February 22, 2010

"కృష్ణా నీ బేగనే బారో....!"

90 ల్లో కొలొనియల్ కజిన్స్ పేరుతో వచ్చిన ఆల్బమ్ లో ఈ కీర్తన ని హరిహరన్ లెస్లీ లూయిస్ తో కలిసి పాడినపుడు ప్రతి సంగీతాభిమానినీ ఉర్రూతలూగించింది. వ్యాసతీర్థుల వారు రచించిన ఈ కన్నడ సంకీర్తనలో చిన్ని కృష్ణుడి సౌందర్యాన్ని వర్ణిస్తూ రారమ్మని పిలవడం జరుగుతుంది.



కొలోనియల్ కజిన్స్ ఆల్బం తర్వాత ప్రతి శాస్త్రీయ సంగీత కచేరీలోనూ "కృష్ణా నీ  బేగనే బారో" తప్పనిసరై పోయిందిట.

ఆ ఆల్బం లో లెస్లీ, హరి హరన్ లు ఇద్దరూ అద్భుతంగా పాడారు. ఇంగ్లీష్ సాహిత్యం కూడా భలే ఉంటుంది. ఏ కాలానికైనా సరిపోయేట్టుగా ! ఇదిగో చూడండి....



Krishna nee begane baro
Krishna nee begane baro
Darkness coming round
And everybody fighting with their brothers
Everybody wants control
Don't hesitate to kill one another
So come back as Jesus


Come back and save the world
That's all the future
Of every boy and girl
Come back as Rama
Forgive us for what we've done Come back as Allah
Come back as anyone


Krishna nee begane baro
krishna nee begane baro




Religion is the reason
The world is breaking up into pieces
Colour of the people
Keeps us locked in hate please release us


hmm..


So come down and help us
Save all the little ones
They need a teacher
And you are the only one


We can rely on
To build a better world
A world that's for children
A world that's for everyone


Krishna nee begane baro
Krishna nee begane baro


Time is the healer
Time moves on
Time don't wait for anyone
You tell you'll be back
But that will take some time


I'm waiting...


ahh......


I'm waiting...
Waiting...

I'm waiting...
I'm waiting


Yea.... Yea...


Come back as Jesus
Come back and save the world
We need a teacher
You are the only one
Come back as Rama
Forgive us for what we've done


Come back as Allah
Come back as anyone


Krishna nee begane baro
Krishna nee begane baro


Jesus!
Come back and save the world
That's all the future
Of every boy and girl
Come back as Rama


Forgive us for what we've done
Come back as Allah
Come back for everyone
Govinda bolo hare Gopal bolo...

వీడియో కూడా చాలా నచ్చింది నాకు!

ఆ మధ్య హైదరాబాదు లో హరిహరన్ లైవ్ షో జరిగినపుడు ఈ పాట పాడాలని కోరగానే వెంటనే పాడాడు. మామూలుగా అయితే చివర్లో I'm waiting.." తో పాట పూర్తవుతుంది.

లైవ్ లో I'm waiting.."అంటూ హరిహరన్ నెమ్మదిగా గొంతు తగ్గిస్తూ వెళ్ళి కూచోగానే percussionist(పేరు తపన్ ఘోష్ అని గుర్తుంది ....)అందుకుని దాదాపు 35 నిమిషాల సేపు రకరకాల బీట్స్ తో ఒక ఆట ఆడుకున్నాడు ప్రేక్షకుల్ని! ఎంతగా అంటే ఆ పాట హరిహరన్ మొదలెట్టాడని అందరూ మర్చిపోయేంతగా!



అంతా ఊపిరి బిగపట్టి ఆ బీట్స్ లో లీనమైపోయి ఉండగా చివర్లో హటాత్తుగా హరిహరన్ వచ్చి "I'm waiting" అని అందుకునేసరికి ఉలిక్కిపడి తెప్పరిల్లిన ప్రేక్షకుల నుంచి చప్పట్లు కుంభవృష్టిగా కురిశాయి.

