February 3, 2010

"మనిషి" ఇంకా చావలేదు.

మూడు రోజుల వ్యవధిలో ఒక పచ్చని కుటుంబం మనమంతా నిర్ఘాంతపోయి చూస్తుండగానే కుప్పకూలిపోయింది.దుఃఖ తీరాన దీనంగా నిలిచింది.




వైష్ణవి ని చంపిన తీరు, ఆమె తండ్రి మరణం ఇవన్నీ మనల్ని అందర్నీ కదిలించి వేశాయి. కన్నీళ్ళు పెట్టేలా చేశాయి.హంతకుల్ని ఉరితీయాలని కొందరు, నరికి ముక్కలు చేయాలని కొందరు, చెప్పుతో కొట్టి ఊరంతా తిప్పాలని కొందరు, పెట్రోలు పోసి తగలెట్టాలని కొందరు, పాపను వేసిన బాయిలర్లోనే వేసి కాల్చాలని కొందరు ... టీవీల్లో కూడా సామాన్య ప్రజలు ఆవేశం, ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. "అవును, వాళ్లనలాగే శిక్షించాలి" అని నాకూ అనిపించింది.



ఇక మీడియా ఛానెళ్ళ సంగతి చెప్పక్కర్లేదు. "చేతులు ముడుచుక్కూచున్న మా ఖాకీల్ని క్షమించమ్మా" అని కవిత్వం ఏడుపు గొంతులు పెట్టి మరీ  ఒలకపోశారు. అసలు ప్రతి నేరంలోనూ పోలీసులకంటే ముందే అత్యుత్సాహంతో సగం దర్యాప్తు వీళ్ళే చేసేస్తారుగా!మరి ఈ కేసులో ఏం చేస్తున్నారో!



సమాజం ఇంతగా కుళ్ళిపోవడానికి కారణం ఎవరు?

ఈ రాక్షస సమాజంలో, ఈ జాలి లేని లోకంలో, ఈ ప్రేమ లేని ప్రపంచంలో, ఈ నీతి రహిత సమాజంలో...ఇదీ వరస!

ఈ నేరాలు ఇలా జరగడానికి కారణమెవరు?అని ప్రశ్నలు..పాపం వాళ్ళకేం తెలీనట్లు!వాళ్లకేం భాగం లేనట్లు!



మానవత్వం మంటకలిసింది. సమాజం కుళ్లిపోయింది. రాక్షసంగా మారిపోయింది.మానవ సంబంధాలకు విలువ లేదు.సాటి మనిషనే కన్ సర్న్ లేదు.ఎవరి నోట చూసినా ఇవే మాటలు. బ్లాగుల్లో కూడా ఆవేదన ఇదే స్థాయిలో ఉంది.ఎవర్నీ తప్పుపట్టడం లేదు.ఎందుకంటే నిన్న సాయంత్రం వరకూ నా ఆలోచన్లూ ఇదే బాటలో ఉన్నాయి.


తర్వాత ఆలోచిస్తుంటే కొత్త బాటలో ఆలోచనలు పరిగెట్టాయి.

పసి పాప అన్న జాలి, విచక్షణ లేకుండా చంపిన దుర్మార్గులు నివసిస్తున్న సమాజంలోనే మనమూ ఉన్నాం!


మనం..అంటే..?



పాపతో గానీ, ఆమె తండ్రితో గానీ, ఎటువంటి పరిచయమూలేని పరాయివాళ్ళం!

పాప గుప్పెడు బూడిదగా మారిందని తెలిసి కన్నీరు వర్షించిన వాళ్ళం!

పాప తండ్రి కూడా మరణించాడని తెలిసి భోరున విలపించిన వాళ్లం!


అంత్యక్రియలు చూస్తూ "ఈ బంధాలింతేనా"అని వైరాగ్యానికి గురైన వాళ్లం

అవి ముగిశాక "ఇప్పుడు ఆ తల్లి పరిస్థితి ఏమిటి? బంధువులు బతకనిస్తారా?"అని ఆలోచనలో పడ్డవాళ్లం!


ఆడపిల్లలమీద యాసిడ్ దాడి జరిగితే మన చెల్లికో,కూతురుకో జరిగినంతగా తల్లడిల్లినవాళ్లం!

ఎవరం మనమంతా?
సాటి మనుషులం!


రోడ్డుమీద ఎవరినా బైక్ మీదనుంచి కిందపడితే "అరె!"అని పదిమంది పరిగెడతాం లేపడానికి!

ఈ మధ్య 108 పుణ్యమా అని యాక్సిడెంట్ అయినా వెంటనే పౌరులు స్పందిస్తున్నారు.

అర్జెంట్ గా ఒక పేషంట్ కి ఫలానా గ్రూపు రక్తం కావాలంటే పరిగెత్తుకొచ్చేవారున్నారు.

చికిత్స కోసం డబ్బు లేని పేద రోగుల వివరాలు పేపర్లో చూసి డబ్బు ఇచ్చేవారెంతోమంది.

అనాధ పిల్లలకోసం సహాయం చేసేవారు కొందరైతే ఆ పిల్లల కోసం సమయాన్ని,డబ్బును కూడా వెచ్చించేవారెంతోమంది.(వీరికి ఉదాహరణలు మన బ్లాగర్లలోనే ఉన్నారు.).


ఇటువంటి ఘోరానికి పాల్పడ్డ నేరస్థులు ఎంతోమంది దయార్దృ హృదయులు నివసిస్తున్న ఈ సమాజంలో ఒక చిన్న భాగం! వాళ్ళు కేవలం కాన్సర్ సోకి కుళ్ళిపోయిన ఒక చిన్న భాగం!

