ముళ్ళపూడి వెంకట రమణ గారు మనకు దూరమై అప్పుడే ఏడాది (ఫిబ్రవరి 24)అవుతోంది. ఆయన చివరగా రచన అందించిన సినిమా శ్రీరామ రాజ్యం శతదినోత్సవం ఆయన తొలి వర్థంతి నాడే కావడం యాధృచ్ఛికం!
ఈ సందర్భంగా మిత్రులందరితో ఒక మంచి వార్త చెప్తా వినండి!
శ్రీరామ రాజ్యం శతదినోత్సవం రోజుని,రమణగారి తొలి వర్థంతి రోజుని ...ఆయన అభిమానుల కోసం చిరస్మరణీయంగా చేయాలని రచన శాయి గారు సంకల్పించారు.
శ్రీరామ రాజ్యం కోసం ముళ్ళపూడి వెంకట రమణ గారు రాసిన స్క్రిప్టు యథాతధంగా (సినిమా కోసం ఎడిట్ చేసింది కాదన్నమాట)పుస్తక రూపంలో వాహినీ బుక్ ట్రస్ట్ విడుదల చెయబోతోంది.
రమణ గారి స్క్రిప్టుతో పాటు సీనిక్ ఆర్డర్, బొమ్మలూ, స్వదస్తూరీ తో కూడిన బాపూ గారి స్టోరీ బోర్డూ కూడా కలిపి ఈ పుస్తకం నయన మనోహరంగా తనదైన శైలిలో రూపు దిద్దుకుంటోంది.
దాదాపు 400 పేజీలతో రాబోతున్న ఈ పుస్తకంలో 32 పేజీల వరకూ రంగుల్లో ఉంటాయట.
అంతే కాదు, శ్రీరామ రాజ్యంలోని పాటలన్నీ బాపూ దస్తూరీతో ఈ పుస్తకంలో లభిస్తాయి.
'
శ్రీరామ రాజ్యంలో కొన్ని చోట్ల సినిమా వేగంగా నడిచిపోయినట్లు అనిపిస్తుంది. 'ఇక్కడ ఎడిటింగ్ బాగా జరిగిపోయినట్లుంది" అనే భావం కలిగింది. ఈ పుస్తకం వల్ల ఆ "ఎడిట్ అయిపోయి ఉండొచ్చు" అనుకున్న సీన్లు కూడా మనం చదవొచ్చన్నమాట!
భవిష్యత్తులో ఏ సినిమా అయినా ఈ తరహా పుస్తకంగా ఎంత సమగ్రంగా వచ్చినా, వచ్చినా,అది బహుశా స్టోరీ బోర్డుతో వచ్చే అవకాశం లేదు. బొమ్మలతో కూడిన స్టోరీ బోర్డు తెలుగు దర్శకుల్లో బాపూకి మాత్రమే సొంతంగా మరి!
పుస్తకం విశేషాలు,పేజీలు,క్వాలిటీ అన్నీ చెప్పాను కాబట్టి, ధరను అంచనా వేసి రెడీగా ఉండండి మరి!
UPDATED
రచన శాయి గారి నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం
ఈ పుస్తకం లో పేజీలు 472. అందులో 40 పేజీలు రంగుల్లో ఉంటాయి. ధర రూ.800/-
మార్చి ఒకటి నుంచి ఈ పుస్తకం నవోదయ కాచిగూడ లో లభ్యం
37 comments:
మంచి శుభవార్త చెప్పారు సుజాత గారూ. నిజంగా అది అపురూపంగా దాచుకోదగ్గ పుస్తకమే అవుతుంది. శాయి గారి ఆలోచనకి జోహార్లు. మంచి ప్రయత్నం.
అన్నట్టు రమణ గారి వర్ధంతి ఫిబ్రవరి 24 కాదండీ 23.
ధర అంచనా వేశాను. మూడు రోజులు భోజనం మానేసినా బహుశా కొనలేనేమో.
ముళ్ళపూడి అన్నా బాపు అన్నా అభిమానమే. కొనడానికి సరసమైన ధర అంటే OK.
కానీ నా అభిమానాన్ని కేష్ చేసుకునే ప్రయత్నాలకి విరోధిని.
