June 5, 2020

జీవితం@ఆన్లైన్


జీవితం@ఆన్లైన్ 





లాక్ డౌన్ ప్రస్తుతానికి అయ్యిందా?

మళ్ళీ ఎప్పుడు పెడతారో, ఏ రోజు 8 పీ ఎం కి, పీ ఎం వచ్చి "ఇంకో గంటలో లాక్ డౌన్" అని చెప్పేహేహేస్తాడో తెలీదాయె

పిల్లలంతా స్కూలు కోసం పిచ్చెక్కి పోయి ఉన్నారా?
మొన్నొక రోజు స్కూలు నుంచి ఈ మెయిలొచ్చింది. "జూ ఒకటో తారీకు నుంచి స్కూళ్ళు మొదలు. " అనుంది మొదటి లైను.
నిజంగా ఎగిరి గంతేసేశాను. తరవాత చదవడం కొనసాగించాను ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ!

"ఈ ప్రయాణంలో మీ సహకారం మరవలేనిది .(లక్షలు లక్షలు ఫీజులు కడుతుంటే ఆ మాత్రం మెచ్చుకోరూ),తల్లిదండ్రుల సహకారం, ప్రేమ, స్నేహం పిల్లల్ని చదువులో ముందుకు నెడతాయి..అదీ ఇదీ..."

మూడు పేరాలు ఇదే సోది

స్కిప్ చేసి కిందకు పోయానా? "కాబట్టి, మీరు మీ పిల్లల చదువు మీద ఒక కన్నేసి ఉంచండి. వాళ్లకు అర్థం కాని విషయాలు మీరు డిస్కస్ చేయండి.. (ఒకటో క్లాసు రెండో క్లాసు సిలబస్ వరకూ ఒకే,పదో క్లాసు మేథమెటిక్సూ, పన్నెండో క్లాసు ఫిజిక్సూ మన వల్లేమవుతుంది?) జూన్ ఒకటి విడుదల

..... ఆన్ లైన్ క్లాసెస్" అనుంది

ఈ హడావుడంతా "ఆన్ లైన్ క్లాసుల" కట

గొప్ప నీరసం వచ్చి పడింది

నిజానికి పిల్లలంతా స్కూలు కు పోవాలనీ, స్కూలు స్నేహితులని కలవాలనీ క్లాస్ రూం లెర్నింగ్ కోసం తహ తహ లాడుతున్నారు. కానీ ఏం చేస్తాం? పరిస్థితులు అనుకూలించట్లేదు

సరే, క్లాసులు కోసం లాప్టాపులూ అవీ రెడీ చేసుకుని పిల్లలు కూచుంటారా, సగం మంది టీచర్లకు లాగిన్ ఎలా అవ్వాలో మర్చిపోవడమో, లింక్ ఓపెన్ కాక పోవడమో ఏదో జరుగుతుంది. ఈ  లోపు పిల్లకాయలు వీడియోలు, ఆడియోలు ఆఫ్ చేసి ప్రైవేట్ గా ఫోన్లలో ఫ్రెండ్స్ తో కాల్సూ, చాటింగ్సూ

సైన్స్ ప్రాక్టికల్సూ అవీ ఖాన్ అకాడమీ లో వీడియోలు చూడండి అనే మెసేజ్ చూడగానే అసలు పిల్లలంతా దొర్లి దొర్లి నవ్వడం

ఈ లోపు ఏ పేపర్ వాళ్ళో ఫోన్ చేసి "ఎక్స్ పర్ట్ ఒపీనియన్ కావాలి. పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు కదా, వాళ్లతో పేరెంట్స్ ఎలా ఉండాలో చెప్పండి" అని

"ఏవుందీ, పిల్లలకు మధ్య మధ్యే హెల్త్ డ్రిక్స్ సమర్పయామి. బ్రేక్ లో కబుర్లు చెప్పాలి. క్లాసయ్యాక పిల్లలు ఏడుస్తుంటే వాళ్ళని ఓదార్చాలి. ఆ తర్వాత పోయి అంట్లు తోముకోవాలి. ఆ పైన టైముంటే ప్రైమ్‌లో ఏదైనా సినిమా చూడాలి"  లాటి సలహాలేవో చెప్పాననుకోండి


ఇటు తిరిగి చూస్తే మొబైల్ లో మెసేజ్ లు "ఆన్ లైన్ జిం, ఆన్ లైన్ మ్యూజిక్కూ, ఆన్ లైన్ జుంబా క్లాసుల్లో చేరండి. మీకొక్కరికే 75 శాతం డిస్కౌంట్ కలదు" అని

కరోనా నో ఏం పాడో గానీ జీవితం మొత్తం ఆన్ లైన్లోకి పోయి కూచుంది.