ఈ పాట ను శ్రీ కృష్ణ దర్శనం ఆల్బమ్ కోసం ఉన్ని కృష్ణన్ పాడిన వెర్షన్ ఇక్కడ. వినండి.
"బారో..." అనడంలో ఎంత లాలన, గారాబం పలికిస్తాడంటే బాల కృష్ణుడు వెన్న చేతిని నాక్కుంటూ
పరుగెత్తుకు రావలసిందే! (ఉన్ని కృష్ణన్ గురించి ఒక టపా రాయాలి)

కద్రి గోపాలనాథ్ గారి శాక్సో ఫోన్ లో ఇక్కడ .వినండి!

25 comments:

Anonymous said...

మంచి టపా సుజాత గారూ! టైటిల్ చూసి "శ్రీ కృష్ణ కమిటీ" మీద ఏమైనా రాశారేమో అనుకున్నాను.

ఈ పాట నాక్కూడా చాలా ఇష్టం! అప్పట్లో ఇదొక ప్రభంజనం!

గోపాలనాథ్ గారి శాక్సో ఫోన్ అద్భుతంగా ఉంది. ఫ్యూజన్ శాక్సో ఫోన్ తో ఇంత అందంగా చేయొచ్చా అనిపించింది.

తృష్ణ said...

హరిహరన్ అంటే చాలా ఇష్టమవటం వల్ల అప్పట్లో ఆ ఆల్బం రాగానే కొనేస్కున్నాను.చాలా ఏళ్ళు మోగుతూ ఉండేవి ఆ ఆల్బం, ఆ పాట ఇంట్లో...మంచి పాట గుర్తు చేసారు...!గజల్స్ గురించి,హరిహరన్ గురించీ ఎప్పుడొ మొదట్లో ఒక పొస్ట్ రాసాను.ఒకవేళ అదివరకూ చూడకపోతే చూడండి."ఇండియన్ వాయిసెస్" లేబుల్లో ఉంది..

"కృష్ణ దర్శనం" ," కృష్ణ ప్రియ" రెండు ఆల్బంస్ బాగుంటాయండి...నేను తరచు వినేవాటిల్లో అవి రెండూ కూడా ఉంటాయి..:)

సుజాత వేల్పూరి said...

కిరణ్ కుమార్ గారు,
గోపాలనాథ్ గారి ఆల్బములు ఎప్పుడైనా వీలు కుదిరితే వినండి. డ్రీమ్ జర్నీ తో మొదలుపెట్టండి. అదీ ఫ్యూజనే!


తృష్ణ,
అవునండీ, కృష్ణ దర్శనంలో ఉన్ని కృష్ణన్ విశ్వరూపం కనపడింది నాకు! కల్యాణ గోపాలం,పావన గురు పరమ పురుష, కృష్ణా నీ బేగనే ..మిగిలినవి కూడా దేనికదే అద్భుతంగా తోస్తుంది.

గోపాలనాథ్ గారి శాక్సో ఫోన్ ఫ్యూజన్ వెర్షన్ విన్నారా?

GKK said...

ధాంక్స్ సుజాతగారు. మొన్న ఒకరోజు మాటీవీ లో సూపర్ సింగర్ కార్యక్రమంలో సౌమ్యమాధురి అనుకుంటా ఒక అమ్మాయి పాడిందండీ కృష్ణానీ బేగనే బారో పాట. మైగాడ్. అద్భుతం. చాలా గొప్పగా పాడింది. కోటి గారు చాలామెచ్చుకున్నారు.

సుజాత వేల్పూరి said...

తెలుగు అభిమాని గారు,
ఆ అమ్మాయి పేరు అంజనా సౌమ్య కాదూ?(లేక సౌమ్య మాధురేనా?) ఆ అమ్మాయి నిజంగా బాగా పాడుతోందండీ!

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

ఈ పాట ఒక సంచలనం.ఇంత మంచి పాట పాడిన హరిహరన్ గారే కన్నడ నటుడు ఉపేంద్ర నటించిన బుద్ధివంత చిత్రం లో 'రవివర్మా కే ' అని రీమిక్స్ పాడారు.ఆ పాట ఆయనెందుకు పాడారా అనిపించేంత ఘోరంగా పాడారు.

jeevani said...

సుజాత గారూ క్షమించండి ఇక్కడ వేరే కామెంట్ పెడుతున్నందుకు, చివరకు మిగిలేదిపై నా చివరి కామెంటు ఇది. నా అక్కసు కనీసం మీతోనైనా చెబుదామని. పుస్తకం.నెట్ వాళ్ళు పాఠకులతో వితండవాదం చేయడం విడ్డూరంగా వుంది. నా కామెంటు ఎలాదూ ప్రచురించరు అందుకే మీకు తెలియపరుస్తున్నాను, ధన్యవాదాలు.


