January 29, 2012

యమహా నగరి కలకత్తా పురి..!

ఇవాళ వేటూరి పుట్టినరోజు ట

వేటూరి సినీ సాహిత్యంలో ఒక లక్షణం ఉంటుంది.(అనిపిస్తుంది నా వరకూ)! మొదటి సారి విన్నపుడు "బాగుంది"
అనిపించి, ఆ తర్వాత అదొక వ్యామోహం లాగా పట్టుకుని వదలదు. తరచి చూసే కొద్దీ అద్భుత సౌందర్యాలు రత్న మాణిక్యాల్లా దొరుకుతూనే ఉంటాయి.

అలాటి పాటల్లో ఈ మధ్య వచ్చిన వాటిలో ఒకటి యమహా నగరి అయితే మరోటి అర్జున్ సినిమాలో "మధుర మధుర తర మీనాక్షీ "కంచి పట్టు" న కామాక్షి!

వింటున్న కొద్దీ మరిన్ని సౌందర్యాలు తోచి,శోభిల్లే పాటలు ఇవి.

యమహా నగరి కలకత్తా పురి___________కలకత్తా నగరాన్ని ఏ బెంగాలీ కవి అయినా కూడా ఇంత అందంగా, అలతి   పదాలతో సమ్మోహనం గా వర్ణించలేడని బల్ల గుద్ది, వీలైతే విరక్కొట్టి మరీ చెప్పేస్తా నేను. :-)



యమనా నగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
చిరు త్యాగరాజు నీ కృతినె పలికెను మది

నేతాజీ పుట్టిన చోట గీతాంజలి పూసిన చోట
పాడనా తెలుగులో

ఆ హంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాటే సాగనా
పరుగులో పరుగు తీసింది పట్నం
బ్రతుకు తో వెయ్యి పందెం కడకు చేరాలి గమ్యం
కదలి పోరా
ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు
దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల
గజిబిజి ఉరుకుల పరుకులలో


బెంగాలీ కోకిల బాల
తెలుగింటి కోడలు పిల్ల
మానినీ సరోజినీ
రోజంతా సూర్యుడి కింద రాంత్రంతా రజనీ గంథ సాగనీ
పద  గురూ ,ప్రేమలే లేని లోకం  దేవదా మార్కు మైకం
శరన్నవలాభిషేకం తెలుసుకోరా
కథలకు నెలవట కళలకు కొలువట
తిథులకు సెలవట అతిథుల గొడవట
కలకట నగరపు కిట కిటలో


వందే మాతరమే అన్న వంగ భూతలమే మిన్న
జాతికే గీతిరా
మాతంగి కాళీ నిలయా చౌరంఘీ రంగుల దునియా నీదిరా
విను గురూ, సత్య జిత్ రే సితారా, ఎస్ డి బర్మన్ కి థారా
థెరిసా కీ కుమారా కదలి రారా
జనగణమనముల స్వర పద రవముల హృదయపు లయలను
శృతిపరచిన ప్రియ శుక పిక ముఖ  సుఖ  రవళులలో

ఎంత గొప్పసాహిత్యం!!

బెంగాల్ తో ప్రతి భారతీయుడికి ఉండే అనుబంధమంతా ఈ పాటలో ప్రతిఫలిస్తుంది. ఆ వాతావరణమంతా కళ్ళ ముందు కదలాడుతుంది ఈ పాట వింటున్నపుడు

బెంగాలీ కోకిల తెలుగింటి కోడలని గుర్తు చేయడం,వందేమాతరం అక్కడ పుట్టింది కాబట్టి వంగ దేశం జాతికే గీతి అనడం, "జనగణమన" ముల  అనడం  జనగణమన కూడా అక్కడే పుట్టిందని తల్చుకోడం..

ఎంత సౌందర్య భరితం!!

శరన్నవలాభిషేకం__________అనే మాట ఎక్కడైనా విన్నామా అసలు ఇంతకు ముందు? గుండె ఝల్లుమనే ప్రయోగం కదా!
 దేవదా మార్కు మైకం, చౌరంగీ రంగుల దునియా, ఎస్.డి బర్మన్ కి ధారా...థెరిసా కీ కుమారా...!

