత గారు,
ఎవరికి వారు ఉత్తరాలు రాసేదానికి కూడా చర్చ జరగాలంటారా.
అదేదో మనమే ప్రారంభించి, నిదానంగా ప్రజల మధ్యకు తీసుకెల్తే పోలె.

aishwarya said...

gitanjali is in begumpet opposite HPS....another branch is in secunderabad ...it`s far from kukatpally anyway.....silver oaks ,
i`ve heard is good in kukatpally area......

Anonymous said...

బాబా గారు,
సర్కారీ బళ్లంటే ఒక చులకన.
ఎందుకంటే అక్కడ చదివిస్తే " లేనిపోని బుద్దులు నేర్చుకొంటాడు"

M.M.S లు పుట్టింది సర్కారి బడిలో కాదు కదా
సుజాత గారు,
ఆ పుస్తకం నాకు తెలీదు. నేను చదివేది ( చదివింది) తక్కువ, చదివాను అనుకునేది ఎక్కువ.:(
నా అభ్యంతరమల్లా .. ప్రస్తుతానికి, ఏ కెజీ పిల్లాడు - "నన్ను ఫలానా స్కూల్లో నే చదివిస్తావా, చస్తావా అనటం లేదు"..
సగటు తల్లిదండ్రులు తమ కుమార్తె/కుమారుడి కెజీ చదువు తమ చావుకొచ్చింది అని ఎందుకనుకుంటున్నారు..
ఒక తరం ముందు దాకా ( పూర్ణిమ గారి లెక్క లో ఓ ఇరవై సం.) తల్లిదండ్రులులు తమ పిల్లల చదువు ఇంత సమస్య కాలేదే?...
స్తూలం గ వ్యక్తుల్లోనూ వచ్చిన మార్పిది ..
ప్రతి దానికి బ్రాండ్ నేం కావాలి.. మావాడు అమెరికా లో ఉద్యోగం చేస్తున్నాడు దగ్గర నుంఛి ,.. మా చంటొడు ..ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాడు అనే వరకు..
హైదరబాదు లొ బాగా డబ్బూన లొకాలిటిలో, బాగా రద్ది రోడ్డు మీద ఒక పెట్రోలు బంకు , ఒక కారుషోరూము మధలో/ఆనుకొని రెండుస్కూళ్లున్నాయి, ఆ బళ్లకి తమపిల్లలని ఏ ధైర్యం తో పంపిస్తారో నాకు అర్ధం కాదు

cbrao said...

అయితే వచ్చే సంవత్సరం నుంచీ మనము Maytas Hill county లో ఇరుగూ పొరుగూ అన్నమాట.

Anonymous said...

నమస్కారం..
నేను ఒక పోస్ట్ రాసాను..
ప్లీజ్ ఒకసారి నా పోస్ట్ చదివి వీలుంటే మీకు నచ్చితే spread it..ప్లీజ్
ధన్యవాదాలు..
లింక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
http://prakamyam.blogspot.com/2008/10/blog-post.html

సుజాత వేల్పూరి said...

ఊక దంపుడు గారు,
మీరు చెప్పిన రెండు స్కూళ్ళ సంగతి నాకూ ఆశ్చర్యమే! ఇంకో విషయం తెలిసే ఉంటుంది, ఆ కారు షో రూం ఇదివరలో లేదు, అక్కడ ఆ రెండు స్కూళ్ళ కు కలిపి ఉమ్మడి గా ఒక ఆట స్థలం ఉండేది. రోడ్ నంబర్ 36 లో కమర్షియల్ కట్టడాలకు అనుమతి రావడంతో ఆ గ్రౌండ్ మాయం చేసి అక్కడ షో రూం కట్టారు. ఆ పిల్లలు రోజంతా ఆ స్కూళ్ళలో బందీలు గా ఎలా ఉంటారా అని ఆలోచిస్తుంటాను అటు వెళ్ళినపుడల్లా! పక్కనే పెట్రోల్ బంక్ ఉందంటే అసలు తల్లి దండ్రులకు గుండె దడ ఎలా ఉండదా అని మరో ఆశ్చర్యం! కానీ ఏం చేస్తాం, ఆ రెండూ "ఇంటర్నేషనల్ స్కూళ్ళు" మరి.

