డియర్ ఫ్రెండ్స్,
సారంగ ఆన్ లైన్ పక్ష పత్రికలో నేను గత పదమూడు నెలలు గా "పల్నాటి వాకిట్లో" శీర్షిక తో కథలు రాస్తున్నాను
మీలో కొందరైనా చూసే ఉంటారు
పల్నాడు ప్రాంతంలో , నరసరావు పేట లో పుట్టి పెరిగాను. అక్కడి వాతావరణం, జనం, జీవితం, సంస్కృతి, ఉన్నదున్నట్టు మాట్లాడే తత్వం, ఆత్మ గౌరవం నిండిన స్త్రీలు, కష్టపడి బతికే స్త్రీలు, నేల మీద ప్రేమ.. ఇలాటి అంశాలతో కథలు రాస్తున్నాను.
ఇలా రాయక పోతే , కొన్నాళ్లయ్యాక నిజంగా అక్కడి మాటలు, ఆ మనుషులు ఇవన్నీ మర్చిపోతానేమో అనిపించింది
సిటీ మనకు చేసే మోసం ఇది
మనల్ని, మన ప్రవర్తన,మాటలు అన్నిటినీ మాడిఫై చేస్తుంది సిటీ
నేను పల్లెలో పుట్టి పెరగక పోయినా, నిత్యం మా నరసరావు పేటకు వచ్చి పోతుండే పల్లె జనాలు, మా చుట్టూ ఉండే గ్రామీణ వాతావరణాన్ని చూస్తూ పెరిగిన ప్రత్య్కష సాక్షిగా ఈ కథలు రాశాను
ఒక్కొక్కటి గా ఇక్కడ కూడా ప్రచురిస్తాను
చదివి మీ అభిప్రాయాలు చెప్తారని కోరుతున్నా
రేపటి నుంచి వారానికి ఒకటి చొప్పున ఇక్కడ పబ్లిష్ చేస్తాను.
థాంక్ యూ
0 comments:
Post a Comment