హొరున కురిసే మంచులో వెచ్చగా ఇంటిపట్టున కూచుని ఏదో ఒక డివీడీ చూసేద్దాం అనుకున్న ప్లాన్ ని కాస్తా మార్చేసి ...థియేటర్ లో సినిమా చూడాల్సిందే అని అప్పటికప్పుడు నిర్ణయించేసుకుని మంచు పూల వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ బిగ్ సినిమాస్ లో kai po che సినిమా కి వెళ్ళాం.
Kai Po Che అనే మాటని గాలి పటాలు ఎగరేసేటపుడు ఎదుటి వాడి గాలి పటం దారాన్ని కట్ చేసినపుడు విజయ సూచకంగా వాడతారట. బహుశా "నేను గెలిచాను" అనే అర్థం లో కావొచ్చు
ఎదుగుతున్న వ్యాపారం, గుజరాత్ (కథ అంతా అహ్మదాబాద్ లో నడుస్తుంది) భూకంపానికి కుప్పకూలడం....అక్కడి నుంచి సినిమా నెమ్మదిగా వారి జీవిత సౌధాల మార్గాల నుంచి నెమ్మదిగా వాళ్ల జీవితాల్ని ఆక్రమించిన మతం, రాజకీయాల వైపు నడుస్తుంది. ముగ్గురిలో క్రికెట్ ప్రేమికుడైన ఇషాన్,... అలీ అనే ముస్లిం కుర్రాడిలో దాగిన ప్రతిభను పసిగట్టి వాడిని మెరిక లా తీర్చి దిద్దాలనుకోవడం తో అనివార్యంగా ఆ కుర్రాడి కుటుంబానికి అండగా ఉండాల్సి రావడం చివరికి అతని జీవితాన్నే బలి తీసుకోవడం ఊహించని మలుపు...!!
రాజకీయాల్లోకి యువతను బలవంతంగా మళ్ళించి విద్వేషాలు రెచ్చగొట్టి ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనుకునే రాజకీయ నాయకులు వాళ్ల జీవితాలు ఎలా ముగిసినా....వీళ్ల జీవితాలతో మాత్రం వికృత క్రీడలు జరిపే తీరతారని దర్శకుడు జాగ్రత్తగా రుజువు చేస్తాడు.
చేతన్ భగత్ నవల 3 mistakes of my life ఆధారంగా తయారైన ఈ సినిమా కి స్క్రీన్ ప్లే అద్భుతంగా అమరింది. అసలే (చదువుకున్న) ఇండియన్ మిడిల్ క్లాస్ కల్చర్ ని చేతన్ భలేగా ఆవిష్కరిస్తాడాయె! సాధారణంగా సాగే నిత్య జీవితంలోని ఏ ఒక్క అంశాన్ని వదలకుండా దర్శకుడు ప్రెజెంట్ చేసాడనిపిస్తుంది. గాఢ స్నేహం, మత సహనం, విద్వేషం, బాధ్యత, నిర్లక్ష్యం, ప్రేమ, మోహం,కుట్ర, అవసరం,నిస్సహాయత,నిరాశ, ఇలా ప్రతి ఒక్కటీ ఏదో ఒక దశలో, ఏదో ఒక పాత్ర ద్వారా ఇవన్నీ జీవితంలో తప్పించుకోలేనివని నిరూపిస్తాడు.
ఆ ముగ్గురి అరమరికలు లేని స్నేహంతో మొదలు పెట్టి కథను నెమ్మదిగా మతం, రాజకీయాల వైపు ప్రేక్షకుడి కి తెలీకుండానే నడిపిస్తాడు. ఒకప్పుడు రక్తాన్ని పరుగులు పెట్టించిన ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మాచ్ నీ, గుండెలు అవిసిపోయేలా చేసిన గోధ్రా సంఘటనను కూడా ఒకే టెంపోలో జనం పెద్దగా ఆవేశపడకుండా న్యూస్ క్లిప్పింగ్స్ తో సరిపెట్టి మనోభావాలు గాయపడకుండా అభిషేక్ కపూర్ (దర్శకుడు) జాగ్రత్త పడ్డాడు. బాంబే సినిమాలో చూపినంత గా కూడా కల్లోలం ఈ సిన్మాలో కనిపించదు. గొడవల కారణాలని, ఆంతర్యాలను స్పష్టంగా ప్రేక్షకుడికి విశదీకరిస్తూనే, వాటి తాలూకు తీవ్రతను, ఉధృతిని అంతగా కనిపించనివ్వకుండా తీయడం గొప్పగా అనిపించింది నాకు
ఆ ముగ్గురు స్నేహితుల గాఢ స్నేహాన్ని అందంగా చిత్రీకరించాడు దర్శకుడు. దిల్ చాహతా హై లో అమీర్,రాహుల్, సయీఫ్ ల అరమరికలు లేని అద్భుత మైన బాండింగ్ గుర్తొస్తుంది ఓమి,ఇషాన్,గోవింద్ లను చూస్తుంటే! ఎన్నైనా చెప్పండి, మగ పిల్లల మధ్య ఉన్నంత గాఢ స్నేహం, లిమిట్స్ లేని స్నేహం, ఎలాటి అరమరికలూ దాపరికాలు, మతలబులు లేని స్నేహం ఆడపిల్ల ల మధ్య ఉంటుందా? ఏమో..సందేహమే నాకు!