మీరడిగిన ప్రశ్నలే నేనూ అడిగాను గమనించారా, ఇంతకు ముందు తరానికి లేని ఖర్చులు ఇప్పుడు అకస్మాత్తుగా ఎలా పెరిగాయా అని! కొంచెం స్టాండర్డ్ ఉంది అనుకున్న ప్రతి స్కూలూ ఇలాగే వసూళ్ళు చేస్తుంటే, ఏదో ఒక స్కూలు ఎంచుకోవాలి కదా! పరిస్థితేమో ఏ రాయి అయితేనేం ..అన్నట్టుంది.

సుజాత వేల్పూరి said...

రావు గారు,
నిజమా, అయితే మనం బాల్కనీల్లో నిల్చుని బ్లాగేసుకోవచ్చన్నమాట. వెరీ గుడ్! మంచి వార్త చెప్పారు.

సుజాత వేల్పూరి said...
This comment has been removed by the author.
రిషి said...

సుజాత గారు,
ఈరోజు తీరిగ్గా కూర్చుని మీ టపాలన్నీ చదివేసానండీ...
ప్రతీ టపా దేనికదే .....super.
మీ అన్ని టపాలకి కలిపి ఇక్కడే రాస్తున్నాను-Welldone.

సుజాత వేల్పూరి said...

రిషి గారు,
నా టపాలన్నింటినీ చదివిన మీ వోపిక కు జోహార్లు! అవి మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!

అరుణాంక్ said...

ఇది సూపర్ హిట్ టప

చదువు కునే రోజులు పోయి చదువు కొనే రోజులు వచ్చి నై.

మన చదువు మొత్తము ku అయిన కర్చు తో ఇప్పడు KG కూడా కంప్లీట్ అవ్వదు .మనం గవర్నమెంటు స్కూల్ లో చదివాం కాని మన పిల్లలను అక్కడ చదివించలేము.living standards perigai.

అంతేకాకఅ స్కూల్ నుంచి ట్రాన్స్పోర్ట్ ఉండదు .సఫెతి సెక్యూరిటీ ఉండదు.స్కూల్ బిల్డింగ్స్ ఎప్పుడు పడి పోతాయో .... అక్కడ పని చేసే టీచర్స్ పిల్లలను కూడా అక్కడ చదివించరు.

Globalosation era లో compitetion ugam lo ,ippudunna school conditions lo mana pillalanu gavarnamentu school lo chadivimchalemu.

ఏకాంతపు దిలీప్ said...

@సుజాత గారు
generation గాప్ గురించి మీరు ఇంకా మరిచిపోలేదన్నమాట! :-)
నాకైతే కేవలం ఫీజుల లెక్కే అయితే, 3000(ఐదో తరగతి వరకు) +10000 ( పదో తరగతి వరకు)+ 15000 ( పన్నేండు వరకు) + 24000 ( బి టెక్) ======= 52000/-

kroy said...

schooling ki kooda education loans esthe baagundu :-)

Bolloju Baba said...

ఊకదంపుడు గారు

సర్కారీ బళ్లంటే ఒక చులకన.
ఎందుకంటే అక్కడ చదివిస్తే " లేనిపోని బుద్దులు నేర్చుకొంటాడు"

మీరుటంకించిన నా వాఖ్య లోని ఈ వాక్యం నా స్టేట్ మెంట్ కాదండీ. అటువంటి ప్రిజుడీస్ సమాజంలో ఉన్నాయి అని నా భావం.
గమనించగలరు.
బొల్లోజు బాబా

Unknown said...

Sujatha garu..
Chaala santhosham ga undi.
Computer screen meda telugu lo cinemala gurinchi kakunda, chakkati vyakhyalu chadavagalagadam entho anandam ga undi. Naalanti IT jeeviki meeru kasta oopiri oodaru :)
Keep it up

Kalyani

గీతాచార్య said...

"Sweet sixteen" thousand. Congratulations.

Niranjan Pulipati said...

నా చదువు మొత్తానికి అయిన ఖర్చు లక్ష కూడా దాతదేమో.. అటువంటిది kG కే లక్ష అంటే వామ్మో.. ఇక్కడ అందరూ చెప్పినట్టు ఇందులో చాలా మంది తల్లిదండ్రుల తప్పు కూడా వుందనిపిస్తుంది..
చాలా మంచి టపా అండి..