ఆ భాగాన్ని మందులతో బాగన్నా చేసుకోవాలి.లేదా నిర్దాక్షిణ్యంగా కత్తిరించి(Amputation)అవతలన్నా పారేయాలి.అది మనచేతుల్లోనే ఉంది.



జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైనదే! కారణాలనేకం కావొచ్చు!


 ఉమ్మడికుటుంబవ్యవస్థ చిన్నాభిన్నం కావడం వల్ల "నాది"అనే స్వార్థం పెరిగిపోవడం, ఇదివరలో విలాసాలుగా ఉన్నవి ఇప్పుడు అవసరాలుగా మారడం,డబ్బు చుట్టూ జీవితాలు గిరికీలు కొట్టడం!

ప్రభాకర్ స్వయంకృతాపరాధం కూడా కొంత కారణం కావొచ్చు.ఇప్పుడు ఆ విషయాన్ని చర్చించలేం!

ఏమైనా,మమతానుబంధాలతో పెనవేసుకున్న రెండు జీవితాలు నిర్దాక్షిణ్యంగా చిదిమివేయబడ్డాయి! ప్రాంతాలతో సంబంధం లేకుండా రాష్ట్రమంతా  కన్నీటితో తడిసి ముద్దయిపోయింది. కన్నీరు మున్నీరైపోయింది.



అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవాళ్ళు,డబ్బుకోసం ఎంత నీచాకైనా దిగేవారు మామూలు జనంతో పోల్చుకుంటే సమాజంలో చాలా స్వల్ప భాగం!(కానీ ఈ స్వల్ప భాగమంటేనే మనకు భయం)



వీళ్లున్నంత మాత్రాన "రాక్షస సమాజం" "కుళ్లిన సమాజం"  "మానవతలేని సమాజం"  "పనికిమాలిన సమాజం" "మృగాళ్లసమాజం" (కొంతమంది అయితే టీవీల్లో దీన్ని మహిళలపై జరిగిన దాడిగా అభివర్ణిస్తూ నేరస్థులకంటే నీచంగా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు).

వాళ్ల కౄరత్వాన్ని సమాజం మొత్తానికీ ఆపాదించడం ఏ పాటి న్యాయం?



సాటి మనిషి కష్టానికి స్పందించే మనసులు,మనుషులు సమాజంలో ఉన్నంతకాలం ఈ సమాజం రాక్షస సమాజం కాదు.

ఒక తల్లి కన్నీరు తుడవడానికి, ఆమెతోపాటు కన్నీరు పెట్టుకోడానికి ఇన్ని కోట్లమంది ఉన్నపుడు ఈ సమాజం కుళ్లిందని ఎలా అనుకుంటాం!

కష్టంలో ఉన్న మనిషికి ఆసరాగా మనచేయి సాచగలిగినంత కాలం ఈ సమాజం ప్రేమరహితమైంది కాదు.

మనిషి గుండెలో తడి ఉన్నంత కాలం ఈ సమాజం పనికి మాలింది కానే కాదు!

ఎదుటి మనిషి బాధకు మన కంటిలో నీటి చుక్క ఊరినంత కాలం ఈ సమాజం కుళ్ళిపోకుండానే ఉన్నట్లు!


సమాజమంటే మనం! నేరస్థులు కాదు!

ఆ నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఒక డైలాగ్ చెప్తాడు."మనిషిని నమ్మాలయ్యా!"అని!
చివర్లో కూడా అంటాడు "ఈ సమాజాన్ని నడిపించేది ప్రేమే అని నాకు తెలుసు, నేనే గెలిచాను"అని!


అవును, ఒక కుటుంబాన్నైనా, మనుషుల మధ్య స్నేహ సంబంధాలనైనా , ఒక సమాజంలో మనుషుల మధ్య బంధాలనైనా నడిపించేదీ, నిలబెట్టేదీ నమ్మకం, ప్రేమలే!

అవి మానవజాతిలో మిగిలి ఉన్నంత కాలం "మనిషి"కి మరణం లేదు

"మనిషి" ఇంకా చావలేదు.


చిన్నారి వైష్ణవి,ఆమె తండ్రి ప్రభాకర్,వారి డ్రైవర్ లక్ష్మణరావుల ఆత్మలకు శాంతి లభించాలని కోరుకుంటున్నాను.

30 comments:

Sujata M said...

You are right. I immediately sensed something else abt this post.

Out of Context Comment :

అబ్సర్డ్ అబ్సర్వేషన్ : ఒక మహిళ హోం మంత్రి గా ఉన్నప్పుడు - మహిళ ల పైన అత్యాచారాలు (నేరాలు) జరగడం ఏంటని ? - అంటే ? ఒక పురుషుడు హోం మంత్రి గా ఉన్నప్పుడు పురుషుల మీద అత్యాచారాలు జరగలేదనా / జరగవనా మీడియా/ప్రజల ఉద్దేశ్యం ? సిల్లీ పాయింట్. నేరాల రేట్ గురించి పొలీస్ కదా స్టాటస్టిక్స్ ఇవ్వాల్సింది. జనం పేరుతో NEWS చానల్స్ జడ్జ్ చెయ్యడానికి ప్రయత్నించడం నిజంగా అబ్సర్డ్.

భావన said...