ఇషాన్ గా వేసిన సుశాంత్ సింగ్ చాలా అందంగా ఉన్నాడు. చక్కగా చేశాడు కూడా! మంచి హీరో అయిపోయేలా ఉన్నాడు. కాస్టింగ్ ఎంత గొప్పగా ఉందంటే ఆ ముగ్గురూ తప్ప ఆ పాత్రలని ఇంకెవరూ చేయలేరేమో అన్నంత బాగా!
ఈ ఏడాది చూసిన సినిమాల్లో ఇంతవరకు ఇదే నచ్చింది నాకు !
వీలుంటే తప్పక చూడండి . మంచి సినిమా! నాకు నచ్చింది
14 comments:
మీ సమీక్ష చదివాక....చాలా ఆసక్తి కలుగుతున్నది, వెంటనే రెండు మూడు రోజుల్లో ఈ సినిమా చూసేయాలి. ముఖ్యంగా గుజరాత్ భూకంపం తర్వాత జరిగిన సాంఘీక, రాజకీయ మార్పులనగానే కాస్త ఆసక్తి గొల్పుతున్నది. థ్యాంక్స్.
ఇంకేంజేస్తం? గీ సైన్మగూడా జూసేస్తం. Thank you.
ఎన్నైనా చెప్పండి, మగ పిల్లల మధ్య ఉన్నంత గాఢ స్నేహం, లిమిట్స్ లేని స్నేహం, ఎలాటి అరమరికలూ దాపరికాలు, మతలబులు లేని స్నేహం ఆడపిల్ల ల మధ్య ఉంటుందా?
undadu :)
I didn't expect that Abhishek kapoor eey cinemani intha baga teesthadani..Though I read novel,but still naku intensifying ga anipinchindi after watching the movie because of wonderful cast and also superb screenplay..Heights of awesomeness...Tnq Sujatha garu for u r review on this movie...:) :)
అయ్య బాబొయ్ ! చూసేసారా ? సూపర్ మీరు. 'మాంజా' పాట బావుంది కదా. సుశాంత్ ని చిన్నప్పుడ్నించీ పవిత్ర రిష్తా లో చూస్తున్నా. మంచి నటుడు. 'పవిత్ర రిష్తా' వదిలేసి చాలా మంచి డెసిషన్ తీసుకున్నాడు.
మీ బ్లాగ్ న్యూ లుక్ చాలా బావుంది.
కమల్,
గోధ్రా సంఘటనను, ఆ తర్వాతి పరిణామాలను కూడా ఎక్కువ టెన్స్ లేకుండా... టెన్స్ కాకుండా కూల్ గా చూపించాడు. పరిస్థితి ఇంటెన్సిటీ చెప్తూనే! నాకు అది బాగా నచ్చింది.
థాంక్యూ
Indian Minerva garu
జల్ది చుడాలె మరి :-)
Thanks
Vasu garu,
కదా, నాకూ అలాగే అనిపిస్తుంది. చెప్పాను గా దిల్ చాహతా హై సినిమాలో ఆ ముగ్గురి స్నేహం భలే నచ్చుతుంది నాకు.
Vajra,
I have the novel but I did not happen to read it :-)
Yes..wonderful cast and also superb screen play... Liked it very much .
Thanks
Sujata గారూ, ఇండియా లో ఉండగా అసలు సినిమాలు తక్కువగానే చూసేదాన్ని! ఏమిటో..ఇక్కడ మాత్రం అదో వీకెండ్ యాక్టివిటీ లా పెట్టుకుని చూస్తున్నాం! సో, మీరూ చుసేశారా?సూపర్ :-))
ఏమిటి, సుశాంత్ టీవీ ప్రాడక్టా అయితే? నేను హిందీ సీరియల్స్ కి కొన్ని వేల మైళ్ల దూరం. (మా అత్తగారు వస్తే మాత్రం తెలుగు సీరియల్స్ కి కంపెనీ ఇస్తా అప్పుడప్పుడు) అందువల్ల నాకు సుశాంత్ కొత్త ఫేసు! కానీ బాగా చేసాడు. మంచి ఫ్యూచర్ ఉన్నట్లు తోస్తోంది.
పాటలు బాగున్నాయి. అన్నీనూ! వాళ్ళ ముగ్గురి మీద తీసిన పాట (ట్రైలర్ లో వాడింది ) అన్నిటికంటే నచ్చింది నాకు.
Sujata garu,
ledu. inka choodaledu. songs youtube lo choostunna. BTW inka memu 'Jai netflix' anledu. May relocate soon.
The review is good as always telling about the theme and at the same time not telling the story eventually creating interest to watch the movie. But one thing to correct - cast in Dil chahta hai is "Akshay khanna" not Rahul apart from Aamir & saif
-Purnima
Your review is good as always - telling the theme, suggesting the story outlines and creating interest to watch the movie. One thing to correct in the post - cast of Dil Chahta hai is Akshay khanna not Rahul apart from Aamir & saif.
Purnima,
oops...you are right ! It was Askhay...but not Rahul :-)
I always get confused between Rahul and Akshay..! This time too :-)
I stand corrected. Thank you !
Post a Comment