సుజాత వేల్పూరి said...

అరుణాంక్,
నిరంజన్, థాంక్యూ!
గీతాచార్య,
"sweet sixteen...నిజంగానే! ఇంతమంది నా బ్లాగు చూడ్డం చాలా స్వీట్ గానే ఉంది.
కల్యాణి,
ధన్యవాదాలు.

దిలీప్,
నిజమే! ఇప్పటి స్కూళ్లతో పోలిస్తే మనందరి చదువులూ చవక గానే కనిపిస్తున్నాయి.

kroy
త్వరలో బాంక్ లు ఆ స్కీము కూడా మొదలెట్టేస్తాయేమో చూద్దాం!

నాగప్రసాద్ said...

సుజాత గారు,
ఏంటో ఈ టపా కి వ్యాఖ్యలు మీద వ్యాఖ్యలు వస్తూనే వున్నాయి.

నాకు కూడా ఈ టపా చదినప్పటినుంచి మనఃశ్శాంతి లేకుండా పోయింది.

కారణాలేమిటంటే, సిటీల్లో ప్రైవేటు పాఠశాలల్లో పిల్లల్ని చదివించే తల్లిదండ్రులు, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లాడితో కలిసి ఆడుకోవడానికి, వాళ్ళ పిల్లల్ని అనుమతించరంట. మా ఫ్రెండ్స్ చెప్పారు.

అలాగే నా అయిడియా ని ఎలా Implement చేసుకోవాలో అర్థం కాక రోజూ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నా.

సుజాత వేల్పూరి said...

నాగ ప్రసాద్ గారు,

ఈ సంగతి నాకు నిజంగా తెలియదు. మీరు చెప్పింది విన్నాక నాకూ మనశ్శాంతి లేకుండా పోయింది. పిల్లల్లో గొప్పా బీదా తేడాలు లేకుండా ఉండాలన్నదే యూనిఫాం ఉద్దేశం అంటారు. ప్రైవేట్ స్కూళ్ళు ఈ తేడాలు సృష్టించడానికి కూడా పూనుకుంటున్నాయన్నమాట. ఇహ ఏం చెయ్యాలంటారు?

సుజాత వేల్పూరి said...
This comment has been removed by the author.
Rajendra Devarapalli said...

విశాఖపట్నం లాంటి మామూలు,మారుమూల ప్రాంతంలోనే కొన్ని స్కూలువాళ్ళ ఏసీ బసుకి నెలకు వెయ్యి పదిహేను వందలు,దాన్ని బట్టి ఆలోచించండి మహానగరాల స్థితిగతులు

Unknown said...

మీ టపాకి అద్భుతమైన స్పందన లభించింది. ప్రతి ఒక్కరూ తరచి తమ జీవితాల్లోకి తొంగి చూసుకునేలా ఉంది ఈ పోస్ట్. అభినందనలు.

నాగప్రసాద్ said...

మీక్కూడా మనశ్శాంతి లేకుండా పోయిందా. :(

ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద.
స్వామియే శరణం అయ్యప్ప.
హర హర మహాదేవ శంభో శంకర.

ఏమీ లేదు. హిమాలయాలకు ఎటు వెళ్ళాలో కొంచెం దారి చెప్తారా.

గీతాచార్య said...

A quick fire century of comments. :-D

Kudos.

యడవల్లి శర్మ said...

సిగ్గుపడుతున్నాను...ఒక కార్పోరేట్ కాలేజీలో పంతులుగా పనిచేస్తున్నందుకు..
ఈ టపా..ఇన్ని వ్యాఖ్యలు చూసి...
కాని నాకు పాఠంచెప్పటం తప్ప ఇంకొక వృత్తి రాదు కదా...ఏం చేస్తాం...

gita said...

sujata's exeperiance about her daughter's schooling is true.

Burri said...

అందరు బ్రహ్మచారుల వల్లే భయపడక నేను ఒకటి డిసైడ్ చేసుకున్నా, నాకు పిల్లలు పుట్టిన తరువాత నేనే ఒక స్కూల్ పెట్టి ఫీజులూ బదులు పంతులు గారికి జీతాలు ఇస్తాను. స్కూల్ ఫీజులూ అయితే పెరుగుతాయి కాని జీతాలు పెరగవుగా మరి!!

