February 26, 2012

శ్రీరామ రాజ్యం పుస్తకం..కాసిన్ని కబుర్లూ,బొమ్మలూ!


నిజంగా ఈ పుస్తకం చదవడానికంటే చూడ్డానికే ఎక్కువ టైము పట్టేట్టుంది. బాపు ప్రతి దృశ్యానికీ గీసుకున్న బొమ్మలూ, రాసు కున్న రాతలూ ఇవన్నీ హడావుడిగా పేజీ తిప్పి వదిలేయలేడానికి కుదరదు. కొంచెం కొంచెంగా ఊరించుకుంటూ ప్రతి పేజీ నెమ్మదిగా పూర్తి చేసి, తర్వాతి పేజీకి వెళ్ళాల్సిందే!



సినిమాలో  ఉండవలసిన దృశ్యాలు ఇందులో చాలా ఉన్నాయి. అవి సినిమాలో లేకపోవడం వల్ల "రమణ మార్కు" సినిమాలో కొంత వరకూ తగ్గి పోయిందని కూడా అనిపించింది ఈ సీన్లు చదువుతుంటే!



సీత కు ఊర్మిళ తల దువ్వుతుంటే మిగతా చెల్లెళ్ళూ పక్కనే కూచుని అడవిలో సంగతులూ, అక్కడ వాకిలి ఎవరు ఊడ్చేవారూ,ముగ్గెవరు పెట్టేవారు,తల దువ్వుకుంటే అద్దం ఉంటుందా వంటి ప్రశ్నలు వేయడం..అక్క చెల్లెళ్ళు కలిసి కబుర్లు చెప్పుకోవడం ...దృశ్యం చాలా బాగుంది చదువుతుంటే!


ఆ సీన్ ఉండుంటే బాగుండనిపించింది. ఇలాగే మరి కొన్ని సీన్లు! పాటలు!




చెప్పడం కంటే బొమ్మలు చూడ్డం, పుస్తకం తెచ్చుకుని చూడ్డం, చదవడం బాగుంటుంది. అందుకే ఇంతకంటే ఏమీ రాయడం లేదు.


                                                          తాంబూల రాగాల ప్రేమామృతం
                                                          తమకించి సేవించు తరుణం

17 comments:

వేణు said...

‘శ్రీరామరాజ్యం’ పుస్తకావిష్కరణ విశేషాలు పేపర్లలో వచ్చిన రోజే మీ పరిచయం రావటం బాగుంది. ఇచ్చిన ఫొటోలూ బొమ్మలూ బాగున్నాయి. కానీ మెమెంటో లాంటి అంత పెద్ద పుస్తకానికి ఇంత చిన్న పరిచయం రాయటమే ఏమంత బాగా లేదు.

సినిమా నిడివి కోసం అన్యాయంగా ఎడిట్ అవ్వని రమణ గారి సంపూర్ణ స్క్రిప్టు కదా... అలాంటపుడు రమణ మార్కు సంభాషణల చమక్కులను ఒకటి రెండయినా కోట్ చేయకుండా ఈ పుస్తకం గురించి ఇంత క్లుప్తంగా, ముక్తసరిగా రాయటం అన్యాయం కదూ?

‘మెమెంటో లాంటి పెద్ద పుస్తకం’ అని ఎందుకన్నానంటే నిన్నటి సాక్షి సినిమా పేజీలో ఈ పుస్తకం గురించీ, దీని ఆవివిష్కరణ గురించీ ఒక్క మాట మాత్రం కూడా ప్రస్తావించకుండా వార్త రాసేశారు. మరి బాపు, అక్కినేని, బాలకృష్ణ తదితరుల చేతిలో ఉన్న శ్రీరామరాజ్యం పుస్తకాల సంగతీ? అవి ‘శతదినోత్సవ జ్ఞాపికలు’ అట!
లింకు చూడండి- http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=36857&Categoryid=2&subcatid=26

A Homemaker's Utopia said...

తప్పకుండా చదివి భద్రపరుచుకోవలసిన పుస్తకం...బాపు బొమ్మల కోసమైనా కొనాలి..Thank you for the nice post.