చాలా బాగా చెప్పేవు సుజాత. సమాజం లో అలాను వున్నారు ఇలాను వున్నారు. సమాజమంటే మనమే అని గుర్తు చేసేరు. కాని ఇంత వేడి తరువాత వుండదు.. అంతా చల్లబడ్డాకా ఆ దుర్మార్గులు మన మధ్యనే బయటకు వచ్చి ఏమి జరగనట్లు తిరుగుతూ వుంటారు, మనం కూడా అంతా మర్చి పోయి మాములు గా పలకరిస్తాము. కాని నష్టం జరగకుండా ఇంకా కొన్ని ప్రెవెంటివ్ యాక్షన్స్ తీసుకుంటే బాగు. చెప్పటం ఈజీ నేమో లే.. ఏమో. వింటుంటే మాత్రం పాపం అనిపిస్తుంది. ఆ ముగ్గురి ఆత్మలకు శాంతి కలుగాలని ప్రార్ధిద్దాము.

Bhardwaj Velamakanni said...

Well said,

Actually, it's the driver who got killed for no reason at all!

శ్రీనివాస్ said...

చాలామంది మదిలో మెదిలే భావాలు దాదాపు ఇలాగె ఉంటాయి కానీ అక్షరరూపం చక్కగా ఇచ్చారు . ధన్యవాదాలు.



నిజమే మీరన్నా ఆ చిన్న భాగం మీద సరిగా ఫోకస్ చేస్తే సమాజం ఎప్పుడో బాగు పడును. ఈ చిన్ని భాగం అంటేనే మనకి భయం కాన్సర్ వచ్చి కాలు చెడిపోతే మన కాలే కదా అని ఉంచుకోము తీసేస్తాం అని ఒక సినిమా డైలాగ్ ఉంది. అలాగే కొన్ని విషయాలలో కటినంగా వ్యవహరించకపోతే కష్టం.

కాలం చెల్లిన తాతల కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ మార్చాలి . నిజం తెలిసీ నిందితుని తరపున వాదించే లాయర్లకు కూడా శిక్ష పడేలా చట్టాల్లో మార్పు వస్తే బాగుండును.

మెడిసిన్ చదివితే డాక్టర్ ...... సివిల్స్ రాస్తే కలెక్టర్ ...... ఇలా ప్రతి దానికి ఒక చదువు ఉన్నట్టే రాజకీయాలకు కూడా తప్పని సరిగా ఇక అర్హత అనేది కావాలని రూల్ పెడితే కొంచెం కాకపోతే కొంచెం అన్నా మానవత్వం ఉన్న మనుషులు ఎన్నిక అయ్యే అవకాశం ఉంటుంది.

అలాగే 18 ఏళ్లకు వోటు హక్కు ఇచ్చేదానికంటే కనీస విద్యార్హత ఉన్న వారికే వోటు హక్కు అన్న నిబంధన అమల్లోకి తెస్తే వోటు అనే పదానికి నిజమైన అర్ధం వస్తుంది అని నా భావన .

ఇంకా చాలా ఉన్నాయి కానీ ప్రస్తుతానికి ఇంతే.

పరిమళం said...

సుజాతగారు , మీరు హైలెట్ చేసిన వాక్యాలు అక్షర సత్యాలు !మానవత్వం ఇంకా చావలేదు అది చచ్చిన మరుక్షణం మనిషి చచ్చినట్టే !మీ టైటిల్ సరిగ్గా అమరింది .చనిపోయిన ముగ్గురికి ఆత్మశాంతి కలగాలని ప్రార్దిస్తున్నా !

శేఖర్ పెద్దగోపు said...

బాగా చెప్పారు...
అయితే కొన్నిసార్లు నమ్మకం, ప్రేమ మధ్యలో డబ్బు అనేది ఒకటి చేరినప్పుడు, మనం మనిషిగా గుర్తించిన వారిలో కొద్దిమందికి నమ్మకం, ప్రేమ అనేవి చిన్నాభిన్నం అవుతున్నాయి...అలాంటి సంధర్భంలోనే మనిషి తన సహజ సిద్దమైన ఉనికిని కోల్పోయి మృగంగా మారుతున్నాడు.

మధురవాణి said...

సుజాత గారూ,
చాలా బాగా చెప్పారు. తండ్రీ, కూతురూ ఇంత దారుణంగా చనిపోవడం, ఆ కుటుంబం ఉన్నపాటుగా కుప్పకూలిపోవడం మనసుని కలచివేస్తోంది. వాళ్ళ కుటుంబ పరమైన సమస్యలకి గానీ, ఆర్ధిక వ్యవహారాలకి గానీ ఏ విధమైన సంబంధమూ లేకుండా కేవలం పొట్టకూటి కోసం పని చేసే ఆ డ్రైవర్ హత్య కూడా బాధాకరం. పాపం..వాళ్ళ కుటుంబం కూడా దిక్కులేనిదయిపోయి ఉంటుంది. కానీ, నేను చూసినంతలో అతని గురించి ఏ పత్రికలోనూ కనీసం సానుభూతి అయినా చూపించినట్టు కనిపించలేదు. అతని ఆత్మకి శాంతి కలగాలని మీరు రాయడం అభినందించదగ్గ విషయం. నేను కూడా ఆ ముగ్గురి ఆత్మలకూ శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను.
మీరు చెప్పిన కోణాలు తప్పక ఆలోచించదగ్గవి. మీరన్నట్టు 'మనిషి' ఇంకా ఉండబట్టే.. ఈ ప్రపంచంలో ఇంకా మనగలుగుతున్నాం. మనం మనుషులమని తలుస్తున్నాం అనుకుంటాను.

శ్రీనివాస్ పప్పు said...

"ఇటువంటి ఘోరానికి పాల్పడ్డ నేరస్థులు ఎంతోమంది దయార్దృ హృదయులు నివసిస్తున్న ఈ సమాజంలో ఒక చిన్న భాగం! వాళ్ళు కేవలం కాన్సర్ సోకి కుళ్ళిపోయిన ఒక చిన్న భాగం!

