ఒక చల్లని సాయంత్రం వేళ...వీనుల విందైన సంగీతం వింటూ, ఆ తీయని స్వప్నంలోకి జారిపోతూ పరిసరాలు మరచి పరవశించడం కంటే జీవితానికి సార్థకత ఏముంది?
అలాటి అవకాశాలు నిజానికి నేను ఒక్కటీ వదులుకోను.సంగీతం విషయంలో మరీ ముఖ్యంగా!
God of Indian violin శ్రీ ఎల్ సుబ్రహ్మణ్యం, వారి కుమారుడు అంబి సుబ్రహ్మణ్యంల కచేరీ చూసే అదృష్టం నాకు మొన్న ఆదివారం వరకూ పట్టలేదు.
నిజానికి నేను ఆయన కంటే ఆయన కొడుకు అంబి ప్రోగ్రాం చూడాలని కలవరిస్తున్నాను చాలా రోజులుగా!
హైద్రాబాదు లో ఇలాంటి అవకాశాలు కొద్దిగా అరుదనే చెప్పాలి.
అంబి ని నాకు పరిచయం చేసింది మిత్రులు శ్రీ శ్రీనివాస కుమార్ గారు(జీవితంలో కొత్తకోణం బ్లాగర్) .
యూ ట్యూబ్ వీడియోలు పంపి, అంబి ని తెచ్చి మా నట్టింట్లో సింహాసనం వేసి ప్రతిష్టించారు. అంబి వయొలిన్ తో మేము పీకల్లోతు ప్రేమలో కూరుకు పోయాం!
ఆయన పంపిన వీడియో ని నా ముఖ పుస్తకం గోడ మీద ఈ మధ్య పంచుకున్నపుడు, త్వరలోనే మాకు అతి దగ్గర్లోనే శ్రీ ఎల్ సుబ్రహ్మణ్యం, అంబి సుబ్రహ్మణ్యం ల వయొలిన్ కచేరీ జరగబోతోందని శుభవార్త చెవిన వేసి పుణ్యం కట్టుకున్నారు శ్రీ జంపాల చౌదరి! ఆగస్టు 5 సాయంత్రం నా స్వప్నం నిజమైంది. నాకు పదడుగుల దూరంలో కూచున్న అంబి సాక్షాత్తూ తుంబురుడో నారదుడో దిగి వచ్చినట్టు తానే సంగీత స్వరూపమై భాసిస్తూ అంబి వయొలిన్ తరంగాలలో ముంచెత్తి, మంత్ర ముగ్ధురాల్ని చేసి కట్టి పడేసిన ఆ అనుభూతి ఇంకా మనసు ఫలకం మీద అలాగే నిలిచి ఉంది. ఇంతింతై, వటుడింతయై అన్నట్లు పసివాడుగా కనిపిస్తున్న ఆ సంగీతాంబుధి కచేరీ మొదలైన కాసేపటికీ సభికులందరినీ తనలో ఐక్యం చేసేసుకున్నాడు. సందేహం లేదు, సంగీత జగత్తుని ఈ యువరాజు రారాజై,చక్రవర్తై పరిపాలించి తీరతాడు ! The whole program was just an eternal journey into the ocean of music..! . శ్రీ సుబ్రహ్మణ్యం గురించి ఇక ప్రత్యేకంగా చెప్పేదేముంది...
5 comments:
అమెరికాకు మీరు వెళ్ళిన కొద్దికాలానికే ఇలా మంచి కార్యక్రమం వీక్షించగలిగారన్నమాట! ప్రేక్షకులను సంగీత సాగరంలో మునకలేయించిన తండ్రీ కొడుకుల కళా ప్రతిభ ప్రశంసనీయం.
అయితే- సంగీత సాగరంలో తప్పిపోయిన మీ అనుభూతులను మాత్రం మీరు క్లుప్తంగానే చెప్పినట్టనిపిస్తోంది!
భారతీయులకు సంబంధించిన ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల వివరాలు స్థానిక పత్రికల్లో రిపోర్ట్ అవుతాయా?
ఈ వీడియో ను చూసి చాలా చాలా ఆనందించాను. మీకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
subrahmanyaM gAri gurinchi vinnAm gAnI...Ayana son gurinchi vinaDam ippuDE madam..
thanks for sharing.
father son duo in perfect sync. ఈ దృశ్యకం లో వినిపించింది గౌరి మనోహరి అనుకుంటాను సుజాత గారు. nice post.
Hai Sujata garu,
na peru sri.maa akka peru kuda sujata (lokam antatikii..naaku rakshasi ledni)
Just wanted to share this amazing kid's performance clips since you seem to really appreciate good music!
ee abbayi washington DC area lo untadu..adbhutam..kanyakumari gari student.
http://www.youtube.com/watch?v=tiGM8LqzzDQ
http://www.youtube.com/watch?v=f84XPRw-RHY&feature=relmfu
Post a Comment