రాజ్ కుమార్ said...

wow... super..
thnQ so much..sujata garu

Sree said...

800 is a bit high but I guess I will go for it after some thought.

Anonymous said...

ఎనిమిది వందల రూపాయలంటే చాచి లెంపకాయ కొట్టినట్టైందండీ నాకు. ఆ డబ్బుతో నేషనల్ బుక్ ట్రస్ట్ వారి ఙ్ఞానపీఠ్ రచయితల అనువాదాలు ఇరవైపుస్తకాలు కొన్నాను ఈ మధ్య

చాణక్య said...

'నను గోడలేని చిత్తరువుని చేసి వెళ్లిపోయిన నా వెంకట్రావు కోటికోట్ల జ్ఞాపకాలకు సభక్తికంగా' - బాపు.

కళ్లు చెమర్చాయండీ. మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

Anonymous said...

తగునా? మీకిది అసలు తగునా?! ఇలా ఊరించ తగునా?

శేఖర్ (Sekhar) said...

పుస్తకాన్ని బొమ్మల తో సహా కనుల విందు గా పరిచయం చేసినందుకు ధన్యవాదాలు

కమల్ said...

" ఎనిమిది వందల రూపాయలంటే చాచి లెంపకాయ కొట్టినట్టైందండీ నాకు. "

ఇలాంటి పుస్తకాలు సామాన్య ప్రజలకు పెద్దగా ఉపయోగపడక పోవచ్చు, కాని సినీ పరిజ్ఞానానికి చెందిన పుస్తకాల ఖరీదు అంత స్థాయిలోనే ఉంటాయి, ఇవి కేవలం సినీ పరిశ్రమలోకి రావాలనుకొనేవారికీ..ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ విధ్యార్థులకు బాగా ఉపయోగపడే పుస్తకం. మన తెలుగులో ఆ మద్యన కొన్ని పాత చిత్రాలకు ఇలానే పుస్తకాలు వచ్చాయి కాని తర్వాత ఆగిపోయాయి. హాలీవుడ్‌లో ప్రతి సినిమాకు ఇలానే స్క్రిప్ట్, తెరవెనుక జరిగిన కఠోరశ్రమలను కూర్చి ఒక పుస్తకంగా వెలవరిస్తారు,వాటి ధర కూడ ఎక్కవ స్థాయిలోనే ఉంటుంది, అలానే ఈ శ్రీరామరాజ్యం పుస్తకం కూడాను..కాబట్టి అంత ధర ఉండటంలో ఆశ్చర్యపోవనవసరం లేదు.

అయినా బాపు గారి గీతలు..రమణ గారి రాతలతో ఉన్న పుస్తక వెల గురించి ఆలోచించాలా....?? కొనయడమే..!!

సుజాత వేల్పూరి said...

బాపు గారి గీతలు..రమణ గారి రాతలతో ఉన్న పుస్తక వెల గురించి ఆలోచించాలా....?? కొనయడమే..!!____అవునండీ! చక్కగా చెప్పారు. ఆ కారణమొక్కటి చాలు కొనడానికి!

Vasu said...

ఇంకొన్ని బొమ్మలు పెడితే మీ సొమ్మేం పోయిందండీ :)

సినిమా లో అంతగా పట్టించుకోనివి ఇక్కడ తీరికగా , స్పష్టంగా చూడచ్చు .. స్టోరీ బోర్డు తో పాటు ..


అన్నట్టు నేను పిల్లల రామాయణం కోసం వెతుకుతున్నాను తెలుగు లో.. బాపు బొమ్మల రామాయణం వచ్చిందా ?? ఎవరన్నా చదివి ఉంటే ..చెప్పండి.

నేను భాగవతం కొన్నా కానీ క్వాలిటీ బాలేదు. మరీ క్లుప్తంగా ఉంది.. చందమామ లో రామాయణం బావుంది కానీ పుస్తకం గా రాలేదు అనుకుంటా...ఆంగ్లం లో మాత్రం పుస్తకం గా వచ్చింది.

శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ said...

మంచి విషయం సుజాత గారూ, అభినందనలు

బాపూ, రమణల గురించీ వారి శ్రీరామరాజ్యం పుస్తకం గురించీ చదివిన తదుపరి తమాయించుకోవడం కష్టమై బాపుగారిని గురించి ఈ విధంగా అనాలనిపించిది.