ఆ సైట్లో నా కామెంటు ఇది.
" ఈ ఎదవ సోది ఎందుకండీ ఈ సైటుకు రాకపోతే పీడా పోయే ( మేము మానుకున్నా మీకు వచ్చిన నష్టం కూడా లేదనుకుంటా !) ! అగ్రిగేటర్లు ఆత్మవిమర్శ మాని కనీసం ఎందుకు ఇంతమంది ఫీలవుతున్నారన్నది కూడా గమనించకపోవడం దురదృష్టకరం. మీకో నమస్కారం…"

Sky said...

సుజాత గారు,

కిరణ్ కుమార్ గారు అన్నట్లు నేను కూడా మీరు శ్రీ కృష్ణ కమిటి గురించి రాశారేమో అనుకున్నాను... మీరు చెప్పిన హరిహరన్ గారి కార్యక్రమానికి నేను కూడా వెళ్ళానండీ....గిటార్ నేర్చుకున్న కొత్తల్లో ఈ పాటను చాలా కష్టపడి ప్రాక్టీస్ చేశాను..... ఓ మంచి మాటను గుర్తుకు తెచ్చినందుకు థాంక్స్.....

సతిష్ యనమండ్ర

కొత్త పాళీ said...

""బారో..." అనడంలో ఎంత లాలన, గారాబం పలికిస్తాడంటే .."
ఆ లాలన గారాబం యమునా కళ్యాణి మహిమ :) నా మట్టుకి నాకు కేవీ నారాయణస్వామి గారి వెర్షనే ప్రమాణం

RK Veluvali said...

సుజాత గారు,
మంచి పాటను మా అందరికీ గుర్థు చేసినందుకు, ఉన్నిక్రిష్ణన్ గారి గొంతులోని మాధుర్యాన్ని చవిచూపినందుకు మీకు వెవేల కృతజ్ఞతలు...

సుజాత వేల్పూరి said...

కొత్తపాళీ గారూ,
నారాయణ స్వామి గారి వెర్షన్ నేను వినలేదు. లింక్ ఇస్తారా వుంటే! జేసుదాస్ వెర్షన్ కూడా బావుంటుంది. కాకపోతే శాస్త్రీయ సంగీతంతో పరిచయం/ ఆసక్తి లేనివారు సైతం ఎంజాయ్ చెయ్యగలరనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్ని కృష్ణన్ వెర్షన్ ఇచ్చాను. ఇది ఇంటర్ లూడ్స్ అవీ ఉండి సెమీ క్లాసికల్ గా అనిపిస్తుంది కదా! అలాగే కద్రి గోపాలనాథ్ గారి శాక్సో ఫోన్ వెర్షన్ కూడా ఫ్యూజన్ మిక్స్ ఇస్తే బావుంటుందనిపించింది.

యమునా కళ్యాణి విషయంలో మీతో ఏకీభవిచడం తప్ప వేరే మార్గమేముంది?

oremuna said...

పైన కిరణ్ కుమార్ ఒరెమూనా కాదు :-) ఈ కిరణ్లతో చచ్చే చావచ్చొంది.

Anonymous said...

సుజాత గారూ, ఈ టపా నేను చూడకుండా వుండాల్సింది !
వీడియో చూస్తుంటే ఎక్కడో దూరంగా హాస్టల్లొ వున్న నా కొడుకు గుర్తొచ్చాడండీ . ఆ వీడియోలో కుర్రాడిలానే వుంటాడు . గొంతు పూడుకుపోయి , కన్నీళ్ళు వచ్చేసాయి. నన్నేడిపించేసారుమీరు.

సుజాత వేల్పూరి said...

ఒరెమూనా,
"ఈ కిరణ్లతో చచ్చే చావొచ్చింది"...:-)))
నిజంగానే చాలా మంది కిరణ్ లు ఉన్నారండీ! కానీ అందరికీ మీరు "చావా కిరణ్" గానో అంతకు మించి ఒరెమూనా గానే తెలుసులెండి. తికమక పడరు.

సుజాత వేల్పూరి said...

అయ్యో లలితా, సారీ సారీ సారీ!