మేము టపాలో భయపడి మందు కోసం కామెంట్స్ చదివితే, మీ సలహాతో కొత్త భయం వచ్చి చేరినది....

మీ టపా నా అభినందనలు.

మరమరాలు

Venky said...

ippaDikea inni samvatsaraalu pravaasamloa unDi kooDaa, inDlu, bhoomula dharalu choosi peadavaarigaa bhaadha paDutunna maa laanTi vaaLLaki nijamgaa idi kooDaa oka pedda debbae. andukea konni saarlu endukchinna goDava ikkaDea pravaasam lo unDi free vidya ni pillalaki ivvakooDadu anipistundi.

inkoa maaTa, maa tammuDu maa oorilo skool peTTaaDu kaania inta feezu kaadu. inkaa peTTina Dabbula kosamea choostunnaaDu, neanu kooDaa skool Taapar ki cheatanaina sahaayam cheastaanani cheppa.

Venky said...

ఇప్పడికే ఇన్ని సంవత్సరాలు ప్రవాసంలో ఉండి కూడా, ఇండ్లు, భూముల ధరలు చూసి పేదవారిగా భాధ పడుతున్న మా లాంటి వాళ్ళకి నిజంగా ఇది కూడా ఒక పెద్ద దెబ్బే. అందుకే కొన్ని సార్లు ఎందుక్చిన్న గొడవ ఇక్కడే ప్రవాసం లొ ఉండి ఫ్రీ విద్య ని పిల్లలకి ఇవ్వకూడదు అనిపిస్తుంది.

ఇంకో మాట, మా తమ్ముడు మా ఊరిలొ స్కూల్ పెట్టాడు కానీ ఇంత ఫీజు కాదు. ఇంకా పెట్టిన డబ్బుల కొసమే చూస్తున్నాడు, నేను కూడా స్కూల్ టాపర్ కి చేతనైన సహాయం చేస్తానని చెప్ప.

శ్రీ said...

అబ్బా.. 105 కామెంట్లు! అద్భుతం సుజాత గారు!

krishna said...

ayya baaboy
just 10 ella krindata nenun engg kudaa scholorshiptone chadivaa.
appude anta retlu perigipoyaayaa?ippudu memu indiaku vaste daaridryarekhaku diguvana vuntaamemo????????????

ramya said...

108:)
ఇంకో కోణం కూడ ఉంది ఇక్కడ, కార్పోరేట్ స్కూల్స్ ని,కాన్సెప్ట్ స్కూల్స్ నీ ఆదరిస్తున్న వాళ్ళకి స్టేటస్ తగిన స్కూల్ కావాలి, దాన్ని కొందరు అందిస్తున్నారు. అలా అందించడానికి వాళ్ళు చాలా ఖర్చు చేస్తున్నారు స్కూల్ బిల్డింగ్ అద్దె నెలకి పది లక్షలకి పైగా కట్టే స్కూల్సు ఉన్నాయి, ఏసీబస్సులూ ఇతర హంగులూ సరే సరి.., కార్పోరేట్ & కాన్సెప్ట్ స్కూళ్ళ లో టీచర్ కి 15000 నుండి 30 000 వేల దాకా నెల జీతం ఇవ్వాల్సి ఉంటుంది. పేరెంట్స్ కి కావలిసిన స్టేటస్ & రాంక్యులూ రెండూ బానే అందజేస్తున్నాయి కొన్ని ఇలాంటి స్కూల్స్.
తప్పెవరిదీ అంటే ఏం చెప్పగలం! ఒకే చోట పది స్కూళ్ళు ఉన్నా, అక్కడే మరో ప్రభుత్వ పాఠశాల ఉన్నా అక్కడే మరొక స్కూల్ కోసం ప్రయత్నిస్తే ఇట్టే పర్మీషన్‌ లభిస్తోంది!
పర్మీషన్ ఇచ్చేముందు గ్రౌండ్, లైబ్రెరీ, లాబ్, టాయ్లెట్స్,టీచర్స్,ఫర్నీచర్, లొకాలిటీ, ఇలా ఎన్నో చెక్ చేయాల్సిన వాళ్ళు మరి ఇట్టే పర్మీషన్స్ ఎలా ఇస్తున్నారు?
గౌర్నమెంట్ స్కూల్స్ ని కాదని చిన్న చిన్న వీది ఇంగ్లీష్ మీడియం స్కూల్లలో చేర్చే వాళ్ళు పరుగు పందెం లో తాము వెనక పడిపోతామేమో నన్న అపోహ తోనే గానీ డబ్బెక్కువై కాదు.ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ పాఠాలు మొదలెడితే చాలా మంది అటే వెళుతారు, లేదా వాళ్ళ అపోహలన్నా తొలిగే మార్గం ఉండాలి.
సుజాత గారు
ఈ అంశానికి హద్దు లేనట్టుంది, చర్చ కొనసాగుతూనే ఉంటుంది, మళ్ళీ 200 కామెంట్ నాదే:)