చతురాంగనలసేయు చతురాస్యు చతురతన్
మీరు చాతురిగొన్న ధీరుడీవు
దశకంఠ రిపుగాధ విశదమౌ చిత్రాల
మేలు మల్చిన వాల్మీకివీవు
దొమ్ముసేయగ మట్టిబొమ్మలంపినయట్టి
శాలివాహనుకుర్వి సాటివీవు
ఒల్లనల్ వెలితెరన్ మల్లడింపగసేయ
పుడమి పుట్టిన కళాపూర్ణుడీవు

బొమ్మలను సేయు విద్దె నీ సొమ్ముకాదె
గుమ్మ సొబగిమ్మడింప నీ బొమ్మకాదె
బొమ్మలకు దమ్ములూదేటి బెమ్మయేని
దమ్ములిడనేర్వ నీవు నీ తమ్ముడవడె

జవహర్ గుత్తికొండ said...

సుజాత గారు,
ఎమ్బీఎస్ గారు గ్రేట్ఆంధ్ర లో ఒక ఆర్టికల్ రాసారు రమణ గారి ప్రధమ వర్ధంతి ని దృష్టిలో పెట్టుకుని. ఈ బుక్ గురించి కూడా...
http://telugu.greatandhra.com/mbs/feb2012/27b_02_12_mbs.php

http://telugu.greatandhra.com/mbs/feb2012/27c_02_12_mbs.php

Country Fellow said...

I too lay my hands on a book :-) First thanks for the previous post

రాధేశ్యామ్ రుద్రావఝల said...

సుజాత గారూ..!నమస్కారం..!!
మీ బ్లాగు, అందులోవిషయాలూ చాలా బాగున్నాయి.

మీరు నాబ్లాగు (www.radhemadhavi.blogspot.com) లో పెట్టిన కామెంట్ కు రిప్లై మీ మెయిల్ ఐడి తెలియక ఇక్కడ వ్రాస్తున్నాను. ఏమనుకోకండి.

మీ దగ్గర పాత యువలు వున్నాయా..!! నాకు వపా గారి బొమ్మలు శ్రీ శ్యామ్ నారాయణ్ గారి వద్దనుంచి వచ్చాయి. అలాగే ’యువ’ లు కూడా సాఫ్ట్ కాపీలకి మార్చారు. మీమెయిల్ ఐడీ ఇస్తే నాదగ్గర వున్న యువ సాఫ్ట్ కాపీల జాబితా పంపుతాను.
నాకు యువ 1966 ఆగష్టు సంచిక లోని 60 -70 పేజీ నెం లు కావాలి. దానిలో మొఘలు దర్బారు కుట్రలు అనే సీరియల్ పేజీలు (నాదగ్గర లేనివి)ఉన్నాయి. నాలుగు భాగాల ఆ సీరియల్ ని నేను పిడిఎఫ్ రూపంలోకి మార్చాను కానీ ఈ పేజీలులేవు.
అవకాశం వుంటే radhemadhavi@gmail.com కు పంపగలరు.
ముందస్తు ధన్యవాదాలతో..
- రాధేశ్యాం

హరేఫల said...

శ్రీరామరాజ్యం పుస్తకాన్ని, మొన్న రాజమండ్రీ వెళ్ళినప్పుడు శ్రీ"సురేఖ" అప్పారావుగారి దగ్గర చూశాను. మా లైబ్రరీ కి కొనాలని ఉంది. ఈ నెల "రచన" లో చదివాను. ఆ పుస్తకానికి proof reading చేసింది, మన వేణూ ట. మీతోనూ, వేణూ తోనూ పరిచయం ఉండడంతో నా లెవెల్ పెరిగిపోయింది.

Anil Piduri said...

నిజమేబాపు హస్తవాసి- ఉన్న
ప్రతి పేజీ
ఒక పుస్తకముతో&
ఒక కళాఖండముతోనూ సమానము సుజాతగారూ!
ఒక చూపు చూసేసి, తిప్పేసేటంత "వీజీ" కాదు.

Post a Comment