వేణు said...

కద్రి గోపాల్ నాథ్ గారి శాక్సోఫోన్, ఇతర వాద్యాల సమ్మేళనం ... ఎప్పుడో ఆలకించిన మధురగానమేదో మళ్ళీ వింటున్న అనుభూతిని కలిగించింది.
ఉన్నికృష్ణన్ స్వరచాలనం శ్రావ్యంగా ఉంది. థాంక్యూ!

Unknown said...

ఇంతకి "కృష్ణా నీ బేగనే బారో....!" అంటే అర్ధం ఏంటి? ఏ భాష ఇది?

సుజాత వేల్పూరి said...

vims గారూ,
ఇది మధ్వ గురువు శ్రీ వ్యాసతీర్థుల వారు రాసిన కన్నడ సంకీర్తన. బేగ అంటే వేగం! బారో అంటే రారా అని! బాల కృష్ణుడి సౌందర్యాన్ని వర్ణిస్టూ సాగే కీర్తన ఇది.కృష్ణుడి కాలి అందెల్నీ శరీర నీల మేఘచ్ఛాయనూ, అతడి ఆభరణాలనూ,చేతిలోని మురళినీ ఇలా అందంగా ముద్దుగా వర్ణించారు ఒరిజినల్ కీర్తనలో!

వేణూశ్రీకాంత్ said...

నాకు కూడా చాలా ఇష్టమైన పాట. లిరిక్ తో సహా అందించినందుకు ధన్యవాదాలు. బారో అనడం గురించి కరెక్ట్ గా చెప్పారు. చాలా బాగుంటుంది.

మురళీ కృష్ణ said...

సుజాత గారు,
I am able to get Feed for this blog. Each BlogPost contains first few lines only. But i would like to read your blogposts offline.
So, please adjust your feed settings accordingly to get full feed for your posts.

Thnaks,
Murali

Ramu S said...

సుజాత గారూ,
చాలా బాగుంది అండి. థాంక్స్.
రాము
apmediakaburlu.blogspot.com

Murali said...

నా ఫేవరెట్స్‌లో ఈ పాట ఒకటి.

-మురళి

Srujana Ramanujan said...

మామూలుగా ఎవరో చెప్పారని చెయ్యటం మాకంతగా నచ్చదు. ఈ పాటని కూడా మీ పరిచయం తరువాత చాలా సార్లు విన్నాక రాస్తున్న వ్యాఖ్య ఇది. మాటల్లో చెప్పలేని అనుభూతి అందించిన పాట ఇది. మీరు పరిచయం చేసిన తీరు బాగుంది. హరిహరన్ పాడటం నేను ప్రత్యక్షంగా విన్నాను. అలై పొంగెరా కన్నా తరువాత నాకు బాగా నచ్చిన పాట ఇదే. అందులోనూ కృష్ణుడి గురించి కదా... :)

Srujana

చాలా సార్లు పరిచయాల దెబ్బకి దెబ్బై పోయి వెంటనే పట్టించుకోలేదు కానీ, చక్కని పాట. అనవసరమైన భయాలతో కనీసం ఓ పది రోజులు వృధా చేసుకున్నాను. saxophone bit, ఉన్ని కృష్నన్ వెర్షన్ కూడా ఇవ్వటం మంచి పని.

హరిహరన్ లైవ్ కాన్సెర్టో ఇంత వరకు వినలేదు. Leslee's voice complemented Hariharan's magic. The score is also wonderful.

గీతాచార్య

Vasu said...

నాకు చాలా ఇష్టమయిన పాట. నాకు బాగా గుర్తు. మేము కంప్యూటర్ (డెస్క్ టాప్) కొన్న కొత్తలో రిలీజ్ అయ్యి చాల పొపులర్ ఐంది. తెగ వినేవాడిని. ఆల్బం కూడా మీరన్నట్టు అద్భుతంగా ఉంటుంది.

ఎన్ని సార్లయినా వినచ్చు.

మంచి పాటను గుర్తు చేసారు. థాంక్సులు.

Unknown said...

hello sujatha garu., me tapa lu regular ga chusthuntanu , meru rasina KRISHNA tapa lo
"KRISHNA NI BEGANE" ante artham chepthara actual ga naku adhi artham kaledhu andhukani..

Post a Comment