ఈ పాట ఇంకెవరూ రాయలేరు! అంతే ! ఇది శిలా శాసనం!

చిరంజీవి కూడా ఈ పాటలో ఒక  క్లాసిక్ లుక్ తో ఎంత హాండ్సమ్ గా ఉంటాడో చూడండి(పాట తాలూకు మైకంలో మనకలా కనిపిస్తాడా?)


హరి హరన్ పాటలో(అది రాక్ అయినా,సినిమా పాట అయినా , ఘజల్ అయినా) "సోల్" ఉంటుంది. అది మనకు వినిపిస్తుంది.ఈ పాటకు హరి హరన్ ని ఎంచుకోవడం గొప్ప ఎన్నిక!

ఈ పాటలో తళుక్కున మెరిసే గిటార్,సాక్సో ఫోన్, వయొలిన్ లో ఎంత అందమో!


తబలాతో కల్సి ఆడుకునే Rythm pads లో ఎంత మాధుర్యమో


రఘు వంశ సుధాంబుధి కీర్తనలో స్వరాలు పడాల్సిన చోట్లో రాసిన పదాలో...!

"చిరు" త్యాగరాజు నీ కృతినె పలికెను మది...!

వేటురి పాటల్లో అసంఖ్యాకమైన పాటలు ఇష్టమైనవే అయినా ఈ పాట సాహిత్యం మాత్రం అనితర సాధ్యం,అద్భుత సౌందర్యం,అనన్య సామాన్యం!



ఎన్ని సార్లు విన్నా, అప్పుడే మొదటి సారి వింటున్నంత సంతోషం, సంభ్రమం ఈ పాటలో నాకు!

మీకో?










36 comments:

♛ ప్రిన్స్ ♛ said...

!! సుజాత !! గారు మంచి పాట గురించి చెప్పారు ఈ పాట నాకు చాల ఇష్టం.. ధన్యవాదములు

Anonymous said...

ఏమో మీరు చెప్పాక అవునా అని మరో సారి విన్నా... నాకేమి అనిపించలేదండి. :)) మరో సారి వింటా. ప్రయతిస్తే పోయేదేమీ లేదు, చెవి తుప్పు తప్ప అన్నారు ఎవరో మహా కవి.

సుజాత వేల్పూరి said...

మరేం పర్లేదండీ! ఈ టపా నా పర్ స్పెక్టివ్ కదా!

వేణు said...

తిలక్ రాసిన హైదరాబాద్ ‘నగరంపై ప్రేమగీతం’ లాంటి గీతమిది. కలకత్తా నగరానికి తెలుగువారి దృక్పథం నుంచి పట్టిన అక్షర నివాళి!

కలకత్తాకు కీర్తి తెచ్చిన ప్రసిద్ధులందరి పేర్లనూ క్లుప్తంగా అందంగా పొదగటంలో వేటూరి ప్రతిభకు ప్రతీకగా నిలుస్తుందీ పాట. బిజిబిజి... గజిబిజి, కలకట.. కిటకిట- లాంటి చక్కటి ప్రయోగాలను చేసిన వేటూరి అక్షర రమ్యతకు ముచ్చటేస్తుంది.

బాణీ మాతృక ‘రఘువంశ సుధాంబుధి’ కాబట్టి ఈ పాటలో మణిశర్మకి పడే మార్కులు తక్కువే. ఆ రకంగా కూడా వేటూరికి ఆ పాట ఘనతలో వాటా ఎక్కువే!

సుజాత వేల్పూరి said...

వేణు గారూ,

తిలక్ కవిత తో భలేగా పోల్చారే!నాకు తట్టనే లేదు.

ఈ పాటలోని భావం మనసుకి అందాలంటే, కవిత్వం మీద, సంగీతం మీద, కళాత్మ జీవితం మీద ప్రేమ ఉండాలి.(ఇదీ నా పర్ స్పెక్టివే) స్వరాలు వేయాల్సిన చోట్లో స్వర స్థానాలు తప్పకుండా పదాలు రాయాలంటే ఎంత కష్టమో అనిపిస్తుంది

Zilebi said...