అలా ఎందుకు అనుకోవాలి బులుసు గారూ! వాహినీ వాళ్ళ పుస్తకాలు ధర ఎక్కువని అనిపించదు.క్వాలిటీ పాటించినపుడు ఖర్చులన్నా రావాలి కదా!
అభిమానానికి వెల కట్టలేం_______అంటుంటాం కదా! ఆ రకంగా అయితే వెల కట్టలేని పుస్తకమే ఇది. బాపూ రమణల మీద శాయి గారు అభిమానంతో వేస్తున్న పుస్తకమే!నా వరకూ నేను ఎంత ధరైనా కొనాలనే అనుకుంటున్నాను! కావలిస్తే ఒక రోజు తిండి మానేస్తాను :-))
పుస్తకం కొనడం కొనకపోవడం మీ ఇష్టం అనుకోండీ!
మంచి విషయం తెలియ జేశారు.
పుస్తకం పేపర్ క్వాలిటీ కూడా బావుంటుందని అని అనుకుంటున్నాను.
ఎంతయినా పర్లేదు నేను కొనుక్కోగలను కానీ నేనున్న చోట దొరుకుతుందో లేదో .
సుజాత గారి ఒక్కరోజు భోజనం ఖర్చు అంచనా వేస్తున్నాను :))
కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్
సూపర్ న్యూస్ చెప్పారండీ.. వెయిటింగ్ ఇక్కడా.. ;)
లలిత గారూ, :-))
నాది చాలా సాదా సీదా వెజిటేరియన్ భోజనమండీ! పుస్తకం వచ్చాకా ధర ఎక్కువుంటే...ఒక రోజు అలా పీజా హట్ కేసి వెళదామనుకుని మానేశానని సర్ది చెప్పుకోవాలి
అన్నట్టు లలితా, మీరున్న చోట దొరక్కపోతేనేం, దొరికే చోట మీకు మేమున్నాంగా :-)
ధర నాలుగు వందలు ఐదు వందల మధ్య ఉండొచ్చని విన్నానండీ
జిలేబి.
that's great news!
నిజమా! భలే వార్త చెప్పారే! వింటుంటేనే exciting గా ఉంది. తప్పకుండా కొనుక్కోవాల్సిన పుస్తకం.
శుభ వార్త చెప్పారండి. తప్పకుండ కొనుక్కోవాలి.
ఓహ్..థాంక్స్ సుజాత గారు
జిలేబీ గారు చెప్పిన ధరయితే ఎక్కువేం కాదు . అప్పట్లో బాపూ రమణలు పిల్లల కోసం తయారు చేసిన సంపూర్ణ రామాయణం పుస్తకం కూడా నూట యాభై కో రెండు వందలకో కొన్నట్టు గుర్తు. అయినా వంశీ పుస్తకాలు కొనటానికి అలవాటు పడ్డాంగా . ఇప్పుడు అయిదు వందలు పెద్ద ధరని పించట్లేదు
లలితా,
వంశీ పుస్తకాలు కొనటానికి అలవాటు పడ్డాంగా .
ఇప్పుడు అయిదు వందలు పెద్ద ధరని పించట్లేదు
_________________
గిల్లకుండా ఊరుకోరుగా :-))
జిలేబీ గారూ, అవునా! నేనే ఇంకా వినలేదన్నమాట అయితే!
సుజాత గారు,
ఇది చాలా సీక్రెట్ ఇన్ఫో. ఎవరకీ చెప్పకండేం!
చీర్స్
జిలేబి.
అలాగే, ఇది మనిద్దరి మధ్యే ఉంటుందని మాట ఇస్తున్నాను. :-))
Ramana gari first anniversary date 23rd andi..
Bapu-ramana gaarla veerabhimaanigaa, oka pustaka priyuraaligaa ee pustakam naa librarylo undaalsinde, will wait for it..
apprx. anywhere between 300 to 500 anukuntunna.
by the way, Vamsi gaari pustakaala gurinchi nijamgaa nijam.. anta avasarama anipistundi naaku personally!
శంకర్ గారూ, శ్రీ గారూ,
రమణ గారు తుది శ్వాస విడిచింది ఫిబ్రవరి 23 అర్థరాత్రి ఒంటిగంట తర్వాత! అందువల్ల అది 24 కిందే లెక్క! 24 నే పేపర్లో వార్త వచ్చింది...బ్రేకింగ్ న్యూస్ అంది!