ఆ భాగాన్ని మందులతో బాగన్నా చేసుకోవాలి.లేదా నిర్దాక్షిణ్యంగా కత్తిరించి(Amputation)అవతలన్నా పారేయాలి.అది మనచేతుల్లోనే ఉంది".

నిజమే కానీ అటువంటి కార్యాచరణ ఏదయినా ఉందా?ఏదో ఒకటి ఎక్కడో అక్కడ మొదలవ్వాలి అదిక్కడనించే మొదలెడితే?నేను సైతం...

వేణు said...

ఇలాంటి ఘాతుకాలకు వెల్లువెత్తే ప్రజా స్పందన చూసినప్పుడు ఎంతో ఊరట కలుగుతుంది. మీడియా భాష్యాలెలా ఉన్నా, ఈ దుర్ఘటనపై ఇంత స్పందన రావటానికి పత్రికలూ, టీవీలూ కూడా కారణమేనని చెప్పాలి.

నిజమే, మీరన్నట్టు నేరస్థుల క్రూరత్వాన్ని సమాజం మొత్తానికీ ఆపాదించడం న్యాయం కాదు.

కానీ, నేరప్రవృత్తి పెరగటానికి చాలా అనుకూలమైన వ్యవస్థలో మనం జీవిస్తున్నాం!

Anil Dasari said...

ఆ వార్త చదివి నేనేమీ విభ్రాంతికో, దిగ్భ్రాంతికో గురి కాలేదు. ఓ ఇరవయ్యేళ్ల క్రితమైతే అయ్యేవాడినేమో. ఇప్పుడైతే కాలేదు. ఇలాంటిది ఇదే మొదటిసారి కాదు, ఇదే చివరిసారీ కాదన్న భావన తెచ్చిన నిర్లిప్తతేమో. సినిమాల్లో, టీవీల్లో, పేపర్లలో ప్రతిరోజూ ఎటు చూసినా అవే నరుకుళ్లు, బాంబులు, హత్యలు, రక్తం మరకలు .. ఎన్నాళ్లని దిగ్భ్రాంతితో స్పందిస్తాం?

నాలాంటోళ్లెందరో ఉండుంటారు.

భూమిపుత్రుడు said...

మీరన్నది నిజమే. ఇందులో మరణించిన ప్రభాకర్ కు కూడా వాటా వుంది. మొదటి భార్య వుంటుండగానే మరల వివాహం చేసుకోవడం సరైనది కాదు. చేసిన మద్యం వ్యాపారం ద్వారా అడ్డదిడ్డంగా సంపాదించిన సొమ్ముతో వచ్చిన దాంతో ఇలా చేసివుంటాడు. ఆస్తిని కాపాడుకునే ప్రయత్నంలో రాజకీయ చెలిమికూడా బాగానే చేసాడు. ఇవన్నీ వారి కుటుంబాలమద్య పగను రగిలించి చివరికి వారసురాలైన వీటికి సంబంధంలేని అమాయకపు కూతురు నాగవైష్ణవి హత్యకు గురైన విధం అందరినీ కలచివేసింది. తట్టుకోలేని ప్రభాకర్ అకాలమరణం మరింత బాధపెట్టింది. లైవ్ మీడియావలన, శవరాజకీయాల నాయకమ్మన్యుల వలవ ఇది రాష్ట్ర బాధగా మారింది. ఇదే ఒక రిక్షావాడింటిలో జరిగితే ఒక చిన్న క్రైం వార్తగా జిల్లాకే పరిమితమయ్యేది. ఇలా మన వర్గస్వభావం కూడా బయటపడేది కాదు. ఏమైనా ఓ ముగ్గురి ప్రాణాలు పోవడం బాధాకరం. ఇకనైనా ఇద్దరు హీరోయిన్ల సినిమాలు, ..బాబుల సినిమాలులో రెండో భార్య అంగీకారాలు మానితే కొతైనా బాగుంటుంది.

కొండముది సాయికిరణ్ కుమార్ said...

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవాళ్ళు,డబ్బుకోసం ఎంత నీచాకైనా దిగేవారు మామూలు జనంతో పోల్చుకుంటే సమాజంలో చాలా స్వల్ప భాగం!(కానీ ఈ స్వల్ప భాగమంటేనే మనకు భయం)
===
మన ప్రజాస్వామిక సమాజాన్ని పటిష్టం చేయాల్సిన ప్రతి వ్యవస్థ కుళ్ళిపోయింది అనేది నిజం. ఒక అఫ్జల్ గురు, ఒక రుచిక, ఒక వైష్ణవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. మీడియా వెలికితీయని ఇటువంటి సంఘటనలు అనేకం.

అఫ్జల్ గురుకు కోర్టు ఉరి శిక్ష విధించినా అమలు చేయలేకపోతున్న వ్యవస్థ మనది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఉన్నతస్థానంలో ఉన్న ఓ అధికారిని నేరస్థుడుగా నిర్ధారించి, వాడు ఓ అమాయక బాలికపై అత్యాచారం చేసి, ఆ బాలిక ఆత్మహత్యకు కారణమైనా వాడికి లభించిన శిక్ష ఆరు నెలలు జైలు, ఓ పదివేల రూపాయల జరిమానా! పంథొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా, ఆ శిక్షపై అప్పీల్ చేసుకునే హక్కు వాడికి ఇచ్చిన వ్యవస్థ మనది. ఇక వైష్ణవి కేసులో మాత్రం సత్వర న్యాయం సంగతి తర్వాత, కనీస న్యాయం జరుగుతుందని కూడా ఆశించలేని ప్రజాస్వామ్యం మనది.