వేటూరి కి
దీటు ఎవ్వరూ లేదు !
సరిగ్గా చెప్పారు.

వారి మాటల్ని వింటూంటే, కృష్ణ దేవరాయల భువన విజయ కవులు కలిసి కట్టుగా ఆయనలో కలిసి మన కాలం లో దర్శనం ఇచ్చారా అని పిస్తుంది నా కైతే !

జిలేబి.

Anonymous said...

ఈ పాటకి ఎంచుకున్న రాగం పేరే 'కదన కుతూహలం' పైగా వేటూరి పదాల అల్లికానూ! కానీ స్వాతంత్ర్య ఉద్యమ కాలంనాటి కలకత్తాని ఇప్పటి కొల్‌కతానీ పోల్చి చూసుకుంటేనే బాధగా ఉంటుంది!

సుజాత వేల్పూరి said...

జిలేబి గారూ, ___________

కృష్ణ దేవరాయల భువన విజయ కవులు కలిసి కట్టుగా ఆయనలో కలిసి మన కాలం లో దర్శనం ఇచ్చారా అని పిస్తుంది నా కైతే !__________


ఎక్స్ లెంట్! నేను ఏదో చెప్పాలనుకుని చెప్పలేకపోయిన ఫీలింగ్ ఉంది వేటూరి గురించి! సరిగ్గా ఇదే అయ్యుండాలి. భలే చెప్పారు. థాంక్స్

తృష్ణ said...

నాకూనూ..:)
"కలకత్తా నగరాన్ని ఏ బెంగాలీ కవి అయినా కూడా ఇంత అందంగా, అలతి పదాలతో సమ్మోహనగా వర్ణించలేడని బల్ల గుద్ది, వీలైతే విరక్కొట్టి మరీ చెప్పేస్తా నేను. :-)"

right right..:)

Kottapali said...

అవును.

వేణూశ్రీకాంత్ said...

బాగారాశారండీ.. మాకూ అంతే అనిపిస్తుంది...

shyam said...

పెద్దవాళ్లు రాసిన వాట్లో తప్పులెన్నేంత వాళ్లం కాం.కానీ సుభాష్ చంద్రబోస్ కటక్లో పుట్టేరేమో.
పాట బాగుంది.
శ్యాం

రాజ్ కుమార్ said...

Excellent post sujata gaaru.
like like.......like ;)

Ganesh said...

Sujatha garu,

I used to listen to this song when I was working in Kolkata back in 2003 walking in the same places where chiru walked! Sometimes I felt like chiru also :)

Sujata M said...

అబ్బ ! ఎంత బాగా చెప్పారు ? ఓ సారి కొత్తపాళీ గారు 'సఖి' లో 'సఖియా..' పాట గురించి ఎంత బాగా చెప్పారో ! అది గుర్తొచ్చింది.

నిజంగా ఈ వేటూరి గ్రేట్ ! At the same time, ఈ పాటల్ని అంత బాగా భావస్ఫోరకంగా చిత్రీకరించిన రస హృదయులు - దర్శకుల్నీ, ఇలాంటి పాటల్ని మనకందించిన సినీ నిర్మాతల్నీ, వాళ్ళ అభిరుచినీ మెచ్చుకుని తీరాలి. అన్నట్టు దీని అర్ధం ఏమయ్యుండొచ్చు ?

"శృతిపరచిన ప్రియ శుక పిక ముఖ శుక రవళులలో.." ?

Thanks.

బులుసు సుబ్రహ్మణ్యం said...

>>> కృష్ణ దేవరాయల భువన విజయ కవులు కలిసి కట్టుగా ఆయనలో కలిసి మన కాలం లో దర్శనం ఇచ్చారా అని పిస్తుంది నా కైతే !__________

అమ్మో అమ్మమ్మో ... మరీ ఇంత అభిమానమా ??

ఆ.సౌమ్య said...

మొదటిసారి ఈ పాట విని పిచ్చెక్కిపోయానండీ...ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. వేటూరి వారికి జోహార్లు. అన్నీ చెప్పి మణిశర్మ గురించి ఒక్క ముక్క కూడా చెప్పలేదేమండీ? ఎంత రఘువంశసుధాంభుది నుండి తీసుకున్నా పల్లవొక్కటే కదండీ. మిగతా పాటంతా ఎంతో అందంగా స్వరపరిచారు. మధ్యలో వచ్చే మ్యూజిక్ బిట్స్ అద్భుతం కదూ!