శ్రీ గారూ, వంశీ పుస్తకాల విషయంలో చాలా మంది గోడు ఇదే! ఏముంది, బ్రాండ్ నేమ్ సెల్లింగ్ అన్నమాట! పైగా ఇంకో విషయం నాకు నచ్చనిది.....ఒక పుస్తకంలోని కథలకు మరో నాలుగు కథలు కలిపి ఒక కొత్త పుస్తకం వేసెయ్యడం.
మరి కొద్ది రోజుల తర్వాత ఈ పుస్తకంలోవి నాలుగు కథలకు మరో నాలుగు కథలు చేర్చి మరో పుస్తకం వేసెయ్యడం! ఇది ఏం న్యాయం? కొనే వాళ్లున్నారు కదాని...! ఎన్నని కొంటాం..మళ్ళీ మళ్ళీ అవే కథల కోసం!
మొత్తానికి చాలా మంచి ప్రయత్నం. ప్రింటింగ్ ఎ బుక్ బ్యూటిఫుల్లీ ఇస్ నాట్ అవర్ ఆర్ట్ ఇట్స్ కంప్లీట్లీ వెస్టర్న్ థింగ్ అనేవారు మా సార్. కానీ బాపురమణలవి ఈ మధ్య పుస్తకాలు పరిశీలిస్తే ఆయనన్న మాటకి ఓ ఎక్సెప్షన్ గా ఆ పుస్తకాలు చూపించాలి. అంత అందంగా ముద్రిస్తే డబ్బులవ్వవా మరి.
ఐదువందలైనా పెట్టి కొనితీరాల్సిందే ఈ పుస్తకాన్ని.
Great news. Happy to hear it. Thanks for sharing with us. :)
మంచి విషయం చెప్పేరండీ సుజాత గారూ.
ఈసారి ఇండియా వచ్చినప్పుడు ఈ పుస్తకం కొనుకుంటా.
పొద్దున్నే రచన శాయి గారు ఫోన్ చేసినప్పుడు కబుర్లలో చెప్పారు.దాదాపు తొమ్మిది రొజులు పైగా పూర్తిగా ఈ పుస్తక తయారీ లోనే మరి వేరే లోకం అంటూ లేక మునిగిపోయారుట.పుస్తకంలో 30 దాకా కలర్ షీట్స్ వుంటాయి.300 పేజీలు బాపు గారి స్టోరీ బోర్డ్ వుంటుంది.సినిమాలో పూర్తిగా రానిపాట స్క్రిప్ట్ కూడా పుస్తకంలో చూడవచ్చు.అలాగే బాపు చేతిరాతలో పాటలు పొందుపరిచారట.అంచేత పుస్తకం ధర మాత్రం 800 రూపాయలు వుంటుంది. ముళ్ళపూడి గారి మొదటి వర్థ్దంతి 24 ఫిబ్రవరికి పుస్తకం అందుబాటుకు వస్తుంది. అదీ సంగతి
సుధామ గారూ, శాయి గారు నాతో మాట్లాడిన కాసేపటికే మీ కామెంట్ రావడం బాగుంది. సరిగ్గా పధ్నాలుగు రోజుల్లో ఈ పుస్తకం కూర్చడం పూర్తి అయిపోయిందిట.
మీరు రాసిన విషయాలే పైన టపాలో పొందు పరిచాను.
మొత్తం 472 పేజీలు, 42 పేజీలు రంగుల్లోనూ ఉంటాయిట. నేనూ పుస్తకం కోసం ఎదురు చూస్తున్నా!
ధన్యవాదాలు
సుజాత గారు,
మాట్లేడాసారు, మాట్లాడేసారు మా సారూ మీ తోటీ నూ!!
జిలేబి.
జిలేబీ గారూ,
నేను ఎప్పుడూ మాట్లాడుతునే ఉంటాగా.? ఈ జిలేబీ చుట్ట(తాగే చుట్ట కాదు) లాంటి పజిలేంటబ్బా?
hi sujata garu
ramana garu valmiki ramayananni oka samakaleena drushya kavyam ga malachalani chese prayatname tappa
ramayananiki author matram kadu
valmiki ramayananni evaru modify cheyyaleru
anta andam ga radu
meevanni andravalla buddule tappa
@srinu....