ముంబాయి వీటీ స్టేషనులో, కసబ్ కాల్పులు జరుపుతున్నప్పుడు, వాడి తుపాకీ గుళ్ళకు బలౌతున్న తన తల్లిని చూసి పెద్దగా ఏడ్చిన ఓ ఆరేళ్ళ పాపపై, నవ్వుతూ తీరిగ్గా కాల్పులు జరిపిన వాడికి రాచమర్యాదలు కల్పిస్తూ విచారణ చేస్తున్న దౌర్భాగ్య ప్రజాస్వామ్యం మనది.

యథా రాజ తథా ప్రజ. కుళ్ళిపోయిన పరిపాలనా వ్యవస్థలో, సమాజంలోని సింహభాగం ఇంకా కుళ్ళలేదని ఆనందించటానికి ఆస్కారం ఎక్కడుంది? భౌతికంగా మనం చావలేదేమో కానీ, మనుషులుగా మనం ఏనాడో చచ్చిపోయాం. అందుకే, అబ్రకదబ్ర గారు చెప్పినట్లు ఇటువంటి సంఘటనలకు మనం దిగ్భ్రాంతి చెందటం ఎప్పుడో మానేసాం.

Ravi said...

నాక్కూడా ఇలాంటి విషయాలు జరిగినపుడు మనం అతిగా స్పందిస్తున్నామా అనిపిస్తుంది. సాధారణంగా ప్రజలు తనదాకా వస్తేగానీ ఇలాంటి సంఘటనలు సీరియస్ గా తీసుకోరు. ఇక్కడ జరిగిన దాంట్లో పాప తండ్రి తప్పు కొద్ది మేరకు ఉన్నా అన్నెం పున్నెం ఎరుగని పసిపాపను పొట్టన పెట్టుకున్నందుకే ప్రజల నుంచి ఇంత స్పందన. మీరన్నట్లు ఈ స్పందన కొద్ది కాలం పాటే ఉంటుంది.

Kathi Mahesh Kumar said...

గ్లోబలైజేషన్ క్రమంలో మానవ-ఆర్థిక సంబంధాల అసహనాలు నివురుగప్పిన నిప్పులా మండుతున్న పరిణామానికి ఇదొక ఉదాహరణ.

డబ్బు-అధికారం మానవసంబంధాల్ని శాసిస్తున్న ఈ కాలంలో desperation ఖచ్చితంగా హింసకు దారితీస్తుంది. ఇదొక ఘటన మాత్రమే.బహుశా ఒక ప్రారంభం మాత్రమే.

‘ఈ విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా మన వ్యవస్థలు మారటం లేదు’ అనేది ఒక కటిక నిజం. ఇంత వేగంగా మార్పులొస్తాయని బహుశా ఎవరూ అంచనావెయ్యలేదుకూడా. ముఖ్యంగా రాజకీయ-నేరపరిశోధన-పోలీస్-న్యాయవ్యవస్థ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మారలేదు. మారడానికి మరింత కాలం పడుతుంది. అంతమాత్రానా నిరాశ చెందడం సమస్యకు సమాధానం కాదు.Quick fix కోసం షరియా లాంటి eye for an eye వ్యవస్థ దానికి జవాబు అసలు కాదు.

ఈ ఘటనలు మానవత్వానికి మచ్చతెచ్చేవే అయినా మొత్తం మానవజాతి లేదా మన సమాజం ఇలా మారిపోయిందనే వాదన సహేతుకం కాదు. కానీ,పరిస్థితులు ఇలాగే ఉంటే హింస సహజమౌతుందనే భయం మన సమాజానికి ఖచ్చితంగా కావాలి. అప్పుడే మార్పు త్వరగా వస్తుంది.

ఈ మొత్తం ఘటనలో పెద్ద culprit మీడియా అనిపిస్తుంది. They absolutely don't know how to handle such situations.They jump their guns too soon and irrationally to emotionalize for TRPs. మీడియాకు ఈ విషయంలో కొన్ని మార్గదర్శకాలు ఉండటం చాలా అవసరం. అవి మీడియానే ఏర్పరుచుకుంటే అది ముదావహం.

Anonymous said...

సుజాత గారు, నలుగురితో పాటూ నారాయణ అన్నట్టు కాకుండా ఈ విషాదంలోని మరో కోణాన్ని చూపారు.
ఆస్తికోసం హత్యలు జరగడం ఇది మొదలూకాదు బహుశా చివరా కాదు. భారతమంతా ఆస్తికోసం ( రాజ్యం, అధికారం) జరిగిన కుమ్ములాటేకదా . రామాయణం లో తనకొడుక్కి అన్యాయం జరుగుందేమో అన్న అక్కసుతోనేకదా కైక వరాలుకోరింది. దశరధుడు ఒప్పుకోకపోయుంటే కైక అంతటితో వూరుకునేదా ? లేక తన అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేసేదా?
కేవలం పిల్లలు కలగలేదనే కారణం తో రెండవ పెళ్ళి చేసుకోవటం దుర్మార్గం కాదా ? ఈ సంఘటనలో తప్పుకు బీజం అప్పుడేపడింది .
తరువాత జరిగిన సంఘటనలన్నీ దాని పర్వ్యవసానంగా జరిగినవే . మీ భయమే నాకూ కలిగింది. మిగతా కుటుంబానికి రక్షణ లభిస్తుందా .
అడ్డగోలుగా కోట్లు కూడబెట్టి సిటికో ఇలాకాని మెయింటెయిన్ చేసే బడా బాబుల కి ఈ సంఘటన కాస్తయినా దడ పుట్టించి వుంటుందని అనుకుంటున్నాను . ఎవరికైనా లేపెయ్యాలనే ఆలోచన రావాలికానీ ఆ పని ఫోన్ లో పిజ్జా ఆర్డరిచినంత సులభంగా చేసుకునే వీలుందని అందరికీ తెలుసు
చిన్నారి వైష్ణవి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.