satya said...

సుజాత గారితో పాటు ఇక్కడ వున్న భాధితులందరికీ నాదొక సలహా! అసలు ఇంతింత ఖర్చు పెట్టి చదువులు చెప్పించేది డిగ్రీ ల కోసమేగా.. ఇందులో 10% పెడితే ఆ డిగ్రీ సర్టిఫికెటే కొనుక్కోవచ్చు..

ఒక ఐడియా! జీవితాన్నే మర్చేస్తుంది ;)

spiritualindia said...

After reading your post, I feel like US schools may be cheaper today than schools in India. God, please save andhra generation.

Vinay Chakravarthi.Gogineni said...

meeru em decide chesaru andi...meeru chala baga discuss chesaru......intaki meeru govt schollo cherpinchara....leka as it is aaaa..meeru as it is chesinatlayithe inkendukandi.......ee charcha...manam marakunda andarini...critisise cheyatam.......

సుజాత వేల్పూరి said...

గోగినేని వినయ్ చక్రవర్తి గారు,
నేను ఆ స్కూళ్ళలో చేర్పించలేదు. ప్రస్తుతం ఏ స్కూల్లో చదువుతోందో అక్కడే కంటిన్యూ అవుతోంది మా అమ్మాయి. అది స్కేటింగ్,స్విమ్మింగ్ వంటి ఆర్భాటాలు లేకుండా వేదిక విద్య నేపధ్యంలో విద్యను అందించే స్కూలు. నాకు నచ్చింది.

మరి మీరు వేరే స్కూళ్లలో అడ్మిషన్ కోసం ఎందుకు వెళ్లారు అనే ప్రశ్న మీరు వెయ్యొచ్చు. స్కూలు ఇంటికి 4,5 కిలోమీటర్ల దూరంలోనే ఉండాలని నేను భావిస్తాను. మేము కొన్న కొత్త ఇల్లుకు ఇప్పుడు చదువుతున్న స్కూలు 15 కిలోమీటర్ల దూరం. ఈ లెక్కన ఎనిమిదిన్నరకు మొదలయ్యే స్కూలు చేరాలంటే మా పాప 6-30 కి బస్సు ఎక్కాలి.అది ఎట్టిపరిస్థితుల్లో నేను అంగీకరించను.

మీరొక విషయం గ్రహించాలిక్కడ! నేను ఎవరినీ క్రిటిసైజ్ చేయలేదు. స్కూళ్ళలో ఉన్న పరిస్థితుల గురించి నేను చూసిన దాన్ని వివరించాను అంతే!

ప్రభుత్వ స్కూళ్ళలో విద్యా ప్రమాణాలు ఎలా పడిపోయాయో ఒక్కసారి వెళ్ళి చూడండి. అక్కడ విద్యాప్రమాణాలు బాగుంటే ప్రైవేటు స్కూళ్ళు ఇంతగా బలిసేవి కాదు. ఈ టపాలో నా పాయింట్ కూడా అదే!

Vinay Chakravarthi.Gogineni said...

ohhh...ok....cool.....nice andi....keep it up madam...........
by the way i forgot one thing ...me narration chala baguntundandi........

Unknown said...

mee blog lo comments chese vaaru andharu chi chi chadhuvu ila aipoyindhi,maa pillalni ee schools lo cherpinchamu antunnaru.veellani oka sample for survey ga teesukunte,andhari opinion inthe vunte mari aa schools lo join chesthunna vallu evaru??? ante mee blog lo comments chesthunna vallantha like minded aa lekapothe evariki vaaru vaari dhaggariki vachetappatiki idhi manaki thappadhu le ani adjust aipothunnara??