మీ కామెంట్ కి, నా టపాకి,ఆంధ్రా బుద్ధులకు సంబంధం ఏమిటో అర్థం నాకు కాలేదు. మీకైనా అయిందా?
valmiki ramayananni evaru modify cheyyaleru ___________అని ఎవరన్నారూ?
anta andam ga radu_________ఏంటి? పుస్తకమా? సరే అలాగే!
meevanni andravalla buddule tappa____________అవున్నిజవే!
అన్నట్టు...బుద్ధీ జ్ఞానమూ ఉన్నాయి నాకు. అందుకే బాపూ గురించి పిచ్చి రాతలు నింపిన మీ రెండో కామెంట్ పబ్లిష్ చేయట్లేదు
Huhuhooooooooooooooooooooooooo gr8 news. So, fingers crossed for 24th. Thanks for the info
Hellow sujatha garu
Andravallu vachi telangana maade annattu
Valmiki raamayananni bapu ramanala ramayanamga maarchadaanni
Bharinchaleka poyanu
Ramayanni amitanga aradinche nenu
Kondarike antagattadanni bharinchaleka poyanu
Valmiki ramayananni kanulavinduga chupichadanedi konchem nijamaina mataga cheppukovachu
Ante teppa vere evarini uddeshinchi kadu
Nenu analochitanga chesina, oka ammayito amaryadaga comment chesiundalsindi kadu
Naa comments ni venakki tisukuntunnanu
Naa valla emaina badha kaligiunte nijanga kshaminchandi
బాపు రమణల శ్రీరామరాజ్యం పుస్తకం ఈ నెల 24 న విడుదలచేయడం , అదే రోజు చిత్రం శతదినోత్సవ తేదీ కావడం, ఆ రోజే రమణగారి ప్రధమ
వర్ధంతి ,అంతా కాకతాళీయం. మన ఎన్నో విషయాలకు డబ్బు ఖర్చు చేస్తున్నాం . ఇలాటి ఓ మంచి పుస్తకం కొనే విషయం లో ఆలోచించడం
"మనం తెలుగు వాళ్ళం" అని మరోసారి నిరూపించుకోవడమే అవుతుంది. మద్రాసులో శ్రీరామరాజ్యం విడుదలయితే మన తెలుగు వాళ్ళ కంటే
తమిళులే తమ పిల్లలను తీసుకొని మరీ వచ్చారట ! అందుకే ఈ సినిమాను తమిళంలోకి అనువాదం ఇటీవలే చేశారు. ధర Rs.800/-. ఆ ధరకు తగ్గ
విలువలతో (ఆర్ట్ పేపరుపై రంగుల ఫొటోలతో) పెద్ద సైజులో గట్టి బైండింగుతొ విదుదలవుతుంది. నేను అప్పుడే వాహినీ బుక్ ట్రస్ట్ కి డ్రాఫ్ట్ తీసేసుకున్నాను.
Book cost:800/-(with 40 colour pics inside).
Avilable from 25 th feb 2012 in Navodaya book store, kachiguda, hyderabad.
Grab your copy..:)
good information madam
అనిల్ రెడ్డి గారూ,
థాంక్యూ! పైన ఇప్పటికే వ్యాఖ్యల్లో మీరు ఇచ్చిన సమాచారమే పంచుకోవడం జరిగిపోయింది. మీరు వ్యాఖ్యలు చదివినట్లు లేరు.
పుస్తకం 25 న మార్కెట్లో లభ్యం కాదు. మార్చి ఒకటి తర్వాతే లభ్యం అని రచన శాయి గారిని అడిగితే తెల్సింది
ధన్యవాదాలు
సుజాత గారు,
నమస్కారాలు. మీ బ్లాగ్ సురవర ద్వారా పరిచయం ఐంది. నేను మీ బ్లాగ్ పుస్తకం కొన్నాను. పుస్తకం ద్వార కేవలం బ్లాగ్ గురించి పరిచయం అవుతుంది.
పుస్తకం రచన (లాంగ్వేజ్) కృతకంగా ఉన్నది. భాష సరళంగా ఉంటె బాగుంటుంది. మీ పుస్తకం ద్వార కొన్ని బ్లాగ్స్ సందర్శించాను. మనవాళ్ళ కామెంట్స్ హుందాగా ఉంటె బాగుంటుంది. చివరిగా మనమందరం తెలుగువారిగా పుట్టడం మన అదృష్టం . :) :)
Post a Comment