Vasuki said...

మీ అందరి అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. ఇలాంటి నేరాలు జరిగినప్పుడు చట్టం తన పని తను చేసుకుపోతుంది వంటి ఊకదంపుడు డైలాగ్లు మనం వింటూనే వుంటాము. ఆ కుటుంబ తగదాల వలనే ఈ హత్యలు జరిగినప్పటికి అవి జరిగిన తీరు కలిచివేస్తున్నాయి. ఒక చిన్న పపని అంత క్రూరంగా ఎలా చంప బుద్దేసిందో. డ్రైవర్ కుటుంబం కూడా అనాధ అయ్యింది. మొన్న బోరు బావిలో పిల్లాడు పడి చనిపోతేనే ఎంతో బాధ కలిగింది. ఇది ఇంకా బాధ పెట్టింది. నేరం చేసిన వాడికి జైల్లో మహారాజ పోషణ జరగడం తప్ప న్యాయమేమి జరగదు. కసబ్ ని చూస్తే అర్థం కావట్లే. రేపొద్దున్న వీరంతా మన నాయకులు అవుతారు. తప్పు చేసి జైలుకెళ్ళి రావడం ఇప్పుడు గొప్ప. రాజకీయానికి తొలి అడుగు.

తెలుగు వెబ్ మీడియా said...

అబ్రకదబ్ర గారి అభిప్రాయమే నాది. మా చిన్నప్పుడు ఒక వార్త విన్నాను. ఒక తండ్రి తన రెండవ భార్య కొడుక్కి ఆస్తి కట్టబెట్టడానికి తన మొదటి భార్య కొడుకుపై హత్యాప్రయత్నం చేశాడు. అది పెద్ద వార్త అవ్వలేదు. ఎందుకంటే హత్యాప్రయత్నం జరిగింది ఒక సాధారణ పల్లెటూరి వ్యక్తి పైన. ఇప్పుడు హత్య చేసింది డబ్బున్నవాడి కూతుర్ని కాబట్టే కదా టి.వి. చానెళ్ళు ఇంతలా కన్నీళ్ళు కారుస్తున్నాయి.

స్రవంతి said...

మీ విశ్లేషణ బాగుంది సుజాత గారు.

నిషిగంధ said...

కేవలం ఆ తండ్రిని మానసికంగా అధైర్యపరచడం కోసం పాపని చంపాం అని ప్రధాన నిందితుడు చెప్తుంటే నాకైతే ఒళ్ళు గగుర్పొడిచింది.. మానవత్వం ఇంకా బ్రతికి ఉందనే నమ్మకంతోనే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా మనకి మనం నచ్చచెప్పుకుంటున్నాం! కానీ ఈ క్యాన్సర్ అతి వేగంగా అన్ని భాగాలకీ వ్యాపిస్తోంది.. అబ్రకదబ్ర గారు అన్నట్టు, ఒకప్పుడు ఇలాంటి సంఘటనలు అరుదుగా జరిగితే ఇప్పుడు రోజుకొకటి! పోనీ కఠిన శిక్షలు అమలు చేశారూ అంటే, స్వప్నిక కేస్ లో నిందితుల్ని ఎంకౌంటర్ చేశాక మళ్ళీ అలాంటి సంఘటనలు ఎన్ని జరగలేదు!! మీ టపా చాలా ఆశావహకంగా ఉంది.. నమ్మకం వదులుకోవద్దని చెప్తోంది.. ఆ ముగ్గురి ఆత్మకూ శాంతి కలగాలని కోరుకుంటూ వేచి చూడటం తప్ప ఏమీ చేయలేము!

వేణూశ్రీకాంత్ said...

కొత్త కోణం లో చూపారు. కానీ తప్పు ఎవరిదైనా మూడు నిండు ప్రాణాలు అన్యాయంగా బలైపోయాయి. మొత్తం సంఘటనలోని కౄరత్వాన్ని చూస్తే నోట మాట రావడం లేదు.

సుజాత వేల్పూరి said...

నాతో గొంతు కలిపిన వారందరికీ ధన్యవాదాలు!

శ్రీనివాస్,
అవును,ఇలాంటి ఘోరమైన నేరం జరిగిన కేసుల్లో నిందితులకు న్యాయ సహాయం అందకూడదు. లాయర్లే స్వచ్ఛందంగా ముందు రాకుండా ఉండాలి.

సుజాత వేల్పూరి said...

సుజాత గారూ,
న్యూస్ ఛానెల్స్ ఇవాళ దేన్ని జడ్జ్ చేయకుండా వదిలిపెడుతున్నాయి? మహిళా హోమ్ మంత్రి ఉన్నపుడు మహిళల మీద దాడులు జరగడం ఏమిటన్న ప్రశ్నకు అర్థం ఉందా? ఆవిడ కేవలం మహిళలనే రక్షిస్తూ ఉంటుందా(అసలావిడ ఎవర్నీ పట్టించుకోదనుకోండి.అది వేరే విషయం)!పోనీ ఇంతకు ముందు జానా రెడ్డి ఉన్నపుడు మహిళల మీద దాడులు జరగలేదా?

భూమిపుత్రుడు,
అవునండీ! సమాజంలో మారాల్సినవి చాలానే ఉన్నాయి. తల్లిదండ్రుల మీద పగ పసి పిల్ల మీద తీర్చుకోవాలనుకోవడం ఏం న్యాయం!

సుజాత వేల్పూరి said...