పోనీ జనమేమైనా బయట జాగ్రత్త్తగా ఉంటార్రా అంటే లేదాయె. మాస్క్ కట్టుకుని పక్క వాళ్ల వొళ్ళో కూచున్నా పర్లేదన్నట్టు ఉంటున్నారు.  పైగా ఆ మాస్క్ మెళ్ళో వేసుకు తిరుగుతారు అదేదో కాసుల పేరల్లే.

లేదా గడ్డం మీద ఎవరో గుద్దితే  కట్టు కట్టుకున్నట్టు, గడ్డానికి తగిలించుకుని తిరగడం

నిన్న సూపర్ మార్కెట్లో ఒకాయన మాస్క్ లేకుండా వచ్చి, అదేమంటే "జస్ట్  ఒక పాల పాకెట్ కోసం వచ్చాను. దానికే మాస్క్ కావాలా?" అని వాదించాడు

ఆదివారం వస్తే "రేపటి నుంచి కోళ్ళు ఈ ప్రపంచంలో ఉండవు" అనే ప్రకటన ఇందాకే వచ్చినట్టు చికెన్ షాపుల దగ్గర ప్రజలు

అదేమంటే "మాస్కుంది గా" అనడం

సోషల్ డిస్టెన్స్ ని పట్టిచుకోకుండా పది మాస్కులు కట్టుకున్నా ప్రయోజనం లేదురా నాయనా అని ఏ భాషలో చెప్తే ఎక్కుతుందో తెలీట్లేదు

జనం ఈ రకంగా ఉంటే, కరోనా పాప ఎప్పుడు వెళ్ళి పోతుందో స్కూళ్ళు ఎప్పుడు తీస్తారో అంతా అగమ్య గోచరం.

ప్రస్తుతానికి స్వస్థి



11 comments:

GKK said...

నమస్తే సుజాత గారు. మీరు కొన్నేళ్ల విరామం తరువాత తిరిగి బ్లాగు లోకం లోకి రావడం మీ రచనలను అభిమానించే మాకు సంతోషం కలిగిస్తుంది.

తరచు గా వ్రాయండి.

Surabhi said...

Oh my! oh my! Can not believe my eyes! You are back Sujatha garu. Very very happy to see your post

వేణూశ్రీకాంత్ said...

ఏ భాషలో చెప్పినా అర్ధం కాదండీ అంతే :-) కేసులు వాటి మానాన అవి పెరుగుతూనే ఉన్నాయి జనం తిరిగేస్తూనే ఉన్నారు. ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన రాలేదు ప్రజలకి.. ఇదంతా ఓ కొత్తగా ఏదో వేలం వెర్రిలా చేస్తున్నారే తప్పించి రూట్ కాజ్ అర్థం చేస్కుని నడుచుకునే వాళ్ళు చాలా తక్కువ.

సుజాత వేల్పూరి said...

GKKగారూ,

తప్పకుండా రెగ్యులర్ గా రాయడానికి ప్రయత్నిస్తానండీ

సంతోషం మిమ్మల్ని కలవడం ఇక్కడ మళ్ళీ

సుజాత వేల్పూరి said...

సురభి గారూ, హాయ్ హాయ్, ఎలా ఉన్నారు?

కామెంట్ మోడరేషన్ ఉందన్న సంగతి మర్చి పోయాను. చూడండి బ్లాగ్ రాయడం మానేశాక బ్లాగర్ ఎలా పని చేస్తుదో కూడా మర్చే పోయాను

తరచు గా రాయడానికి ట్రై చేస్తాను. నన్ను గుర్తు పెట్టుకున్నందుకు థాంక్స్

సుజాత వేల్పూరి said...

నిజం వేణూ, లాక్ డౌన్ ఎత్తేశాక మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది. లాక్ డౌన్ ఎత్తేస్తే కరోనా పోయినట్టే అనుకుంటున్నారల్లే ఉంది జనం

వాళ్ల తో పాటు ఇంట్లో అందరికీ రిస్కే అన్న సంగతి గుర్తు పెట్టుకోవట్లేదు

జనానికి జ్ఞానం వచ్చే సరికి కరోనా పోతుందేమో :-)

నేస్తం said...

చాలా లిస్ట్ ఇచ్చారు..మెల్లగా చూడాలి...చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తున్నా..బాగున్నారా..

సుజాత వేల్పూరి said...

హల్లో హల్లో నేస్తం

బావున్నాను. మీరెలా ఉన్నారు?
నెమ్మది గా ఎంజాయ్ చేస్తూ చూడండి. అన్నీ మీకు నచ్చే సినిమాలే

తెలుగోడు_చైతన్య said...

ఆట కాస్త వేట అయింది సుజాతగారు జింకవలే పరిగెత్తాల్సి వస్తుంది... అందరికి...😷😨😣

సుజాత వేల్పూరి said...

చైతన్య...

హ హ అవును, అలాగే ఉంది పరిస్థితి

jyothi said...

Hi sujata Garu anukokunda ee post chusanu
Very happy you are back into blogs

Post a Comment