సుజాత వేల్పూరి said...

అచంగ గారు, ఈ పాటలో మొత్తం మీద కలకతా చరిత్ర/వర్తమనం అంతా ప్రతిబిమిస్తుంది. ఈ పాట వింటుంటేనే మనకూ కలకత్తాకూ ఇంత అనుబంధముందా? అని ఆశ్చర్యం వేస్తుంది.

పాత వాటితో కొత్త వాటిని ఎప్పుడూ పోల్చుకుని చూడలేం! బాధ పెరుగుతుందే కానీ తగ్గదు. మార్పు సహజం అని సరిపెట్టుకోవాలేమో కదా!

తృష్ణ,,,:-) థాంక్స్!

వేణూశ్రీకాంత్, కొత్తపాళీ గారూ..థాంక్స్!

శ్యాం గారూ, అవునేమో నాకూ తెలీదు. ఆయన ఎక్కడ పుట్టినా జీవితం, అనుబంధమంతా కలకత్తాతోనే ముడిపడి ఉంది కదాని కవికున్న స్వేచ్ఛతో అలా వాడేశారేమో వేటూరి!

సుజాత వేల్పూరి said...

రాజ్ కుమార్,
థాంక్యూ!

Ganesh garu,

You are so lucky to roam around there and feel like "chiru"! Great!!

సుజాత గారూ, శృతిపరచిన ప్రియ శుక పిక "ముఖ సుఖ" రవళులలో.." పదం ఒకటి సరి చేశాను. ఇప్పుడు అర్థం స్ఫురించ వచ్చేమో చూడండి :-)

బులుసు గారూ, ఏ రసాన్నైనా అవలీలగా రాయగల వేటురి మీద అంత అభిమానం ఉండటం లో ఆశ్చర్యం ఉందంటారా?

సుజాత వేల్పూరి said...

సౌమ్యా,
మొదటి సారి విని "బాగుంది:" అనుకున్నా ట్యూన్ పరంగా! తర్వాత తర్వాత ఎన్ని సార్లు విన్నా తనివి తీరకుండా తయారైంది పరిస్థితి!

మ్యూజిక్ బిట్స్ గురించి, శాక్సో ఫోన్,గిటార్,తబలా గురించీ మాట్లాడా గానీ వీటి వెనుక ఉన్న మణిశర్మను మర్చిపోయానేవిటో! ఆ బిట్స్ కి ఇచ్చిన క్రెడిట్ మణిశర్మ ఖాతాలో వేసేస్తే సరి!మణిశర్మ సంగీతం బాగుంటుంది. ఉన్నంతలో కల్తీ లేకుండా!

మధురవాణి said...

ఈ పాటలోని సాహిత్యాన్ని అంత శ్రద్ధగా ఎప్పుడూ వినలేదు. చాలా బాగుంది. చక్కటి పాటని పరిచయం చేశారు. థాంక్స్.. :)

Vasu said...

ఇంతకు ముందు అంత గమనించలేదు

"విను గురూ, సత్య జిత్ రే సితారా, ఎస్ డి బర్మన్ కి థారా థెరిసా కీ కుమారా కదలి రారా"

ఇక్కడ చాలా బావుంది.

నాకు లిస్టు పాటలు అంత నచ్చవు. కానీ ఈ పాట వినగా వినగా బానే ఉంది.

లిస్టు పాటలు - ఒక విషయం అనుకుని దాని మీద రాసుకుంటూ పోవడం. కవితాత్మకంగా ఉండడం కంటే ప్రాస,విషయం ప్రధానం ఇలాటి పాటల్లో.
చంద్రబోస్ ఈ ప్రక్రియ లో దిట్ట. తొంబై అయిదు శాతం ఇలాటివే ఉంటాయి ఆయన పాటల్లో.
ఉదా: దిష్టి పాట (గంగోత్రి లో ),

PRASAD said...