అబ్రకదబ్ర,
ఎందుకంత నిర్లిప్తత చెప్పండి? ఎన్ని అరాచకాలు జరిగినా సామాన్య మానవుడిగా ఒక కామన్ మాన్ గా ఇలాంటి ఘోరాలు జరిగినపుడు స్పందించడం చాలా సహజం కదా! ఈ సంఘటన మిమ్మల్ని కదిలించలేదా? శవం కూడా దొరక్కుండా బూడిద చేశారండీ పాపని! ఇది తెలిశాక కూడా నిర్లిప్తంగానే ఉన్నారా?

ఇలాంటివి రోజూ చూస్తూనే ఉన్నా, "కొన్నాళ్లకి మరీ రాళ్ళలా తయారై పట్టించుకోవడం మానేస్తామేమో" అన్న భయమేస్తుంది ఒక్కోసారి! అయినా సరే ఇలాంటివి జరిగిన ప్రతి సారీ నిర్ఘాంత పోతూనే ఉంటాను నేను.

రవిచంద్ర,
అవును, మనం అతిగా స్పందిస్తున్నాం! ఇది కూడా నిజమే..ఇందుకు కారణం మీడియా...!

సుజాత వేల్పూరి said...

కొండముది గారూ,
సమాజం కుళ్ళిపోవడం అనేమాట నిజమే కానీ పూర్తిగా కాదు. నాకు సంబంధించి నేను ఇలాంటి కుళ్ళిపోయిన భాగాల పట్ల విచారమో, బాధో వ్యక్తం చేస్తూనే స్వచ్ఛంగా ఉన్న మిగతా సమాజాన్ని చూస్తూనే ఉంటా!

ఈ కుళ్లిన భాగంలో మన రాజకీయ వ్యవస్థ కూడా ఉండటం వల్లనే నేరస్థుడిగా రుజువైన అఫ్జల్ కి శిక్ష పడకుండా ఆగుతోంది. ఫొటోలు, వీడియోలు దొరికినా కేసులో ఎటువంటి ప్రగతీ లేకుండా కసబ్ కోరినవన్నీ తెచ్చిస్తూ (త్వరలో సంబంధం చూసి పెళ్ళి కూడా చేస్తారేమో) జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కాలక్రమేణా ఈ కుళ్ళు న్యాయవ్యవస్థకు కూడా సోకితే ఇక న్యాయం కోసం ప్రజలు కోర్టుల కెళ్లకుండా తమకు తామే న్యాయం చేసుకునే రోజు త్వరలోనే వస్తుంది.

సుజాత వేల్పూరి said...

mahEsh kumaar,

glObalaijEshan valla vacchina maarpulakanuguNamgaa janam maarEnta Taimu ee vyavastha ivvaDam lEdu. ee maarpula speeDu andukOlEka parugulO venakapaDipOtunnaam!

anduchEta ee asahanaalu, araachakaalu!

vaasuki,
avunu, kasab ki jarugutunna raacha maryaadalu chUstunTE ika E kEsulOnU nyaayam jarigE avakaaSaalu lEvEmO ani bhayamEstOndi.

సుజాత వేల్పూరి said...

వైష్ణవి హత్య ఒక కుటుంబలో జరిగిన విషాదం!మిగతా సమాజంతో ఎటువంటి సంబంధం లేకుండా కేవలం కుటుంబ కలహాల వల్ల జరిగిన ఒక కిరాతకం!

ఇక్కడ మీడియా అతి జోక్యం ఎంత వరకూ అవసరం? ప్రతి మనిషి వ్యక్తిగత జీవితంలోకీ చొచ్చుకుని చొరబడే హక్కు మీడియాకెక్కడిది?

పిల్ల పోయి తల్లి కింద పడి ఏడుస్తుంటే ఆమె మొహంలో కెమెరా పెట్టింది చాలక అది తెచ్చి ప్రేక్షకుల కళ్ళలో పెట్టి వారి బాధను ప్రపంచ వ్యాప్తం చేస్తున్న ఈ మీడియా నైతిక విలువలెలాంటివి?

రోజుకు రెండు సార్లు వార్తలు ప్రసారం చేసే దూరదర్శన్ ఉన్న కాలంలో ఇంత ప్రచారం జరిగేదేనా ఈ సంఘటనకి? మహా అయితే వార్తా పత్రికల మీద ఆధారపడేవాళ్ళమేమో!

వైష్ణవి తిరిగి రావాలని ఎస్సెమ్మెస్ లు పంపడాలు, పొద్దున రాత్రి అని లేకుండా ప్రతి చోటా గూఢ చారుల కంటే అన్యాయంగా కెమెరాలు పట్టుకుని వీళ్ళు తిరుగుతుంటే ప్రతి వ్యక్తికీ జీవితంలో సగ భాగాన్ని రోడ్డు మీదే గడిపేస్తున్న భావన.

అంత్యక్రియలతో సహా లైవ్ లో చూపించి మనుషుల భావోద్వేగాలతో ఆడుకుంటున్న ఈ కౄరమైన మీడియాను ఏ స్థాయిలో ప్రక్షాళన చేయాలి?

చందమామ రాజుగారు తన బ్లాగులో రాశారు..ఆ దృశ్యాలు చూస్తూ ఎక్కడ గుండెపోటు వస్తుందో అనే కంగారుతో ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయారట ఆయన. ఇలా ఎంతమంది భావించి ఉంటారు?నిజంగానే ఈ ఘోరమైన సంఘటనను, దాని ఫాలో అప్ నీ టీవీల్లో చూసి ఎవరికైనా గుండెపోటో మరోటో వస్తే మీడియా బాధ్యత వహిస్తుందా?

ఎందుకీ అత్యుత్సాహం?

