(బిజినెస్ మాన్ సినిమా గురించి అనుకుని వస్తే సారీ...)
నేను ఆఫీసుకు రోజూ ఇదే రూట్లో వెళ్తూ చూసుంటా ఈ గుడిని! విశాలంగా, శుభ్రంగా, ఎక్కువ జన సమ్మర్థం లేకుండా (ఇది ముఖ్యం) ప్రశాంతంగా హాయిగా కనిపించే ఈ ఆలయాన్ని ఒకరోజు చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటుంటే నిన్న సెలవు రోజు కుదిరింది.
సెలవు రోజైనా తోసుకు చచ్చేంత రష్ లేదు. సావకాశంగా గుడి అంతా తిరిగి ఫొటోలు తీసుకున్నాను. ఫొటో గ్రఫీ నిషిద్ధం అని బోర్డు ఉంది కదాని తటపటాయిస్తోంటే పూజారే స్వయంగా తీసుకోమని అనుమతి ఇచ్చాడు. గర్భాలయంలో తప్ప ఏవైనా తీసుకోమన్నాడు.
గుడి ప్రాంగణమంతా చాలా శుభ్రంగా ఉంది. గోడల మీద మంచి శిల్పాలున్నాయి. రాతి శిల్పాలు కావు,. సిమెంట్ తో మలిచినవే అయినా అందంగా ఉన్నాయి. దశావతారాలు,రామాయణ ఘట్టాలు,ఇంకా కృష్ణ లీలలు వగైరాలు గోడల మీద మలిచారు. వాటిలోంచి కొన్ని నచ్చిన ఫొటోలు ___________
గోపురం మీద వాలిన పావురాలు ఒక్కసారిగా ఎగిరినపుడు ____________
గీత
మరో కోణం
నీ వలపే బృందావనం
నీ పిలుపే మురళీ రవం
సింహా
సీతాపహరణం
వరాహం
కల్కి
బయటి నుంచి
ఇంకా..బయటి నుంచి (ఆ వెనకాల కనపడే తెల్ల గోపురం, యాంటెన్నాలూ గుడివి కావు. తెరాస ఆఫీసువి)
అన్నట్టు ఈ గుడి బజారా హిల్స్ రోడ్ నెంబర్ 10, 12 కలిసే చోట ఎమ్మెల్యేస్ కాలనీ లో ( (TRS ఆఫీసు పక్కనే) ఉంది.