Vinay Chakravarthi.Gogineni said...

preme.....pakkavaallaki cheppataanike babu neetulu........chedipotodi ane gani baagu cheddam ani evariki ledu............ala moota padataniki andaru karaname....meeku hyd lo manchi govt school dorakaleda how pity nijam ga chepppandi meeru asalu try chesaara.........

Unknown said...

vinay naaku inka pelli chesukone vayasu kooda raaledhu.so nenu evarni endhulo join chedham anukovatle.nenu just naa observation cheppa.ikkada choosthe andharu i hate those schools antunnaru akkademo aa schools roaring business chesthunnayi.ila jaragadaniki reason enti ani naa alochana anthe. anthe gani ee problems ki reason enti,dheenni ela solve cheyyali ani nenu alochinchatle.

Vinay Chakravarthi.Gogineni said...

hey preme

nenu ninnu analedu......
andaru ammo antunnaru gaani pattinchukovatamledani na opinion......nenu 10th varaku govt schools lone chadivaanu.

ikkada okaatanu 23,000 ayyindi annaru tana nalugu ella chaduvuki ......appati roopayi value ki adi ekkuve kada.........

AB said...

Great Post Sujatha Gaaru

Mauli said...

@spoken english అంత బాగా ఉండదు

idi pedda problem kaadu kadandee..ippudu english baga telsina vallentha mandi school lo english matladaru?

సుజాత వేల్పూరి said...

@ మౌళి గారు,
స్పోకెన్ ఇంగ్లీష్ బావుండదు అంటే ...ఏదో మాట్లాడటమే కానీ వ్యాకరణ దోషాలు లేకుండా టీచర్లే మాట్లాడలేకపోతే ఇక అసలు ఇంగ్లీషెందుకు మాట్లాడ్డం? ఏ భాష అయినా తప్పుల్లేకుండా మాట్లాడాలని నేననుకుంటాను. "మా ఫ్రెండ్ ఇవాళ కేక్ బ్రింగ్ చేసింది"అని మా అమ్మాయి అంటే నాకు ఒళ్ళు మండిపోతుంది ఆ టీచర్ల మీద! అంతకంటే శుభ్రంగా తెలుగు మాట్లాడొచ్చుగా!

కాకపోతే ఒక పెద్ద వాక్యాన్నో, విషయాన్నో ఇంగ్లీష్ లో చెప్పలేకపోతే "పర్లేదు, తెలుగులో చెప్పు"అని టీచర్లు పిల్లల్ని నిరాశపరచకుండా మాట్లాడ్డం ఈ స్కూల్లో చూశాను నేను! అంత వరకూ సంతోషించాల్సిందే!

గీతాచార్య said...

Hahaha. Spoken english is just a cool joke.

Anonymous said...

మనకి, మన వారసులకీ ఈ బాధల నుంచి శాశ్వత విముక్తి కలగాలంటే ముఖ్యంగా మూడు చర్యలు తీసుకునే దమ్మున్న నాయకుడు రావాలి.

1. ప్రీ-స్కూలింగ్ ని, నర్సరీలనీ నిషేధించాలి. అందఱూ అయిదేళ్ళొచ్చాకనే బళ్ళో చేఱాలని నిబంధన విధించాలి.

2. దొరతనంవారి బళ్ళన్నింటినీ తెలుగుమాధ్యమంలోనే ఉంచేయాలి.

3. ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి దాకా విద్యావ్యవస్థ మొత్తాన్నీ జాతీయం చేయాలి. ప్రైవేట్ సంస్థలన్నింటినీ నిషేధించాలి.

4. ఇది చివఱిదైనా అత్యంత ముఖ్యమైన చర్య. నా అభిప్రాయంలో - ఇదొక్క చర్యా చాలు యావత్తు విద్యావ్యవస్థనీ సగం దాకా బాగు చేసిపారేయడానికి ! ఇది చెయ్యకుండా పై చర్యల్లాంటివి సత్ఫలితాలివ్వజాలవు. సైన్యంలాగానే విద్యావ్యవస్థని కుదా రిజర్వేషన్ల ధృతరాష్ట కౌగిట్లోంచి బయట వేయాలి (మినహాయించాలి).

Post a Comment