"వైష్ణవి హత్య మీద మీ స్పందన ఏమిటి?"అని కనపడిన ప్రతి వాడినీ (కోదండరాం గారితో సహా)అందర్నీ అడగటం!ఎవరి స్పందన అయినా ఎలా ఉంటుంది? ఎవరు బాధపడరు ఈ ఘటనకి?

"ఆ పాప తల్లి ఏమంటున్నారు?"అని మరో ప్రశ్న! తల్లి ఆ పరిస్థితుల్లో కెమెరా ముందు కూచుని స్టేట్ మెంట్లు ఇచ్చే స్థితిలో ఉంటుందా? బుద్ధుందా వీళ్ళకి?

నేరాలు హింస వంటివి చూపకూడదని నిషేధించినట్లే ఇటువంటి హృదయ విదారక ఘటనలు జరిగినపుడు కూడా వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడే మీడియా మనుషుల మీద సదరు బాధితులు ఫిర్యాదు చేయడానికి వీలుగా ఏవైనా చర్యలు చేపట్టాలి.

Siri said...

అంత్యక్రియలతో సహా లైవ్ లో చూపించి మనుషుల భావోద్వేగాలతో ఆడుకుంటున్న ఈ కౄరమైన మీడియాను ఏ స్థాయిలో ప్రక్షాళన చేయాలి?

సుజాత గారు,
కౄరమైన మీడియాని ప్రక్షాళన చేయలన్నారు. టి.వి రిమోట్ మన చేతిలోనే ఉంటుంది కదండి. మనం మాకిలాంటి ప్రసారాలు వద్దు అని స్పష్టం చేస్తే ఎందుకు ప్రసారం చేస్తారు. మనం చూడడం మానేయొచ్చు కదా?

సుజాత వేల్పూరి said...

స్నేహ గారు, అది కూడా మొదలైందిగా! మాకీ నేర వార్తల ప్రసారాలు వద్దు అని జనం గొంతెత్త బట్టే ఇప్పుడు కనీసం వాటి విషయం కదిలింది.

ఇంట్లో పిల్లలున్నారనో, మరో కారణం చేతో చూడ్డం మానేసే వాళ్ళుంటారు గానీ ఎంత మంది?

వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకెళ్ళకుండా నియంత్రణ ఉండాలి మీడియాకి. అదీ చెప్పాలనుకున్న పాయింట్.

kanthisena said...

సుజాత గారూ,
మళ్లీ మీ బ్లాగ్ కథనం చూడ్డంలో వెనుకబడ్డాను. వైష్ణవి ఘటనపై ఈ రోజు -6th- మీరు పెట్టిన ఆ కొత్త ప్రతిస్పందన ఇంకా బాగుంది.

అందరినీ జోకర్లను చేసి ఆడుకుంటున్న మీడియా ఈ మధ్య తానే పెద్ద జోకర్‌లా తయారయినట్లుంది. ఇదీ మన మంచికే అనుకుంటాను.

మీడియాపై మన భ్రమలు ఇంకా ఉంటే కాస్త త్వరగా పోతాయి. చివరకు మన భావోద్వేగాలను కూడా అదుపు చేసుకోవలసిన అవసరాన్ని టీవీ కవరేజ్‌లు బలంగానే గుర్తు చేస్తున్నాయి. మనిషి ఇంకా చావలేదు అనే మీ క్యాప్షన్ చాలా బాగుంది. 'నేరప్రవృత్తి పెరగటానికి చాలా అనుకూలమైన వ్యవస్థలో మనం జీవిస్తున్నాం!' అని వేణుగారి వ్యాఖ్య. అందుకే ఇలాంటివి ఇంకా ఎన్నో చూడడానికి మనం సిద్ధపడి ఉండాల్సిందే.

'ఎవరికైనా లేపెయ్యాలనే ఆలోచన రావాలికానీ ఆ పని ఫోన్ లో పిజ్జా ఆర్డరిచినంత సులభంగా చేసుకునే వీలుందని అందరికీ తెలుసు' లలిత గారి వ్యాఖ్య. ప్రకాష్ రాజ్ పదేళ్లకు ముందు ఏదో తెలుగు సినిమాలో ఇందిరాగాంధీ హత్యపై ఇలాగా వ్యాఖ్యానించి నవ్వించాడు. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు నవ్వు పుట్టించేందుకు బదులు మరింతగా భయం పెంచుతున్నాయి. ఒకటి మాత్రం నిజం. ఇంట్లోంచి బయటపడి రోడ్డెక్కిన తర్వాత తిరిగి ఇంటికి చేరుకోవడం ఇక మన చేతుల్లో లేదు. అయితే యాక్సిడెంట్. లేదా ఎవరో ఒకరు గొంతుపిసికేయవచ్చు.

ఎవరికి ఎందుకు కోపం వస్తుందో.. మన జీవితాలపై ఎవరు ఏ రాత రాసేస్తారో భయపడే కాలం వచ్చేసింది కదా. దీన్ని మార్చడం చేతకానప్పడు అందరూ భరించాల్సిందే. తప్పదు.

ఈ సందర్భంగా మీడియా వైపరీత్యంపై శివరాం ప్రసాద్ గారు తన సాహిత్య అభిమాని బ్లాగులో మంచి కథనం పోస్ట్ చేసారు చూడండి.
http://saahitya-abhimaani.blogspot.com/2010/02/blog-post.html

Madhavi said...

Sujatha garu,
What you have told you is correct. I have seen the extremes of the media.
I don't want to name the kukka channel but they actually went and asked mother these questions in live program.
Can you believe this?
The questions are
"what is the type of food she likes, do you want to suggest the kidnapper about the food? do you think that Vaishnavi will be playing actively playing there actively and so on" Nonsense. something should be done about the media.

Post a Comment