ఈ సినిమా షూటింగ్ కలకత్తా నగరంలో జరిగే సమయం లో తొలిసారిగా ఈ పాట విన్న చిరంజీవి వేటూరి వారి సాహితీ పటిమకు ముగ్ధులై వారిని మద్రాసు నుంచో, హైదరాబాదు నుంచో గుర్తులేదుగాని ఫ్లయిట్ లో అర్జెంట్ గా రమ్మని కబురు పెట్టారట. సినిమా చిత్రీకరణ సమయాల్లో అప్పటికప్పుడు ఏవైనా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే రచయితలను పిలిపించి తగిన మార్పులు చేయించుకోవడం సినిమా పరిశ్రమలో సహజంగా జరిగే ప్రక్రియ. అలాంటి విషయమేదొ వుంటుందని భావించిన గురువుగారు కలకత్తా చేరుకున్నాక, చిరంజీవి వారికి వినమ్రంగా సాష్టాంగ నమస్కారం చేసి, పూలమాలతో సత్కరించినట్లు అప్పట్లో పత్రికల్లో చదివాను. వేటూరి వారు మన సమకాలికులు కావడం మన అదృష్టం. చిరంజీవి గారి విఞ్తకు వినమ్రతకు జోహర్లు. ఒక మంచి పాటను గుర్తు చేసిన సుజాత గారికి ధన్యవాదాలు.

ప్రసాద్ శర్మ, నరసరావుపేట మాజీ నివాసి.

సుజాత వేల్పూరి said...

మధూ, నువ్వు ఈ పాట సాహిత్యం శ్రద్ధవా ఇనలేదంటే ఆశ్చర్యంగా ఉంది తెల్సా! ఇప్పుడు వినే ఉంటావుగా! ఇహ అప్పుడే వదల్దు లే ఈ పాట! చిత్రీకరణ కూడా ఎంత బాగుందో చూడు.


వాసు గారూ,
చంద్ర బోస్ విషయంలో మీతో బ్రహ్మాండంగా ఏకీభవించేస్తున్నా! గంగోత్రి సినిమా అన్నా, పాటలన్నా నాకు భయమండీ :-))

ప్రసాద్ గారూ,
నిజమా! చిరంజీవి అభిరుచికి అభినందించాల్సిందే! సాధారణంగా హీరోలు పాటలో తమ పాత్ర ఎంతో ఆలోచిస్తారు గానీ ఇలాంటివి పట్టించుకోరుగా!

మీ పేరు పక్కన, చిరునామా చాలా బాగుందండీ

మధురవాణి said...

@ సుజాత గారూ,
సారీ.. సరిగ్గా చెప్పలేదు.. చిన్న correction.. నా ఉద్దేశ్యం ఏంటంటే ఈ పాట పల్లవి తెలుసు గానీ ఇంతవరకూ పాటంతా పూర్తిగా (శ్రద్ధగా) ఎప్పుడూ వినలేదన్నమాట.. మీరీ పోస్ట్ వెయ్యకపోతే ఎప్పటికి వినేదాన్నో మరి! :P
వీడియో చూశాను. కలకత్తా చాలా అందంగా ఉంది కదూ!
Yes.. తప్పకుండా మళ్ళీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలానే ఉంది పాట. Thanks! :)

GKK said...

మంచి పాటను మీరు పున: పరిచయం చేసిన తీరు బాగుంది. చాలా అందంగా చిత్రీకరించిన పాట కూడాను. చిరు class గా నటించాడు. వేటూరి మార్కు ప్రయోగాలు బాగా కుదిరాయి. మణి శర్మ 'రఘువంశ' కీర్తనను adapt చేసిన తీరు బాగుంది. అన్నీ మాస్ పాటలే కాకుండా ఒక్కటైనా ఇటువంటి పాట సినిమాలో ఉంటే బాగుంటుంది.

చింతా రామ కృష్ణా రావు. said...

ఆర్యా! నమస్తే.
ఈ క్రింది లింక్ తెరచి చదివి, మీ బ్లాగులో ప్రకటించడం ద్వారా మీబ్లాగ్ పాఠకులకు అవధానానికి రావాలనుకొనేవారికి వచ్చే అవకాశం కల్పించ గలరని ఆశిస్తున్నాను.
http://andhraamrutham.blogspot.in/2012/02/blog-post_06.html

Unknown said...

పాట గురించి చాలా బాగా రాసారండి.
మొదటిసారి ఈ పాట విన్నప్పుడు నన్ను బాగా ఆకట్టుకున్న "శరన్నవలాభిషేకం" గురించి కూడా చెప్పారు.
ఎన్నిసార్లు ఈ పాట విన్న ఆ పదంలో ఉన్న అందం ఏమిటో అర్ధం కాదు.
మంచి పాట గురించి ఇంతవివరంగా రాసినందుకు ధన్యవాదాలు.

శశి కళ said...

nijame udayam nundi ade aalochistoo...chaalaa baadagaa unnanu...ee job koodaa katti meeda saamu ayipoyindi....baagaa vraasaaru

Rajesh Devabhaktuni said...

ఈ పాత మహత్తరమైనది అనడంలో సందేహమే లేదు, విన్న ప్రతిసారి ఒళ్ళు పులకరిస్తుంది. అటువంటి పదాల అల్లిక, ప్రయోగం ఒక్క వేటూరి గారికే సాధ్యం, అయన తరువాత, ఇహ ఇటువంటి పాటలు తెలుగు సినిమాలో మృగ్యం. పాత ఆత్మ "కధనకుతుహాల రాగం" తరహాలో ఉంటుంది, మొత్తం అంతా అదే రాగం పోలికలో ఉండదు..! ఎవరైనా నాకు నచ్చిన తెలుగు సినిమా పాటలలో నుండి కొన్ని పాటలు చెప్పమంటే వెంటనే ఈ పాట కుడా చెప్తాను.

నిజంగానే ఈ పాటను అర్ధం చేసుకోవడానికి, ఆస్వాదించడానికి.... రావుగోపాలరావు గారు చెప్పినట్లు "కుతంత కళాపోషణ ఉండాలి". చిరంజీవి గారి పాటలలో కుడా చెప్పుకోదగ్గ పాటలలో ఇది తప్పనిసరి అని నా ఉద్దేశం.

శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ said...

అద్భుతమైన రచనలు చేసేరు వేటూరి. ఇది ముమ్మాటికీ నిజం. ఐతే నాణానికి బొమ్మా బొరుసూ ఉన్నట్టే కొన్ని అర్ధం పర్ధంలేని పాటలూ రాసేరు మరి. కొన్ని పాటలు రాయడానికి వారు కాస్త కష్టపడి కిట్టించీసిన(లెక్కలలో లాగ) రచనలూ లేకపోలేదు. ఐతే మానినదే మందూ, మనినదే ఊరూ అన్నట్టుగా పదిమందికి నచ్చేలా రాయగలవాడే మంచి రచయిత మరి.

srinu said...

sujatha gaaru

veturi amazing words

(venuvai vacchanu bhuvananiki
gaalinai veltanu gaganaaniki)

veturi koasam nenu

rajuvai poayadu bhavaaniki
bhavamai poayadu kavityanike

pradeep said...

"శృతిపరచిన ప్రియ శుక పిక ముఖ శుక రవళులలో"

deeni rtham vivarinchgalaru plzzz :)

Balu said...

వేటూరిగారి పాటకు మీరిచ్చిన వివరణ మరింత హత్తుకునేలా వుంది. అద్భుతం!

Raghuram Nakka said...

Ee pataki nenu kuda write up raddam anukunnanu.. idi chalaa bagundi.. kani inkaa details touch cheyalsindi.. meeru cheyagalaru... :)

Raghuram Nakka said...

@pradeep:
Sukamu ante chiluka
pikamu ante koyila
mukha sukha ante - anandam ga vati gontulatho (శుక రవళి కాదు సుఖ రవళి)
ravali - sound

chiluka koyilalu teeyani gonthu tho anandam ga padutunte tana gunde chappudu daniki layabaddam ga natyam chestunnattu ga undi.. aa nagaram lo viharistuu unte ani chepparu...

he feels like his heart is beating(dancing) according to the sweet sounds made by parrots and nightingales

Post a Comment